[ad_1]
Term Insurance For Self Employed People: దేశంలో వివిధ బీమా ఉత్పత్తులకు (Insurance products) డిమాండ్ పెరిగింది. ప్రజల్లో అవగాహన పెరుగుతున్న కొద్దీ, ఎక్కువ బీమా ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్ పట్ల ప్రజల్లో అవగాహన మెరుగుపడిందని ఇటీవలి నివేదిక చెబుతోంది. గతంలో, స్వయం ఉపాధి పొందే వ్యక్తులు (Self Employed People) సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్‌కు దూరంగా ఉండేవాళ్లు. ఇప్పుడు, టర్మ్ ఇన్సూరెన్స్‌ను ఎక్కువగా కొంటున్నారు.
ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్‌కు సంబంధించి ప్రజల్లో అవగాహనపై, పాలసీ బజార్ (Policy Bazaar) ఒక సర్వే చేసి నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం, ఇటీవలి కాలంలో, స్వయం ఉపాధి పొందే వ్యక్తుల నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ కోసం డిమాండ్ 10 శాతం పెరిగింది. ఈ డిమాండ్ పెరగడానికి గల కారణాలను కూడా పాలసీ బజార్ వివరించింది.
టర్మ్ ఇన్సూరెన్స్‌లో డిమాండ్ వృద్ధికి కారణాలు
పాలసీ బజార్ రిపోర్ట్ ప్రకారం, స్వయం ఉపాధి పొందే వ్యక్తులు టర్మ్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడంలో గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే, చాలా బీమా ఎంపికలు రెగ్యులర్ ఇన్‌కమ్/జీతం పొందే వ్యక్తుల కోసం వాటిని రూపొందించాయి. దీంతోపాటు, ఫామ్-16 వంటి పేపర్ వర్క్, ఆదాయానికి సంబంధించిన పూర్తి సమాచారం అవసరం. ఈ కారణంగా, రెగ్యులర్ ఇన్‌కమ్/జీతం లేని వ్యక్తులు సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు యులిప్ (ULIP – Unit linked Insurance Plan) పాపులర్ ఆప్షన్‌గా మారింది. దీంతో, సొంత వ్యాపారాలు నడుపుతున్న వ్యక్తులు కూడా టర్మ్ ప్లాన్స్‌లో పెట్టుబడి పెడుతున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) మొదటి అర్ధభాగంలో, అంటే 2023 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు కొన్న పాలసీల ఆధారంగా పాలసీ బజార్ ఈ రిపోర్టును రూపొందించింది. ఆ నివేదిక ప్రకారం, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల నుంచి ఆదాయ రుజువులు అడగని పథకాల వాటా ఈ ఆరు నెలల్లో 51% పైగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఇది 36%గా ఉంది.
యులిప్ నుంచి కీలక సహకారం
రిపోర్ట్ ప్రకారం, స్వయం ఉపాధి పొందే వ్యక్తుల నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ కోసం పెరిగిన డిమాండ్‌లో యులిప్‌ది కీలక పాత్ర. దీని వాటా 41%. అత్యంత ప్రజాదరణ పొందిన యులిప్‌లలో టాటా స్మార్ట్ సంపూర్ణ రక్ష-పరం రక్షక్, HDFC స్మార్ట్ ప్రొటెక్ట్, బజాజ్ ఇన్వెస్ట్ ప్రొటెక్ట్ గోల్, మ్యాక్స్ స్మార్ట్ ఫ్లెక్సీ ప్రొటెక్ట్ సొల్యూషన్ ఉన్నాయి. ఈ పథకాలను ఆదాయ ధృవీకరణ అవసరం లేకుండానే కొనొచ్చు.
సాంప్రదాయ యులిప్‌లు వార్షిక ప్రీమియం కంటే 10 రెట్లు వరకు లైఫ్ కవర్ అందిస్తాయి. చేస్తాయి. ఎందుకంటే వాటి లక్ష్యం రాబడిని అందించడం మాత్రమే. కొత్త తరం యులిప్‌లు గరిష్టంగా 200 రెట్లు లైఫ్ కవర్‌ను అందిస్తాయి.
స్వయం ఉపాధి పొందే వ్యక్తులు తమ వార్షిక ఆదాయానికి దాదాపు 10 రెట్లు ఎక్కువ బీమా కవరేజీని ఎంచుకుంటున్నారు
స్వయం ఉపాధి పొందే వ్యక్తులు 26 సంవత్సరాల వయస్సు నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటున్నారు
స్వయం ఉపాధి పొందుతూ టర్మ్ ఇన్సూరెన్స్ కొన్న వాళ్లలో మగవాళ్లు 89 శాతం కాగా, ఆడవాళ్లు 11 శాతం మాత్రమే
టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే స్వయం ఉపాధి వ్యక్తుల్లో మహారాష్ట్ర ముందుంది. మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో దిల్లీ, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. దక్షిణ భారత దేశంలో… కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తొలి స్థానాల్లో నిలిచాయి.
మరో ఆసక్తికర కథనం: మీ పీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేయడం చాలా సులభం – 2 నిమిషాల్లో అప్లై చేయండిలా!
[ad_2]
Source link
Leave a Reply