[ad_1]
అవిసె గింజలు, ఫ్రూట్ స్మూతీ ..
ఈ స్పెషల్ స్మూతీ కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. ఉదయం మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇది తీసుకుంటే.. రోజంతా బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది.
ఇలా తయారుచేసుకోండి..
- స్ట్రాబెర్రీ, అరటిపండు, కివీ ముక్కలు – 1 కప్పు
- నానబెట్టిన అవిసెగింజలు – 2 టేబుల్ స్పూన్లు
- లో ఫ్యాట్ సోయా పాలు – 1 కప్పు
పైన పేర్కొన్న పదార్థాలన్నీ మిక్స్ చేయండి. మీకు నచ్చితే.. స్మూతీలో పెరుగు కూడా యాడ్ చేసుకోండి.
రాగి ఊతప్పం..
రాగులు షుగర్ పేషెంట్స్‌కు ఎంతగానో మేలు చేస్తాయి. రాగులలో ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. రాగులు మీ బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకుంటే.. ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. కడుపును నిండుగా ఉంచుతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ ఉంచుకోవడానికి సహాయపడుతుంది. రాగులలో ప్రొటీన్, క్యాల్షియం, విటమిన్ డి, ఐరన్ మెండుగా ఉంటాయి. ఇవి షుగర్ పేషెంట్స్‌కు మేలు చేస్తాయి.
రాగి ఊతప్పం ఇలా తయారు చేసుకోండి..
- రాగి పిండి – 1 కప్పు
- క్యారెట్ తురుము 25 గ్రా
- ఉల్లిపాయ 1
- నెయ్యి 1 టీస్పూన్
- ఉప్పు రుచికోసం
- జీలకర్ర – తగినంత
- కరివేపాకు – రెండు రెబ్బలు
- అల్లం ముక్కలు – 1 టీ స్పూన్
రాగి పిండిలో క్యారెట్ తురము, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, అల్లముక్కలు, ఉప్పు వేసి.. నీటిలో థిక్ బ్యాటర్‌లా కలపండి. ప్యాన్ వేడి చేసి, దానిపై నెయ్యి వేసి ఈ బ్యాటర్‌ను ఊతప్పంలా వేయండి. దానిపై మూత పెట్టింటి. మంట సిమ్‌లో ఉండాలి. ఐదు నిమిషాలు ఆగిన తర్వాత, దీన్ని తిప్పి రెండోవైపు కాల్చండి. రెండో వైపు కాలిన తర్వాత.. ప్లేట్‌లోకి తీసుకుని టేస్టీ.. టేస్టీ రాగి ఊతప్పం ఎంజాయ్ చేయండి.
శనగపిండి అట్టు..
శనగపిండి షుగర్ పేషెంట్స్‌కు ఎంతో మంచిది. దీనిలో ఫైబర్, ఫ్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. దీనిలో గ్రైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రక్తంలోకి గ్లూకోజ్ నమ్మదిగా వెళ్లేలా చేస్తుంది. దీనిలో విటమిన్ సి,బి6,పోలేట్,నియాసిన్, థైమీన్,మాంగనీస్, ఫాస్సరస్, ఐరన్, కాపర్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. శనగపిండి మన డైట్‌లో చేర్చుకుంటే.. గుండె జబ్బులు దూరం అవుతాయి.. బీపీని అదుపులో ఉంచుతుంది. కాల్షియం, మెగ్నిషియం ఎముకలు, కండరాల వృద్ధికి తోడ్పడుతాయి.
ఇలా తయారు చేసుకోండి..
- శనగపిండి – ఒక కప్పు
- బియ్యం పిండి – పావు కప్పు
- ఉప్పు – తగినంత
- జీలకర్ర – అర టీ స్పూన్
- అల్లం పచ్చిమిర్చి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
- క్యారెట్ తురుము – అర కప్పు
- చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1
ఇవన్నీ మిక్స్ చేసుకుని నీటితో దోశ పిండిలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టౌవ్ మీద ప్యాన్ పెట్టి.. దోశలా వేసుకోండి. దాని మీద కొంచెం ఆయిల్ వేయండి. ఒకవైపు కాలిన తర్వత, మరోవైపుకు తిప్పి మళ్లి కాల్చండి. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్‌లోకి తీసుకోండి.
వెజిటెబుల్ ఆమ్లెట్..
గుడ్డులోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనకు తెలుసు. గుడ్డు షుగర్ పేషెంట్స్‌కు మంచిదని నిపుణులు చెబుతున్నారు. సిడ్నీ యూనివర్సిటీ’ పరిశోధకులు జరిపిన అధ్యయనం ప్రకారం గుడ్డు డయాబెటిక్ పేషెంట్స్‌కు మేలు చేస్తుంది. ఏడాదిపాటు వారానికి 12 గుడ్లు చొప్పున తింటే డయాబెటీస్, టైప్-2 డయాబెటీస్ బాధితులకు గుండె జబ్బుల ముప్పు ఉండదట. (Image source – pixabay)
వెజిటెబుల్ ఆమ్లెట్ ఇలా తయారు చేసుకోండి..
- చిన్న ఉల్లిపాయ – 1
- చిన్న క్యాప్సికమ్ – 1
- గుడ్లు – 2
- పాలు – టేబుల్ స్పూన్లు
- ఉప్పు తగినంత
- పచ్చిమిర్చి – 2
స్టౌవ్ మీద నాన్‌స్టిక్ ప్యాన్ వేడి చేసి.. దానిపై 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని కరిగించండి. ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి 4-5 నిమిషాలు వేయించండి. దానిపై కొంచెం ఉప్పు వేసి ఒకసారి తిప్పి.. గిన్నెలోకి తీసుకోండి. వీటిలో పాలు, ఉప్పు, పచ్చిమిచ్చి ముక్కలు వేసి బీట్ చేయండి. ప్యాన్ మీద 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఈ మిక్స్‌ను వేయండి. రెండు నిమిషాలు కాల్చిన తర్వాత.. ఆమ్లెట్ తిప్పి రెండో వైపుకు టర్న్ చేయండి. ఇదీ కాలిన తర్వాత.. ప్లేట్‌లోకి తీసుకుని ఎంజాయ్ చేయండి. (Image source – pixabay)
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply