నష్టాల సుడిగుండంలో BSNL.. దెబ్బేసిన AGR బకాయిలు

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

BSNL:
గతంలో

వెలుగు
వెలిగిన
ప్రభుత్వ
రంగ
టెలికాం
సంస్థ
భారత్
సంచార్
నిగమ్
లిమిటెడ్
పరిస్థితి
ప్రస్తుతం
ఏమంత
బాగాలేదు.
భారీ
నష్టాల్లో
కూరుపోతోంది.
2023
ఆర్థిక
సంవత్సరంలో
సంస్థ
లాస్
8
వేల
161
కోట్లకు
చేరింది.
FY23లో
నమోదైన
6
వేల
981
కోట్లతో
పోలిస్తే
పెద్దఎత్తున
పెరిగింది.

ప్రభుత్వానికి
సర్దుబాటు
చేయబడిన
స్థూల
రాబడి
(AGR)
బకాయిల
కేటాయింపే
ఏకీకృత
నష్టాలు
పెరగడానికి
ప్రధానం
కారణంగా
కనిపిస్తోంది.
ఎందుకంటే,
17
వేల
688
కోట్ల
విలువైన
AGR
బకాయిలను
BSNL
ప్రభుత్వానికి
అందించింది.
16
వేల
189
కోట్ల
వయబిలిటీ
గ్యాప్
ఫండింగ్
ను
పొందింది.
తద్వారా
అనూహ్యంగా
1,499
కోట్ల
నష్టాన్ని
చవిచూడాల్సి
వచ్చింది.

నష్టాల సుడిగుండంలో BSNL.. దెబ్బేసిన AGR బకాయిలు

ఇక
BSNL
మొత్తం
ఖర్చులు
5.1
శాతం
పెరిగి
27
వేల
364
కోట్లకు
చేరాయి.
జీతాలు,
వేతనాలు,
అలవెన్సులు
మరియు
ఇతర
ప్రయోజనాలతో
కూడిన
ఉద్యోగుల
వ్యయమే
ఇందులో
7
వేల
952
కోట్ల
వరకు
ఉన్నట్లు
తెలుస్తోంది.
FY22తో
పోలిస్తే
11
శాతం
పెరిగిందన్నమాట.
అయితే
ప్రభుత్వ
లక్ష్యాన్ని
కంపెనీ
అధిగమించడం
విశేషం.
తన
కార్యకలాపాల
ద్వారా
వచ్చే
ఆదాయంలో
14
శాతం
వృద్ధిని
సాధించింది.
సంస్థ
ఆర్థిక
నివేదికల
ప్రకారం
FY22లో
16
వేల
811
కోట్లుగా
ఉన్న

రాబడి
FY23లో
19
వేల
130
కోట్లకు
పెరిగింది.

ఆయా
సర్కిళ్ల
పరంగా
చూస్తే..
2023లో
కేరళ
నుంచి
BSNL
ఆదాయం
దాదాపు
2%
తగ్గి
1,656
కోట్లకు
చేరుకుంది.
కర్ణాటక,
జమ్మూ
&
కాశ్మీర్,
పంజాబ్,
అండమాన్
మరియు
నికోబార్,
UP
(పశ్చిమ),
గుజరాత్,
చెన్నై
మరియు
తెలంగాణాల్లో
సైతం
ఆదాయం
భారీగా
పడిపోయింది.
దీనికి
తోడు
మార్చి
చివరి
నాటికి..
BSNL
వైర్‌లెస్
సబ్‌స్క్రైబర్
బేస్
103.6
మిలియన్లుగా
ఉంది.
దేశంలోని
టాప్
4
ప్రముఖ
టెలికాం
ఆపరేటర్‌లతో
పోలిస్తే
ఇదే
అత్యల్పం.
గత
15
నెలల్లో
కంపెనీ
దాదాపు
11
మిలియన్ల
సబ్‌స్క్రైబర్‌లన
సైతం
కోల్పోయింది.

English summary

BSNL extends its losses above 8k Cr in FY23

BSNL extends its losses above 8k Cr in FY23

Story first published: Wednesday, May 31, 2023, 8:09 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *