జర్మనీలో ఉద్యోగాల ఖాళీలు.. ఏడాదికి 60,000 మందిని నియమించుకోవాలని నిర్ణయం

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Jobs In Germany: జర్మనీలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి గుడ్‌న్యూస్. ఈ దేశం తన ఇమ్మిగ్రేషన్, నైపుణ్యాల శిక్షణతో పాటు వెస్ట్రన్ బాల్కన్ దేశాల నుంచి వలసలను ప్రోత్సహించడంపై డ్రాఫ్ట్ సంస్కరణలను తీసుకొచ్చింది. దీని ద్వారా తమ దేశంలో ఉన్న కార్మికుల కొరతను తీర్చాలని నిర్ణయించింది.

జర్మన్ లేబర్ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం ఉద్యోగ ఖాళీల సంఖ్య 20 లక్షలకు చేరింది. ఈ క్రమంలో ప్రపంచ ఆటోమెుబైల్ రాజధానిగా ఉన్న జర్మనీ భవిష్యత్తు సంక్షోభాన్ని నివారించటమే లక్ష్యంగా సంస్కరణలను తీసుకొస్తోంది. వీటికి ఓలాఫ్ స్కోల్జ్ ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నైపుణ్యం కలిగిన కార్మికుడిగా దేశ ఆర్థిక విజయానికి సహకరించే ఎవరైనా తాము స్వాగతిస్తామని ఆర్థిక మంత్రి క్రిస్టియన్ లిండ్నర్ ట్వీట్ చేశారు.

ఏడాదికి 60,000 మందిని నియమించుకోవాలని నిర్ణయం

జర్మన్ లేబర్ బేస్‌ను కాపాడటం రాబోయే దశాబ్దాల్లో దేశ భవిష్యత్తుకు అతిపెద్ద ఆర్థిక నిర్ణయమని జర్మనీ కార్మిక మంత్రి హుబెర్టస్ హీల్ అన్నారు. ఈ సంస్కరణల్లో భాగంగా జర్మనీకి వలస వచ్చినవారికి.. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ వెలుపలి నుంచి వచ్చేవారికి కీలకమైన అడ్డంకులను పరిష్కరించడానికి జర్మన్ ప్రభుత్వం కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని రూపొందించాలని యోచిస్తోంది. ముసాయిదా చట్టం ప్రకారం EU వెలుపల నుండి వచ్చే కార్మికుల సంఖ్యను సంవత్సరానికి 60,000 మంది పెంచవచ్చని రాయిటర్స్ నివేదిక వెల్లడించింది.

చట్ట ప్రకారం విదేశీ కార్మికుల ప్రవేశానికి మూడు మార్గాలు..

– జర్మనీలో గుర్తింపు పొందిన వృత్తి లేదా విశ్వవిద్యాలయ డిగ్రీ, ఉద్యోగ ఒప్పందం కలిగి ఉండాలి

– సంబంధిత సెక్టార్లో కనీసం రెండేళ్ల పాటు పనిచేసిన అనుభవం, డిగ్రీ లేదా వృత్తి శిక్షణ అవసరం

– ఉద్యోగం సంపాదించుకునే సత్తా ఉన్న వ్యక్తులకు జాబ్ ఆఫర్ లేని పక్షంలో ‘Opportunity card’ ద్వారా దేశంలోకి ప్రవేశించవచ్చు.

English summary

Germany got with new immigration laws to employ 60,000 people a yearasJob vacancies hit record highs

Germany got with new immigration laws to employ 60,000 people a year as Job vacancies hit record highs

Story first published: Friday, March 31, 2023, 15:29 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *