తక్కువ ధరకే బంగారం.. కేవలం ఐదు రోజులే ఛాన్స్.. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని మిస్ కాకండి..

[ad_1]

గోల్డ్ బాండ్స్..

గోల్డ్ బాండ్స్..

కష్టకాలంలో సురక్షితమైన పెట్టుబడి ఎంపిక అనగానే మనందరికీ గుర్తుకువచ్చేది బంగారం. అందుకే ద్రవ్యోల్బణ సమయంలో రిజర్వు బ్యాంక్ పెట్టుబడిదారులకు ఒక సదవకాశాన్ని అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుత సంవత్సరం 2022-23లో సిరీస్ IIIని ప్రజల ముందుకు తీసుకొస్తోంది. ఇది ఐదు రోజుల పాటు అంటే డిసెంబర్ 19 నుంచి 23 వరకు అందుబాటులో ఉండనుంది. దీనికి సంబంధించిన డిజిటల్ బాండ్లను కంపెనీ డిసెంబర్ 27న జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

భద్రతతో పాటు రాయితీలు..

భద్రతతో పాటు రాయితీలు..

గోల్డ్ బాండ్స్ ద్వారా వడ్డీ రేటు, పన్ను రాయితీ, భద్రత, డిజిటల్ ఫార్మాట్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. పైగా అత్యవసర సమయంలో బంగారాన్ని తాకట్టు పెట్టినట్లుగా దీనిని సైతం తాకట్టు పెట్టి రుణాన్ని తీసుకునేందుకు వెసులుబాటు కూడా ఉంటుంది. RBI జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్స్ డిజిటల్ రూపంలో కొనుగోలు విక్రయం చేయవచ్చు.

బాండ్ ధర..

బాండ్ ధర..

ఇష్యూకి ముందు మూడు రోజుల పాటు ఇండియన్ బులియన్ అండ్ జువెలరీ అసోసియేషన్ లిమిటెడ్ ద్వారా నిర్ణయించబడిన ధరకు సగటును బాండ్ ధరగా నిర్ణయించటం జరుగుతుంది. పైగా ఆన్‌లైన్ కొనుగోలుదారులకు గ్రాముపై రూ.50 తగ్గింపు కూడా ఉంది. ఎవరైనా వ్యక్తి ఒక్క గ్రాము నుంచి గరిష్ఠంగా 4 కేజీల వరకు బంగారాన్ని బాండ్స్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. అదే ట్రస్టులు గరిష్ఠంగా ఏడాదికి 20 కేజీల వరకు కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. వీటిని బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

వడ్డీ ప్రయోజనం..

వడ్డీ ప్రయోజనం..

గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయటం వల్ల వచ్చే అధనపు ప్రయోజనాల్లో వడ్డీ కూడా ఒకటి. బాండ్లను కొన్న ఇన్వెస్టర్లు ఏడాదికి తమ పెట్టుబడిపై 2.5% వడ్డీ రేటును పొందుతారు. అయితే వడ్డీ మీ ఆదాయానికి జోడించబడుతుంది. మీరు దానిపై ఆదాయపు పన్ను చెల్లించాలి.. కానీ వడ్డీ ఆదాయంపై ఎలాంటి టీడీఎస్ విధించబడదు. స్టాక్ ఎక్స్ఛేంజీలో వీటిని ట్రేడ్ చేయటానికి ఇన్వెస్టర్ డీమ్యాట్ ఖాతాను తప్పక కలిగి ఉండాల్సి ఉంటుంది.

 పెట్టుబడి మెచూరిటీ వివరాలు..

పెట్టుబడి మెచూరిటీ వివరాలు..

గోల్డ్ బాండ్ స్కీమ్ 8 ఏళ్ల మెచ్యూరిటీని కలిగి ఉంటుంది. అయితే 5 సంవత్సరాల తర్వాత బాండ్లను విక్రయించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఎవరైనా ఇన్వెస్టర్ 8 ఏళ్ల పాటు పెట్టుబడిని కొనసాగిస్తే.. వారికి విక్రయించినప్పుడు ఉండే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ విధించబడదు. ఇది కాకుండా మధ్యలోనే నిష్క్రమిస్తే మాత్రం ఆర్జించిన లాభాలపై పన్ను తప్పక చెల్లించాల్సి ఉంటుంది. ఫిజికల్ బంగారానికి డిమాండ్ తగ్గించేందుకు తీసుకొచ్చిన ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.

తరువాతి సిరీస్..

తరువాతి సిరీస్..

బంగారం ధరలు పెరుగుతున్న తరుణంలో గణనీయమైన ఆదాయం పొందటానికి, కుమార్తె వివాహం కోసం ప్లాన్ చేసుకునే వారికి ఈ స్కీమ్ సరైన ఎంపిక అని చెప్పుకోవచ్చు. అందుకే దీని తరువాతి సిరీస్ గోల్డ్ బాండ్స్ విక్రయాుల 2023 మర్చి 6 నుంచి 10 మధ్య జరుగుతాయని తెలుస్తోంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ప్రభుత్వ పెట్టుబడి పథకాన్ని ప్రజలు తప్పక వినియోగించుకోవాలని రిజర్వు బ్యాంక్ సూచిస్తోంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *