జాబిల్లి కక్ష్యలో చంద్రుడి ఫోటోలు తీసిన చంద్రయాన్-3.. షేర్ చేసిన ఇస్రో

[ad_1]

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై అధ్యయనానికి పంపిన చంద్రయాన్-3 ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకెళ్తోంది. ఈ క్రమంలో భూకక్ష్య నుంచి శనివారం చంద్రుడి కక్ష్యలోకి ఆర్బిటర్‌ను ప్రవేశపెట్టారు. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్-3.. అక్కడ ఉపరితలం ఫోటోలను తీసింది. ఈ ఫోటోలను చంద్రయాన్-3 మిషన్ అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేసింది. జులై 14న చంద్రయాన్-3 ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి చంద్రుడికి మూడింట రెండు వంతుల దూరాన్ని కవర్ చేసి శనివారం విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో తెలిపింది. కక్ష్యలోకి ప్రవేశించిన వెంటనే అక్కడ ఉపరితలం ఫోటోలను తీసిందని పేర్కొంది.

శనివారం లూనార్ ఆర్బిట్ ఇన్సెర్షన్ ప్రక్రియ చేపట్టే సమయంలో స్పేస్ క్రాఫ్ట్ ఇంజిన్‌ను మండించారు. ఇది శక్తివంతమైన బ్రేకులా పని చేస్తుంది. స్పేస్ క్రాఫ్ట్ వెళ్తున్న దిశకు వ్యతిరేకంగా ఆన్‌బోర్డ్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను మండించడం వల్ల స్పేస్ క్రాఫ్ట్ వేగం తగ్గుతుంది. భూమి, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుంటూ.. వ్యౌమనౌక వేగంగా ప్రయాణించేలా ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టింది. క్రమంగా స్పేస్ క్రాఫ్ట్ వేగం తగ్గడం వల్ల సాఫ్ట్ ల్యాండింగ్‌ జరుగుతుంది. లూనార్ కక్ష్యలో చంద్రుడి గురుత్వాకర్షణ బలం ప్రభావం ఉంటుంది.

దీని వల్ల క్రమంగా అది చంద్రుడి స్థిర కక్ష్యలోకి లాగబడుతుంది. ఈ క్రమంలో మాడ్యుల్ వేగం, చంద్రుడి గురుత్వాకర్షణ, థ్రస్ట్ దిశ మధ్య సమతౌల్యత అవసరం. అంతా అనుకున్న ప్రకారమే జరిగితే ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఉపరితలం మీద సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది. మాడ్యూల్ ఎత్తును క్రమంగా తగ్గించి, చంద్రుని చుట్టూ 100 కి.మీ. దీర్ఘవృత్తాకార కక్ష్యలో దాన్ని ఉంచడం కోసం ఇస్రో అనేక విన్యాసాలు చేపడుతుంది. ఆగస్టు 6 రాత్రి మరోసారి ఇంజిన్‌ను మండించి.. చంద్రయాన్ కక్ష్యను పెంచారు. మళ్లీ ఆగస్టు 9న కూడా మరోసారి విన్యాసాలు చేపడతారు. ఈ సమయంలోనే ప్రొపల్షన్ మాడ్యూల్.. ల్యాండర్ నుంచి ఆర్బిటర్ విడిపోతుంది. ల్యాండర్ చంద్రుడి ఉపరితలం వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

విక్రమ్ ల్యాండర్‌ను సురక్షితంగా చంద్రుడి ఉపరితలం మీద దించేందుకు వచ్చే రెండు వారాలు ఇస్రోకు ఎంతో కీలకం కానున్నాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ అనంతరం విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రజ్ఞ‌ాన్ రోవర్.. అక్కడ వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయనుంది. ఈసారి ప్రయోగం విజయవంతం అవుతుందని నమ్మకం పెట్టుకున్నారు.

Read More Latest Science & Technology News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *