డెడ్‌లైన్స్‌ ఇన్‌ డిసెంబర్‌, వీటిని సకాలంలో పూర్తి చేయకపోతే మీకే నష్టం!

[ad_1]

Deadlines in December 2023: క్యాలెండర్‌లో పేజీ మారగానే మన దేశంలో కొన్ని విషయాలు కూడా మారుతుంటాయి. బ్యాంక్‌లు, స్టాక్‌ మార్కెట్‌, బీమా, వ్యాపార వ్యవహారాలు, నగదు చెల్లింపులకు సంబంధించిన రూల్స్‌లో ఛేంజ్‌ కనిపిస్తుంది. కొన్ని పనులు పూర్తి చేయాడనికి డెడ్‌లైన్స్‌ ఆ నెలతో ముగుస్తుంటాయి. అవన్నీ ప్రత్యక్షంగా/పరోక్షంగా మన డబ్బు మీద ప్రభావం చూపుతుంటాయి. కాబట్టి, ప్రతి నెలా జరిగే మార్పులను గమనిస్తూ ఉండడం చాలా ముఖ్యం.

డిసెంబర్‌ నెలలోనూ కొన్ని అంశాలు మారబోతున్నాయి. పైగా, డిసెంబర్‌ అంటే సంవత్సరంలో ఆఖరి నెల. కాబట్టి, సంవత్సరాంతంలో జరిగే మార్పులు కూడా డిసెంబర్‌కు యాడ్‌ అవుతాయి. 

కొన్ని బ్యాంకులు రన్‌ చేస్తున్న ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు డిసెంబర్‌ నెల చివరి గడువుగా ఉంది. ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేయడానికి, మ్యూచువల్‌ ఫండ్‌ & డీమ్యాట్‌ అకౌంట్‌లో నామినీ పేరును జోడించడానికి, యూపీఐ ఐడీలు డీయాక్టివేట్‌ కావడానికి, బ్యాంక్‌ లాకర్‌ అగ్రిమెంట్‌ చేసుకోవడం సహా మరికొన్ని విషయాలకు డిసెంబర్‌లోనే డెడ్‌లైన్స్‌ ఉన్నాయి.

2023 డిసెంబర్‌ నెలలోని డెడ్‌లైన్స్‌:

ఆధార్‌ వివరాల ఉచిత అప్‌డేషన్‌ (Free updation of Aadhaar details): 
ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవడానికి ఉడాయ్‌ (UIDAI) అవకాశం కల్పించింది. ఆధార్‌ వివరాల ఉచిత అప్‌డేషన్‌ గడువు డిసెంబరు 14, 2023తో ముగుస్తుంది. ఈ డెడ్‌లైన్‌ దాటాక ఆధార్‌ అప్‌డేట్‌ చేయాలంటే రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

UPI ఐడీల రద్దు (Deactivation of UPI IDs): 
ఏడాదికి పైగా వాడని UPI (Unified Payment Interface) ఐడీలు, నంబర్లను రద్దు ‍‌(Deactivation) చేయాలని నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NCPI) ఆదేశించింది. గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌ పే, బ్యాంకులకు NCPI నుంచి ఆదేశాలు అందాయి. మీరు గత ఏడాది కాలంలో ఒక్కసారి కూడా యూపీఐ ఐడీని ఉపయోగించకపోతే, ఆ ఐడీ రద్దవుతుంది.

నామినీ జత చేశారా? ‍‌(Adding the nominee’s name): 
మ్యూచువల్‌ ఫండ్‌, డీమ్యాట్‌ అకౌంట్లలో నామినీ పేరును యాడ్‌ చేయడానికి సెబీ (SEBI) ఇప్పటికే చాలాసార్లు గడువు పెంచింది, తాజా డెడ్‌లైన్‌ డిసెంబరు 31, 2023తో ముగుస్తుంది. నామినీ పేరుతో పాటు పాన్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలు కూడా అదే తేదీ నాటికి అప్‌లోడ్‌ చేయాలి. లేకపోతే మీ అకౌంట్‌ డీయాక్టివేట్‌ అయ్యే అవకాశం ఉంది.

బ్యాంక్‌ లాకర్‌ అగ్రిమెంట్‌  (Bank locker agreement): 
మీకు బ్యాంక్‌ లాకర్‌ ఉంటే ఈ అప్‌డేట్‌ మీ కోసమే. బ్యాంక్‌ లాకర్‌ కోసం కొత్త అగ్రిమెంట్‌ చేసుకోవడానికి గడువు కూడా డిసెంబర్‌తో ముగుస్తుంది. గత ఏడాది డిసెంబర్‌ 31 కంటే ముందు అగ్రిమెంట్‌ ఇచ్చిన వాళ్లు, ఈ ఏడాది కూడా డిసెంబరు 31లోగా ఆ అగ్రిమెంట్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. 

ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌ ఎఫ్‌డీ పథకం (SBI Amrit Kalash FD Scheme): 
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ‘అమృత్‌ కలశ్‌’ గడువు డిసెంబర్‌ 31, 2023తో ముగుస్తుంది. ఈ స్కీమ్‌లో చేసే డిపాజిట్ల మీద 7.10 శాతం పైగా వడ్డీ ఆదాయం వస్తుంది. 

ఎస్‌బీఐ హోమ్‌లోన్‌ ఆఫర్‌ ‍‌(SBI Home Loan Offer): 
గృహ రుణం తీసుకోవాలనుకొనే వారి కోసం ఎస్‌బీఐ ఇప్పుడు ఒక ప్రత్యేక ఆఫర్‌ రన్‌ చేస్తోంది. సిబిస్‌ స్కోర్‌ను బట్టి హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్ల మీద గరిష్ఠంగా 65 బేసిస్‌ పాయింట్ల (0.65%) వరకు రాయితీ (Discount on SBI Home Loan Interest Rate) ఇస్తోంది. 

బ్యాంక్‌ స్పెషల్‌ ఎఫ్‌డీలు (Bank Special FDs): IDBI అమృత్‌ మహోత్సవ్‌ 375 డేస్‌, 444 డేస్‌ పథకాల్లో చేరడానికి డిసెంబరు 31, 2023 ఆఖరు తేదీ. ఇండియన్‌ బ్యాంక్‌ ‘ఇండ్‌ సూపర్‌ 400 డేస్‌’, ‘ఇండ్‌ సూపర్‌ 300 డేస్‌’ పేరుతో తీసుకొచ్చిన ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాల్లో చేరే ఛాన్స్‌ కూడా డిసెంబర్‌ 31తో ముగుస్తుంది.

మరో ఆసక్తికర కథనం: రిలయన్స్‌, ఎస్‌బీఐ కార్డ్ సహా 7 పాపులర్‌ స్టాక్స్‌ – ఇవి మీ దగ్గర ఉంటే జాగ్రత్త!

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *