దడ పుట్టిస్తున్న బంగారం రేటు, నేడు ఘోరంగా పెరుగుదల – వెండి కూడా అంతే

[ad_1]

తెలుగు రాష్ట్రాల్లో నేడు కూడా ఊహించని విధంగా బంగారం ధర (Todays Gold Rate) పెరిగింది. వెండి ధర మాత్రం నేడు కిలోకు రూ.800 పెరిగింది. నేడు పది గ్రాములకు ఏకంగా రూ.400 వరకూ బంగారం ధర ఎగబాకింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.51,300 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.55,960 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.71,800 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
Gold Rates Today విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,300 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,960గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.71,800 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.51,300 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.55,960 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,800 గా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర (Todays Gold Rate) ఇలా..
అయితే, ఇతర నగరాల్లో బంగారం ధర నేడు పెరిగింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.52,210గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,960 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,300 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,960 గా ఉంది.

ప్లాటినం ధర నేడు (Todays Platinum Rate) ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర కూడా నేడు విపరీతంగా పెరిగింది. ఏకంగా గ్రాముకు రూ.70 చొప్పున ఎగబాకింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.28,830 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.

live reels News Reels

అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *