జీవితాంతం పెద్ద మొత్తంలో పెన్షన్‌ వస్తుంది, పెట్టుబడి కూడా తిరిగొస్తుంది

[ad_1]

LIC Jeevan Akshay Policy: ప్రభుత్వ జీవిత బీమా కంపెనీ ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ ‍‌(LIC) లాంచ్‌ చేసిన ప్లాన్స్‌లో జీవన్‌ అక్షయ్‌ పాలసీ ఒకటి. ఇది ఒక విభిన్నమైన ప్లాన్‌. ఇందులో పెట్టుబడి పెడితే, పాలసీదారు బతికి ఉన్నంత కాలం నెలనెలా పెన్షన్‌ వస్తుంది. పాలసీదారు మరణాంతరం, పెట్టుబడి డబ్బు మొత్తం నామినీకి వస్తుంది. అంటే, జీవితాంతం పెన్షన్‌ తీసుకోవడంతో పాటు, మరణాంతరం ఒక పెద్ద మొత్తాన్ని తన వాళ్లకు ఆస్తిగా ఇవ్వొచ్చు. 

‘ఎల్‌ఐసీ జీవన్‌ అక్షయ్‌ పాలసీ’లో మరో విశేషం ఏంటంటే.. సింగిల్‌ ప్రీమియం ‍‌(Single Premium). ఈ పాలసీ తీసుకుంటే, కేవలం ఒక్కసారి ప్రీమియం కడితే సరిపోతుంది. అంటే, కట్టాల్సిన డబ్బు మొత్తాన్ని వన్‌ టైమ్‌ పేమెంట్‌ (One time payment) చేయాలి. నిర్ణీత కాలం తర్వాత, ప్రతి నెలా 20 వేల రూపాయల మొత్తాన్ని ఈ స్కీమ్‌ తిరిగి ఇస్తుంది. ఇలా, పాలసీదారు బతికి ఉన్నంత కాలం (ఎంత కాలమైనా) డబ్బులు వస్తూనే ఉంటాయి.

రిస్క్ లేని, ఎలాంటి టెన్షన్ పెట్టని పెట్టుబడి మార్గం కోసం చూస్తున్న వాళ్లకు ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ పథకం ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌ (best investment option) అవుతుంది. 

జీవన్‌ అక్షయ్‌ పాలసీ వయో పరిమితి
ఈ పాలసీని కొనుగోలు చేయాలంటే, పాలసీదారు వయస్సు 30 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో (ఎల్‌ఐసీ ఏజెంట్‌ ద్వారా) దీనిని కొనుగోలు చేయవచ్చు. సింగిల్‌ అకౌంట్‌ మాత్రమే కాదు, మరొకరితో కలిసి జాయింట్‌గానూ జీవన్ అక్షయ్ పాలసీని తీసుకునే ఆప్షన్‌ కూడా ఉంది.

ప్రీమియం వివరాలు
ఇది సింగిల్‌ ప్రీమియం ప్లాన్‌ కాబట్టి, దీనిలో కనీస పెట్టుబడి ఒక లక్ష రూపాయలు. జాయింట్‌గా పాలసీ తీసుకుంటే, ప్రతి ఒక్కరు కనీసం లక్ష రూపాయలు కట్టాలి. 

ఆదాయం 
ఈ స్కీమ్‌లో నెలకు కనీసం రూ. 12 వేలు చేతికి వస్తుంది.  నెలవారీగా లేదా మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి లేదా ఏడాదికి ఒకసారి చొప్పున ఈ డబ్బు తీసుకోవచ్చు. పెట్టుబడి పెట్టిన నిర్ణీత కాలం తర్వాత, ప్రతి నెలా పెన్షన్‌ రూపంలో డబ్బు తిరిగి పొందుతారు. మీ పెట్టుబడి ఎంత ఎక్కువ ఉంటే, అంత ఎక్కువ పెన్షన్ లభిస్తుంది.

యాన్యుటీ ఆప్షన్స్‌ 
జీవన్‌ అక్షయ్‌ పాలసీ కింద 10కి పైగా యాన్యుటీ ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి. పాలసీ ప్రారంభంలోనే, గ్యారెంటీ యాన్యుటీ రేట్‌ ఎంతో పాలసీదారుకు తెలుస్తుంది. పాలసీదారు ఎంచుకున్న ఆప్షన్‌ను బట్టి నెలవారీ రాబడి కొద్దిగా మారుతుంది.

పెట్టుబడి తిరిగి చెల్లింపు
పాలసీదారు, తన జీవితాంతం పెన్షన్ పొందే అవకాశం ఇందులో ఉంది. పాలసీదారుడు మరణిస్తే పెన్షన్ ఆగిపోతుంది. పాలసీ ప్రారంభ సమయంలో పెట్టిన పెట్టుబడి డబ్బు నామినీకి అందుతుంది.

ఆదాయ పన్ను మినహాయింపు
ఎల్‌ఐసీ జీవన్‌ అక్షయ్‌ పెన్షన్ స్కీమ్‌లో పెట్టిన పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. 

నెలకు రూ.20 వేలు తీసుకోవాలంటే ఎంత ప్రీమియం కట్టాలి?
ఒక వ్యక్తి, ఎల్‌ఐసీ జీవన్‌ అక్షయ్‌ పాలసీలో సింగిల్‌ ప్రీమియంగా రూ.9,16,200 జమ చేస్తే.. నెలకు రూ.6,859 చేతికి వచ్చే అవకాశం ఉంది. సంవత్సరానికి రూ.86,265… ఆరు నెలలకు రూ.42,008… మూడు నెలలకు రూ.20,745 పొందుతారు. నెలనెలా 20 వేల రూపాయల పెన్షన్ పొందాలనుకుంటే, పాలసీదారు ఏక మొత్తంగా 40 లక్షల 72 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. 

మరో ఆసక్తికర కథనం: ఝున్‌ఝున్‌వాలా గేమింగ్‌ కంపెనీలోకి జీరోధ, ఎస్‌బీఐ ఎంట్రీ – వందల కోట్ల పెట్టుబడి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *