చంద్రయాన్‌ 3 ఎఫెక్ట్‌ – ఇన్వెస్టర్లను లాభాల మీద ల్యాండ్‌ చేసిన స్పేస్‌ స్టాక్స్‌

[ad_1]

Space-related Stocks: చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 సక్సెస్‌ఫుల్‌ ల్యాండింగ్ తర్వాత, స్పేస్‌ రిలేటెడ్‌ కంపెనీల స్టాక్స్‌ ఈ రోజు (గురువారం, 24 ఆగస్టు 2023) మార్కెట్‌లో 12% వరకు ర్యాలీ చేశాయి.

చంద్రయాన్-3 విజయవంతం తర్వాత ఫోకస్‌లోకి వచ్చిన స్టాక్స్‌ లిస్ట్‌:

1) గోద్రెజ్ ఇండస్ట్రీస్: ఈ కంపెనీ అనుబంధ విభాగం గోద్రెజ్ ఏరోస్పేస్, ఇస్రోకి కీలక విడిభాగాలను సరఫరా చేసింది. గత మూడు దశాబ్దాల్లో, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV), జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) లాంచ్‌ల కోసం ఈ కంపెనీ 175 పైగా ఇంజిన్లకు విడిభాగాలు సప్లై చేసింది. నిన్న 7% పెరిగిన గోద్రెజ్ ఇండస్ట్రీస్ షేర్లు, ఈ రోజు మరో 3% జంప్‌తో ర్యాలీని కొనసాగించాయి.

2) పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్: డిఫెన్స్ & స్పేస్ ఆప్టిక్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, హెవీ ఇంజనీరింగ్ మొదలైన విభాగాల్లో ప్రత్యేకత కలిగిన ఈ కంపెనీ, చంద్రయాన్-3 కోసం నావిగేషన్ సిస్టమ్‌ను సరఫరా చేసింది. నిన్న 5% ర్యాలీ తర్వాత, ఈ రోజు ఈ స్టాక్ 12% పైగా పెరిగింది.

3) MTAR టెక్నాలజీస్: టర్బో పంప్, బూస్టర్ పంప్‌ సహా వికాస్ ఇంజిన్స్‌, క్రయోజెనిక్ ఇంజిన్ సబ్‌ సిస్టమ్స్‌ను సరఫరా చేయడంలో MTAR పాత్ర ఉంది. మంగళయాన్ మిషన్‌లో ఉపయోగించిన PSLV-C25 ఇంజిన్‌ను కూడా ఈ కంపెనీయే సప్లై చేసింది. ఈ కంపెనీ షేర్లు నిన్న 5% లాభంతో ముగియగా, ఈ రోజు మరో 8% దూసుకెళ్లాయి.

5) మిశ్ర ధాతు నిగమ్: హైదరాబాద్‌కు చెందిన PSU మెటల్ కంపెనీ మిశ్రా ధాతు నిగమ్, చంద్రయాన్‌ మిషన్‌ కోసం ఉపయోగించిన లాంచ్ వెహికల్‌లోని వివిధ భాగాల కోసం కోబాల్ట్ బేస్ అల్లాయ్‌, నికెల్ బేస్ అల్లాయ్‌, టైటానియం మిశ్రమాలు, స్పెషల్‌ స్టీల్స్ వంటి కీలక మెటీరియల్స్‌ సరఫరా చేసింది. నిన్న 3% పైగా అప్‌సైడ్ తర్వాత, ఈ రోజు ఈ స్టాక్ దాదాపు 2% పెరిగింది.

6) భెల్‌: PSU కంపెనీ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, చంద్రయాన్-3 కోసం టైటానియం ట్యాంకులు, బ్యాటరీలను అందించింది. BEHL షేర్లు 1% పైన ట్రేడ్‌ అవుతున్నాయి.

7) L&T: లార్సెన్ & టూబ్రో ఏరోస్పేస్ విభాగం కూడా కీలక కాంపోనెంట్స్‌ సరఫరా చేసింది. బూస్టర్ సెగ్మెంట్ల తయారీ, టెస్టింగ్‌ నిర్వహించింది. ఈ హెవీ వెయిట్ స్టాక్ ఈ రెండు రోజుల్లో దాదాపు 3% ర్యాలీ చేసింది.

8) భారత్ ఎలక్ట్రానిక్స్: చంద్రయాన్-3 పేలోడ్‌ల తయారీలో ఈ కంపెనీ పాల్గొంది. ఈ రోజు భారత్ ఎలక్ట్రానిక్స్ స్టాక్ 2% లాభపడింది.

9) సెంటమ్‌ ఎలక్ట్రానిక్స్: స్పేస్ అప్లికేషన్స్‌ కోసం ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ డిజైన్, డెవలప్‌మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్‌ను అందించే సెంటమ్‌ ఎలక్ట్రానిక్స్, నిన్న 14% జూమ్ అయింది. ఈ రోజు మరో 10% ర్యాలీతో టాప్‌ ప్లేస్‌లో ఉంది.

10) అవాంటెల్: హైదరాబాద్‌కు చెందిన ఏరో స్పేస్ & డిఫెన్స్ కంపెనీ అవాంటెల్ కస్టమర్ల లిస్ట్‌లో ఇస్రో కూడా ఉంది. ఈ కంపెనీ షేర్లు ఈ రోజు 8% పైగా లాభంతో కదులుతున్నాయి.

మరో ఆసక్తికర కథనం: షాక్‌ కొడుతున్న ఆభరణాలు – ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *