తెలంగాణలో ఇకపై అర్థరాత్రి కూడా షాపింగ్‌- గుడ్‌ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

[ad_1]

<p>తెలంగాణలో వ్యాపారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలు 24 గంటలు తెరిచేలా ప్రభుత్వం అంగీకరించింది. దీంతో వ్యాపార వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది.&nbsp;</p>
<p>కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని పేరుతో విడుదలైన జీవో ప్రకారం తెలంగాణలో షాపింగ్ మాల్స్&zwnj;, దుకాణాలు 24 గంటలూ తెరిచేలా అనుమతి ఇచ్చారు. దీని కోసం ఏటా ప్రభుత్వానికి పదివేల రూపాయలు చెల్లించాలి. తెలంగాణ షాప్స్&zwnj; అండ్&zwnj; ఎస్టాబ్లిష్&zwnj;మెంట్&zwnj; యాక్ట్&zwnj; 1988కు సవరణలు చేసిన ప్రభుత్వం ఈ మేరకు 24 గంటలు షాపులు తెరిచేలా అనుమతి ఇచ్చారు.&nbsp;</p>
<p>ఇలా 24 గంటల పాటు తెరిచి ఉంచేందుకు షాపులు, షాపింగ్ మాల్స్&zwnj; నిర్వాహకులు కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. సిబ్బందికి ఐడీ కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. వారికి వీక్లీహాలిడేస్ మస్ట్&zwnj;గా ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. కచ్చితమైన పని గంటల్లో వారితో పని చేయంచుకోవాలి. ఓవర్&zwnj; టైం చేస్తే మాత్రం ప్రత్యేక వేతనం ఇవ్వాలి. పండగలు, సెలవు దినాల్లో పని చేసేవారికి కాంపెన్సేటరీ లీవులు కూడా ఇవ్వాలి.</p>
<p>మహిళా ఉద్యోగులకు ప్రత్యేక వేతనం ఇవ్వాలి. రాత్రి షిఫ్టులో పని చేసేందుకు అంగీకరిస్తేనే మహిళలకు డ్యూటీలు వేయాలి. వారికి తగిన భద్రత కల్పించాలి. వారికి రవాణా సౌకర్యం కూడా కల్పించాలి. రికార్డులను సరిగా నిర్వహించాలి. పోలీస్&zwnj; యాక్ట్ రూల్స్ మస్ట్&zwnj;గా ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఉంటే తప్ప అలాంటి షాపులను 24 గంటలూ తెరిచేలా అనుమతులు ఇవ్వబోరు.&nbsp;</p>

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *