డబ్బు పుట్టించగల 4 ఎక్స్‌పర్ట్‌ ఐడియాలు, షార్ట్‌టర్మ్‌లో ధనవర్షం కురుస్తుందట!

[ad_1]

Stock Market Ideas: అటు సెన్సెక్స్ & ఇటు నిఫ్టీ రెండింటిలో లాభాలతో సెప్టెంబర్‌ నెలను ఈక్విటీ మార్కెట్లు ముగించాయి, గత శుక్రవారం హెడ్‌లైన్‌ ఇండెక్స్‌లు తలో 0.5% పెరిగాయి. లిక్విడిటీ లేని కారణం, బేర్స్‌ను ఓవర్‌టేక్‌ చేయగల పాజిటివ్‌ ట్రిగ్గర్లు లేకపోవడం వల్ల మార్కెట్ అధిక స్థాయిలలో గట్టి రెసిస్టెన్స్‌ ఎదుర్కొంటోందని మార్కెట్‌ ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. టెక్నికల్‌గా చూస్తే, నాలుగు స్టాక్స్‌ సమీప కాలంలో 27% వరకు ర్యాలీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. సెబీ రిజిస్టర్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ మనీష్‌ షా ఈ టిప్స్‌ను చెప్పారు.

షార్ట్‌ టర్మ్‌లో డబ్బు పుట్టించగల 4 ఐడియాలు:

ఎల్‌&టి ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ (L&T Finance Holdings)
రేటింగ్‌: బయ్‌;  కొనాల్సిన రేంజ్‌: రూ. 132- 134;  టార్గెట్‌ ప్రైస్‌: రూ. 143;  స్టాప్‌ లాస్‌: రూ. 126; ప్రస్తుత స్థాయి నుంచి ఎంత పెరగొచ్చు: 8%
L&T ఫైనాన్స్ హోల్డింగ్స్, గత వారం, సగటు కంటే ఎక్కువ వాల్యూమ్స్‌తో ఇటీవలి స్వింగ్ హై నుంచి పైకి ఎదిగింది. ప్రస్తుతం ఆరోగ్యకరమైన అప్‌ట్రెండ్‌లో ఉంది. 14-డేస్‌ RSI వంటి మొమెంటం రీడింగ్స్‌ కూడా రైజింగ్ మోడ్‌లో ఉన్నాయి, ఓవర్‌బాట్‌లోకి చేరలేదు. టెక్నికల్‌గా చూస్తే… ఈ స్టాక్‌లో అప్‌ట్రెండ్ కొనసాగడానికి ఇది మంచి సూచన.

అజంత ఫార్మా (Ajanta Pharma )
రేటింగ్‌: బయ్‌;  కొనాల్సిన రేంజ్‌: రూ. 1780-1800;  టార్గెట్‌ ప్రైస్‌: రూ. 1930;  స్టాప్‌ లాస్‌: రూ. 1680; ప్రస్తుత స్థాయి నుంచి ఎంత పెరగొచ్చు: 8%
అజంత ఫార్మా సెప్టెంబరులో టెస్ట్‌ చేసిన ఇంటర్మీడియట్ గరిష్ట స్థాయి రూ. 1905 స్థాయి నుంచి కరెక్షన్‌కు గురైంది, ఇటీవల రూ. 1665 స్థాయిలో సపోర్ట్‌ తీసుకుంది. గత ఇంటర్మీడియట్ కనిష్టం & 50-డేస్‌ SMAతో సమానంగా ఈ మద్దతు ఉంది. కాబట్టి దీనిని బలమైన మద్దతుగా చూడవచ్చు. టెక్నికల్‌ ఇండికేటర్లు కూడా సానుకూల సంకేతాలను ఇస్తున్నాయి.

శోభ లిమిటెడ్‌ ‍‌(Sobha Ltd)
రేటింగ్‌: బయ్‌;  కొనాల్సిన రేంజ్‌: రూ. 706;  టార్గెట్‌ ప్రైస్‌: రూ. 800-900;  స్టాప్‌ లాస్‌: రూ. 670; ప్రస్తుత స్థాయి నుంచి ఎంత పెరగొచ్చు: 27%
రియల్ ఎస్టేట్ రంగంలో శోభ ఒక ఔట్ పెర్ఫార్మింగ్ స్టాక్. దీని ప్రైస్‌ ట్రెండ్‌ దీర్ఘకాలిక బుల్లిష్‌నెస్‌ను చూపుతోంది. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో, 20-డేస్‌ మూవింగ్ యావరేజ్, 50-డేస్‌ మూవింగ్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉంది. ఇది కొనుగోళ్ల సంకేతం. డైలీ టైమ్‌ ఫ్రేమ్‌లో, 2-వీక్‌ అసెండింగ్‌ ట్రయాంగిల్‌లోకి ప్రైస్‌ యాక్షన్‌ మారింది, ఈ ప్యాట్రన్‌ను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ వెళ్తోంది. 

కళ్యాణ్ జ్యువెలర్స్ (Kalyan Jewelers)
రేటింగ్‌: బయ్‌;  కొనాల్సిన రేంజ్‌: రూ. 227;  టార్గెట్‌ ప్రైస్‌: రూ. 260-280;  స్టాప్‌ లాస్‌: రూ. 205; ప్రస్తుత స్థాయి నుంచి ఎంత పెరగొచ్చు: 23%
కళ్యాణ్ జ్యువెలర్స్, రూ. 260 గరిష్ట స్థాయి నుంచి ప్రస్తుత స్థాయి 220కి కరెక్టివ్ డిక్లైన్‌ చూసింది. వీక్లీ టైమ్‌ ఫ్రేమ్‌లో బలమైన అప్‌ ట్రెండ్‌లో కదులుతోంది, ప్రస్తుత డిస్కౌంట్‌ ప్రైస్‌ దగ్గర కొనుగోలు చేయడం ఒక మంచి అవకాశం. రూ. 260 నుంచి కనిపించిన క్షీణత, ఫ్లాగ్ ట్రెండ్ నమూనాకు కంటిన్యూషన్‌గా లెక్కించవచ్చు. ఫ్లాగ్‌ ట్రెండ్‌లో కొనసాగింపు పాట్రన్‌ బుల్లిష్‌నెస్‌ను సూచిస్తుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఈస్ట్‌ నుంచి వెస్ట్‌ వరకు చాలా తలనొప్పులు, రెపో రేటును తగ్గించే అవకాశం లేనట్లే!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *