నైకా షేర్లు 38% పతనమైనా ‘బయ్‌ రేటింగ్స్‌’ ఎందుకు కంటిన్యూ అవుతున్నాయి?

[ad_1]

Nykaa Stock: FSN E-కామర్స్ (Nykaa) వ్యాపారం బాగానే సాగుతున్నా & గ్రోత్‌ ఆపర్చునిటీస్‌ కనిపిస్తున్నా, ఆ ఎఫెక్ట్‌ స్టాక్‌ పెర్ఫార్మెన్స్‌ను పెంచలేకపోయింది. 2022లో ఈ కంపెనీ షేర్లను నడిబజార్లో నిలబెట్టి అమ్మేశారు ఇన్వెస్టర్లు. 2023లో చాలా న్యూ-ఏజ్ కన్స్యూమర్ టెక్నాలజీ షేర్లు బాగా పుంజుకున్నాయి. “Nykaa” ఇప్పటికీ నడిబజార్లోనే ఉంది.

ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో ఇప్పటి వరకు (YTD), ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో 25% జూమ్‌ అయింది. పాలసీబజార్ ప్లాట్‌ఫామ్ ఓనర్‌ PB ఫిన్‌టెక్ 54% రాబడిని రాబట్టింది. Paytm పేరెంట్ One97 కమ్యూనికేషన్స్ 61% క్రేజీ రిటర్న్స్‌ ఇచ్చింది. వీటికి విరుద్ధంగా, Nykaa షేర్లు 7% పైగా దిగజారాయి. ఏప్రిల్‌లో 52-వారాల కనిష్ట స్థాయి రూ.114.25ని టచ్‌ చేశాయి. గత 12 నెలల్లో ఈ స్క్రిప్‌ 38% క్షీణించింది.

నైకా ఎందుకింత అధ్వాన్నంగా తయారైంది?
నైకా మెయిన్‌ ప్రోబ్లెం.. దాని టాప్ మేనేజర్లు కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోవడం. రెండో మెయిన్‌ రీజన్‌.. వ్యాపార అవకాశాలను లాభాలుగా మార్చుకోవడంలో వైఫల్యం. వీటితో పాటు మరికొన్ని కారణాలు స్టాక్‌ ప్రైస్‌ను వెనక్కు లాగుతున్నాయి.

2023 ప్రారంభంలో, ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ఆన్‌లైన్ రిటైలర్ చీఫ్ కమర్షియల్ ఆపరేషన్స్ ఆఫీసర్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్, హోల్‌సేల్‌ బిజినెస్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఫ్యాషన్స్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్, ఫైనాన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కంపెనీకి గుడ్‌బై చెప్పారు. కొన్ని నెలల క్రితమే, కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ కంపెనీ అప్పాయింట్‌ చేసింది. టెక్నాలజీ, ప్రొడక్ట్, ఫైనాన్స్, లీగల్, మార్కెటింగ్, బిజినెస్‌ వర్టికల్స్‌లోనూ కొంతమంది సీనియర్ లీడర్లను కూర్చోబెట్టింది.

రికవరీ బాట పడుతుందా?
మార్కెట్‌ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్న ప్రకారం, ఈ స్టాక్‌ ఇంతగా ఫాల్‌ అయినా, దీని వాల్యుయేషన్లు ఇప్పటికీ ఎక్కువగా, డిస్‌కంఫర్ట్‌ జోన్‌లో ఉన్నాయి. నైకా స్టాక్‌ పుంజుకోవాలంటే… బిజినెస్‌లో మరికొన్ని త్రైమాసికాల పాటు లాభాలు పెరుగుతూ ఉండాలి, వాల్యుయేషన్స్‌లో మార్పు కోసం ఓపిగ్గా చూడాలని వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్ చెబుతోంది.

నైకా బిజినెస్‌ గ్రోత్‌ అవకాశాలు భేషుగ్గా ఉన్నాయని నమ్ముతున్న జెఫరీస్ ఇండియా, నొమురా ఫైనాన్షియల్, కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్, ఎలారా క్యాపిటల్, నువామా ఈక్విటీస్‌ ఈ స్టాక్‌కు “బయ్‌” రేటింగ్‌ కంటిన్యూ చేస్తున్నాయి. 

నైకా షేర్ల యావరేజ్‌ టార్గెట్ ప్రైస్‌ రూ.200. ప్రస్తుత స్థాయి నుంచి దాదాపు 40% అప్‌సైడ్ పొటెన్షియల్‌ను ఇది సూచిస్తుంది.

ఈ స్టాక్ హిస్టారికల్‌ హై రూ.429. 2021 నవంబర్‌లో ఈ స్థాయికి వెళ్లింది. మళ్లీ ఆ రేంజ్‌ను టెస్ట్‌ చేయాలంటే, నైకా చాలా దూరం జర్నీ చేయాల్సి ఉంటుంది.

మరో ఆసక్తికర కథనం: డీసీబీ బ్యాంక్‌లోకి టాటాలకు గ్రాండ్‌ వెల్‌కమ్‌, 8% పెరిగిన షేర్లు

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *