[ad_1]
దీని వల్ల భూమికి ఎటువంటి ముప్పు ఉండదని.. దీన్ని బైనాక్యులర్ సాయంతో స్పష్టంగా చూడొచ్చని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆ సమయంలో ఫుల్ మూన్ ఉంటే చూడ్డానికి కష్టం కావొచ్చని అంటున్నారు. పట్టణాల్లో లైట్ల కాంతి కంటే కూడా బయటకు వెళ్లి చూస్తే చాలా బాగా కనిపిస్తుందని కోల్‌కతాలోని బిర్లా ప్లానెటోరియం సైంటిఫిక్ ఆఫీసర్ శిల్పా గుప్తా అన్నారు. భూమికి సమీపంగా వచ్చినప్పుడు చాలా ప్రకాశవంతంగా ఉంటుందని క్యాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్ పేర్కొన్నారు.
ఒక కిలోమీటర్ పరిమాణంలో ఇది ఉంటుందని ప్యారిస్ అబ్జర్వేటరీ ఆస్ట్రో ఫిజిస్ట్ నికోలర్ బివర్ చెప్పారు. ఇదే తోకచుక్క మళ్లీ 50 వేల ఏళ్ల తర్వాతే భూమికి సమీపానికి వస్తుందని తెలిపారు. ఫిబ్రవరి 10న అంగారక గ్రహానికి సమీపంగా వస్తుందని వెల్లడించారు.
తోకచుక్క.. చుక్కలా ప్రకాశిస్తూ పొడవైన తోకతో కనువిందు చేస్తుంది. చుక్క అని పిలుచుకుంటాం గానీ వాస్తవానికి తోకచుక్కలు నక్షత్రాలు కావు. 460 కోట్ల ఏళ్ల కింద మన సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు మిగిలిపోయిన భాగాలు. ఇవి దుమ్ము, ధూళి, రాళ్లు, మంచుతో కూడుకుని ఉంటాయి. గ్రహాలు, గ్రహ శకలాల మాదిరిగానే ఇవీ సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. సూర్యుడి సమీపంగా రావడం మూలంగానే తోకలా కనిపిస్తుంది.
తోకచుక్కలు చాలావరకు నెప్ట్యూన్ ఆవలి క్యూపియర్ బెల్టులో, అంతకన్నా దూరంగా ఉండే ఊర్ట్ క్లౌడ్‌లో ఉంటాయి. తోకచుక్క మధ్యభాగాన్ని కోమా అంటారు. ఇది ఒకరకంగా గడ్డకట్టిన మంచు. క్యూపియర్ బెల్టు, ఊర్ట్ క్లౌడ్‌లోంచి బయటకు రానంతవరకు ఇవి ఈ స్థితిలోనే ఉంటాయి. అక్కడ్నుంచి బయటపడి, సూర్యుడి సమీపానికి వస్తున్నకొద్దీ కొంత మంచు కరిగి, వాయువుగా మారడ మొదలవుతుంది. ఇది దుమ్ము రేణువులతో కలిసి కోమా చుట్టూ మేఘంలా ఏర్పడుతుంది. ఈ మేఘం తోకచుక్క మధ్యభాగం నుంచి విడిపోతున్నప్పుడు సూర్యుడు, సౌరగాలి, సూర్యుడి నుంచి వచ్చే రేణువులు వెనక్కి నెడతాయి. దీంతో మేఘం పొడవుగా విస్తరించి తోక మాదిరిగా కనిపిస్తుంది. ఇది లక్షలాది మైళ్ల దూరం వరకు విస్తరించి ఉంటుంది.
[ad_2]
Source link
Leave a Reply