నిద్ర లేవగానే బ్యాంకులో రూ.4 కోట్లు! హ్యాపీగా గోల్డ్‌ కొన్నాడు – జైలుకెళ్లాడు!

[ad_1]

Viral News:

రాత్రి మీరు నిద్రపోయారు! పొద్దున్నే లేచి చూస్తే మీ బ్యాంకు అకౌంట్లో రూ.5 కోట్లు డిపాజిట్‌ అయ్యాయి. ఎవరు చేశారో తెలియదు! ఎందుకు చేశారో తెలియదు! అలాంటప్పుడు మీరేం చేస్తారు? కొందరు పరుల సొమ్ము పాము వంటిదని వెళ్లి పోలీసులకు సమాచారం అందిస్తారు. ఇంకొందరైతే ఊరించే సొమ్ము కాబట్టి ఎంతో కొంత మేర తమ అవసరాలకు ఖర్చు చేసుకుంటారు. అడిగితే ఇద్దాంలే అనుకుంటారు. మరికొందరైతే వచ్చిందే జాక్‌పాట్‌ అని మొత్తం ఖర్చు పెట్టేస్తారు.

ఆస్ట్రేలియాలో అచ్చం ఇలాగే జరిగింది. అబ్దుల్‌ గాడియా బ్యాంకు ఖాతాలో తెల్లారే సరికి 750,000 ఆస్ట్రేలియా డాలర్లు జమయ్యాయి. భారత కరెన్సీ ప్రకారం వీటి విలువ దాదాపుగా రూ.4.22 కోట్లు. ఓ యువ జంట తమ ఇంటి కొనుగోలు కోసం బ్యాంకు నంబర్‌ తప్పుగా ఎంటర్‌ చేయడంతో ఇలా జరిగింది. తెల్లారి లేవగానే డబ్బు చూసుకొని ఆశ్చర్యానికి లోనైన అబ్దుల్‌ గాల్లో తేలిపోయాడు. వెంటనే రూ.3.94 కోట్లు పెట్టి బంగారం, బట్టలు కొనేశాడు.

ఆ యువ జంట పోలీసులను ఆశ్రయించడంతో బంగారు కడ్డీలు, డిజైనర్‌ ఔట్‌ఫిట్లు, విదేశీ కరెన్సీ కొనుగోలు చేసిన అబ్దుల్‌ను వారు అరెస్టు చేశారు. బుధవారం సిడ్నీ బర్‌వుడ్‌ లోకల్‌ కోర్ట్‌లో ప్రవేశపెట్టారు. నేరాన్ని అంగీకరించడంతో న్యాయమూర్తి అతడికి 18 నెలల జైలు శిక్ష విధించారు. ఇక్కడ మరో విచిత్రం జరగడం గమనార్హం.

News Reels

ఇన్‌స్టాగ్రామమ్ న్యూట్రిషనిస్టు టారా థ్రోన్‌ ఆమె భర్త కోరె సిడ్నీ నార్తర్న్‌ బీచ్‌ వద్ద ఓ ఇంటిని కొనుగోలు చేయాలనుకున్నారు. ఓ బ్రోకర్‌ను ఈమెయిల్‌ ద్వారా సంప్రదించారు. అయితే అది హ్యాకైన ఈమెయిల్‌ అని వారికి తెలియదు. ఆ స్కామర్‌ బ్యాంకు ఖాతాకు డబ్బులు పంపించాలని కోరాడు. ఆ దంపతులు తప్పు నంబర్‌ ఎంటర్‌ చేయడంతో చివరికి గాడియా ఖాతాలో డబ్బులు పడ్డాయి.

వాస్తవంగా ఈ వ్యవహారంతో గాడియాకు ఎలాంటి సంబంధం లేదు. వచ్చిన డబ్బును అక్రమంగా ఖర్చు చేయడంతోనే జైలు పాలవ్వాల్సి వచ్చింది. ‘లేచాను. అకౌంట్లో డబ్బు చూశాను’ అని గాడియా చెప్పాడు. ఆరు లక్షల డాలర్లతో సిడ్నీలో బంగారు కడ్డీలు, బ్రిస్బేన్‌లోని ఓ స్టోర్‌లో ఖరీదైన కాయిన్ల కోసం లక్షా పదివేల డాలర్లు ఖర్చు పెట్టానన్నాడు. తన పరిస్థితిని తలుచుకొని గాడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ కవిత రాసుకోవడం గమనార్హం. తాము బదిలీ చేసిన డబ్బు మరొకరి ఖాతాలోకి వెళ్లినందుకు ఆ యువ జంట షాకైంది.




[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *