తత్కాల్‌లోనూ టికెట్ దొరకడం లేదా?, ఈ ట్రిక్‌ ప్రయత్నించి చూడండి

[ad_1]

Train Ticket Booking: మన దేశ ప్రజల జీవితాల్లో రైలు ప్రయాణం ఒక భాగం. ప్రతి రోజూ కోట్లాది మంది ప్రజలు వందలాది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. పండుగలు, వేసవి సెలవుల సమయంలో రైళ్లలో రద్దీ చాలా రెట్లు పెరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు వేరొక ప్రాంతానికి వెళ్లడానికి రిజర్వేషన్‌ సీట్‌ అంత త్వరగా దొరకదు. ఆ పరిస్థితిలో ప్రజలు తత్కాల్ టిక్కెట్లను ఆశ్రయిస్తుంటారు. రద్దీ కారణంగా అవి కూడా అందుబాటులో ఉండడం లేదు. ప్రీమియం తత్కాల్‌ ప్రయత్నించినా సీట్‌ దొరకని పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సందర్భం మీకు ఎదురైతే.. ఒక సులభమైన ఉపాయంతో కన్ఫర్మ్‌డ్‌ టిక్కెట్‌ను సులభంగా (Trick to Book Confirm Train Ticket) పొందవచ్చు. IRCTC మాస్టర్ లిస్ట్‌ను ఉపయోగించి టికెట్ బుక్‌ చేయడమే ఆ ట్రిక్‌.

మాస్టర్ లిస్ట్‌ అంటే ఏంటి?
ప్రతి ప్రయాణీకుడు తన సొంత మాస్టర్ లిస్ట్‌ (IRCTC Master List) రూపొందించుకోవడానికి IRCTC అనుమతిస్తుంది. ఇంతకీ మాస్టర్ లిస్ట్ ఏంటి అనే ప్రశ్న మీ మదిలో మెదులుతోంది కదా?. ప్రయాణీకుల పేర్లు, వయస్సు, ఇతర వివరాలను ముందుగా కలిగి ఉండేదే మాస్టర్‌ లిస్ట్‌. టికెట్‌ బుకింగ్ చేసే సయమంలో ప్రయాణీకుల వివరాలను పూరించడానికి బదులుగా, మాస్టర్ లిస్ట్‌ నుంచి ప్రయాణీకుల వివరాలను మీరు చిటికెలో జోడించవచ్చు. ఇది మీ బుకింగ్ సమయాన్ని ఆదా చేస్తుంది, టిక్కెట్‌ కన్ఫర్మేషన్‌ పొందే అవకాశాలను పెంచుతుంది. IRCTC యాప్‌లోని ప్రొఫైల్ విభాగంలోకి వెళ్లి ఈ జాబితాను తయారు చేయవచ్చు. మాస్టర్ జాబితాను ఎలా సిద్ధం చేయాలో, దానిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మాస్టర్ లిస్ట్‌ సిద్ధం చేయడం:
ముందుగా IRCTC యాప్‌ ఓపెన్‌ చేయండి
ఆ తర్వాత, My Account ను ఎంచుకోవడం ద్వారా My Master List కు వెళ్లవచ్చు.
ఇంతకుముందే మీరు ఏ లిస్ట్‌నూ ఇక్కడ సృష్టించకపోతే, ఎటువంటి రికార్డ్‌ ఇక్కడ కనిపించదు. ఇప్పుడు OK క్లిక్ చేయండి.
ఇప్పుడు Add Passengers పై క్లిక్ చేయండి.
మీ పేరు, వయస్సు, ఇతర వివరాలతో పాటు మీతో పాటు ప్రయాణం చేసే వాళ్ల వివరాలు పూర్తి చేయండి.
ఆ తర్వాత SAVE చేయండి.

టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు మాస్టర్ లిస్ట్‌ ఎలా ఉపయోగించాలి?
టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు Plan My Journey పై క్లిక్ చేయండి.
ఇప్పుడు స్టేషన్, తేదీని ఎంచుకోండి.
ఆ తర్వాత Go to Passenger Details కు వెళ్లండి.
Add Passengers ఆప్షన్‌కు వెళ్లి, మాస్టర్ జాబితా నుంచి ప్రయాణీకుల పేర్లను టిక్‌ చేయండి. దీనివల్ల, టిక్కెట్‌ బుకింగ్‌ కోసం ఆటోమేటిక్‌గా అన్ని వివరాలు ఫిల్‌ అవుతాయి.
ఆ వెంటనే డబ్బులు చెల్లించండి, మీ టిక్కెట్ బుక్‌ అవుతుంది.
Master List కారణంగా, టిక్కెట్ బుకింగ్ కాల వ్యవధి తగ్గుతుంది. అందువల్లే తత్కాల్‌ టిక్కెట్‌ బుక్ చేసుకునే సమయంలో కన్ఫర్మ్‌డ్‌ టిక్కెట్‌ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *