డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల కలిగే లాభాలు

[ad_1]

డార్క్ చాక్లెట్స్ మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతే కాదు, వీటిని తినడం వల్ల గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల 7 అద్భత ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..

పోషకాలు..

కోకో కంటెంట్ ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్స్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు ఫైబర్‌, ఖనిజాలు ఉంటాయి. అదనంగ, ఇందులో పొటాషియం, ఫాస్పరస్, జింక్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే, ఇందులో కొద్దిగా చక్కెర కూడా ఉంటుంది. కాబట్టి, మితంగానే తీసుకోవాలి. కోకో, డార్క్ చాక్లెట్ ఫ్యాటీ యాసిడ్ కూడా ఉంది. కొవ్వులో ఎక్కువగా ఒలేయిక్ యాసిడ్, స్టెరిక్ యాసిడ్, పాల్మిటిక్ యాసిడ్స్ ఉంటాయి. స్టెరిక్ ఆమ్లం శరీర కొలెస్ట్రాల్‌‌పై ప్రభావాన్ని చూపిస్తుంది. పాల్మిటిక్ యాసిడ్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. అయితే, ఇది మొత్తం కొవ్వు కేలరీల్లో మూడింట ఒక వంతు మాత్రమే. డార్క్ చాక్లెట్స్‌లో కెఫిన్, థియోబ్రోమిన్ వంటివి కూడా ఉంటాయి. కాఫీతో పోలిస్తే కెఫిన్ తక్కువగానే ఉంటుంది. కాబట్టి పర్లేదు, మితంగా తీసుకోవచ్చు.

డార్క్ చాక్లెట్స్‌లో పాలీఫెనాల్స్, ఫ్లేవనోల్స్, కాటెచిన్స్ ఉన్నాయి. పరిశోధన ప్రకారం, డార్క్ చాక్లెట్స్‌లోని పాలీ ఫెనాల్స్ బాదం, కోకో వంటి ఆహారాలతో కలిపినప్పుడు కొన్ని రకాల చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సాయపడతాయి.

కోకో, డార్క్ చాక్లెట్స్‌లలో బ్లూ బెర్రీస్, అకాయ్ బెర్రీస్ వంటి పండ్ల కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంటీ యాక్టివిటీ, పాలీఫెనాల్స్, ఫ్లేవనోల్స్ ఉన్నాయని అధ్యయనం చెబుతోంది.

కోకో, డార్క్ చాక్లెట్స్‌లో అనేక రకాల శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. వాస్తవానికి, ఇతర ఆహారాల కంటే ఎక్కువగా ఉంటాయి.

​బీపిని తగ్గించడం..

డార్క్ చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్స్ నైట్రిక్ ఆక్సైడ్‌ని ఉత్పత్తి చేయడానికి ధమనుల లైనింగ్ అయిన ఎండోథెలియంను ప్రేరేపిస్తాయి. నైట్రిక్ యాక్సైడ్ ధమనులకి రెస్ట్ తీసుకునేందుకు సిగ్నల్స్ ఇవ్వడం, రక్త ప్రవాహానికి నిరోధకతను తగ్గిస్తుంది. అందువల్ల రక్తపోటుని తగ్గిస్తుంది. అనేక అధ్యయనాలు కోకో, డార్క్ చాక్లెట్ రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి.

అయినప్పటికీ, టైప్ 2 డయాబెటిస్, హైబీపి ఉన్నవారిలో ఓ అధ్యయనం ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. ఇప్పటికే బీపికి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న వ్యక్తులు తమ డైట్‌లో కోకో ఫ్లేవనాల్స్‌ని యాడ్ చేయడం వల్ల బెనిఫిట్స్‌ని పొందలేకపోవచ్చు. కోకోలోని బయోయాక్టివ్ సమ్మేళనాలు ధమనుల్లో రక్త ప్రవాహాన్ని మెరుగ్గా చేస్తాయి. రక్తపోటులో కాస్తా తగ్గుదల ఉంటుంది.

​కొవ్వు పెరగకుండా..

HDL ని పెంచుతుంది. LDLని ఆక్సీకరణం నుండి రక్షిస్తుంది. డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులకు సంబంధించిన ప్రమాద కారకాలు మెరుగుపడతాయి. ఇవి కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తాయి.

ఓ అధ్యయనంలో, ఫ్లేవనాల్ లైకోపీన్‌తో అనుబంధంగా ఉన్న డార్క్ చాక్లెట్ తినడం మొత్తం కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని తేలింది.

డార్క్ చాక్లెట్‌లోని ఫ్లేవనోల్స్ ఇన్సులిన్ నిరోధకతను కూడా తగ్గిస్తాయి. ఇది గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధులకు ప్రమాద కారకం. అందుకే వీటిని తినడం వల్ల ఈ సమస్యలకు కాస్తా దూరంగా ఉన్నట్లే.

అయితే డార్క్ చాక్లెట్‌లో చక్కెర కూడా ఉంటుంది. ఇది శరీరానికి మంచిది కాదని గుర్తుపెట్టుకోండి.

డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు.

​గుండె జబ్బులు దూరం..

డార్క్ చాక్లెట్‌లోని సమ్మేళనాలు చెడు కొవ్వుకి వ్యతిరేకంగా పనిచేస్తాయి. దీంతో ఆర్టరీస్ అంటే ధమనుల్లో కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. ఈ కారణంగా గుండె జబ్బులు తగ్గుతాయి. వాస్తవానికి పరిశోధన చాలా తీవ్రమైన అభివృద్ధిని చూపుతుంది. కాలక్రమేణా, అనేక అధ్యయనాలు ఫ్లేవనోల్, రిచ్ కోకో, చాక్లెట్ తీసుకోవడం వల్ల బీపి తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.

వారానికి 3 సార్లు చాక్లెట్స్ తినడం వల్ల గుండె సంబంధ సమస్యలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రెగ్యులర్‌గా చాక్లెట్స్ తింటే అదనపు ప్రయోజనాలు ఉంటాయి. వారానికి 45 గ్రాముల చాక్లెట్స్ తినడం వల్ల గుండె సంబంధ సమస్యల ప్రమాదం 11 శాతం తగ్గుతుందని మరో పరిశోధన చెబుతోంది. వారానికి 100 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. గుర్తుంచుకోండి.

కొన్ని పరిశోధనలు డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల గుండె సమస్యల ముప్పుని తగ్గించుకోవచ్చని చెబుతున్నాయి.

Also Read : Protein powder : ప్రోటీన్ పౌడర్‌తో బరువు తగ్గుతారా..

​చర్మ రక్షణగా..

డార్క్ చాక్లెట్స్‌లో బయోయాక్టివ్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ స్కిన్‌ని రక్షిస్తాయి. ఫ్లేవనోల్స్ సూర్యరశ్మి నుండి రక్షించేందుకు హెల్ప్ చేస్తాయి. చర్మానికి రక్త ప్రవాహాన్ని మెరుగ్గా మారుస్తుంది. చర్మాన్ని అందంగా కనిపించేలా చేస్తుంది. 12 వారాల పాటు ఎక్కువగా ఫ్లేవనాల్ డార్క్ చాక్లెట్, కోకో తీసుకున్నవారి చర్మం అందంగా మెరుస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అదనంగా ఎండ నుంచి రక్షణగా కూడా ఉంటుందని చెబుతున్నారు.

బీచ్ వెకేషన్‌కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నప్పుడు కొన్ని రోజుల ముందు నుంచే డార్క్ చాక్లెట్స్‌ని తినండి. అయితే ఎంత మోతాదులో తినాలంటి ఎలాంటి చర్మ సంరక్షణ జాగ్రత్తలు తీసుకోవాలో మీ స్కిన్ స్పెషలిస్ట్‌ని కనుక్కోవడం మంచిది. అదే విధంగా, సన్ స్క్రీన్ రాయడం మరువొద్దు.

కోకోలోని ఫ్లేవనోల్స్ చర్మానికి రక్తప్రవాహాన్ని మెరుగుపరిచి, ఎండ నుంచి చర్మం దెబ్బతినకుండా కాపాడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Also Read : Pista : పిస్తాపప్పులు తింటే గుండెకి మంచిదా..

​మెరుగ్గా మెదడు పనితీరు..

డార్క్ చాక్లెట్స్ తినడం మీ బ్రెయిన్ హెల్త్‌క్ కూడా చాలా మంచిది. ఎక్కువ ఫ్లేవనాల్స్ ఉన్న కోకో తినడం వల్ల యువకుల్లో మెదడుకు రక్త ప్రసరణ మెరుగ్గా మారుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి రోజూ కోకోతో జ్ఞాపకశక్తి, శ్రద్ధ మెరుగుపడుతుందని చెబుతున్నారు.

కోకో ఫ్లేవనాయిడ్స్ వృద్ధుల్లో మెదడుపనితీరుని మెరుగ్గా చేస్తుంది. కోలో కెఫిన్, థియోబ్రోమిన్ వంటి పదార్థాలు మెదడు పనితీరును మెరుగుపరిచేందుకు ముఖ్య కారణం.

కోకో, డార్క్ చాక్లెట్ రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కోకో శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా, గుండెజబ్బులకి రక్షణగా ఉంటుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.

Also Read : Heart attack : చలికాలంలో గుండెనొప్పులు రాకుండా ఏం చేయాలంటే..

​చివరిగా..

అయితే మంచిది కదా అని మీరు ప్రతిరోజూ తినాలని కాదు. మోతాదులో తినాలి. సాధారణంగా డార్క్ చాక్లెట్స్ చిన్న చతురస్త్రాకారంలో దొరుకుతాయి. అవి తినొచ్చు. అవి కూడా డాక్టర్‌ని కనుక్కుని తక్కువ మోతాదులో మాత్రమే.

మార్కెట్లో ప్రతి డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మంచిది కాదని గుర్తుంచుకోండి. అందులోని పదార్థాలను గమనించండి. 70 శాతం, అంతకంటే ఎక్కువ కోకో కంటెంట్‌తో డార్క్ చాక్లెట్ ఉంటే తినడం బెస్ట్.

డార్క్ చాక్లెట్స్‌లో కొద్దిగా చక్కెర ఉంటుంది. ఎక్కువ ముదురు రంగులో ఉన్న చాక్లెట్స్‌లో తక్కువ చక్కెర ఉంటుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *