[ad_1]
పనికి వెళ్లే ముందు ఇవి తినండి..
నైట్‌షిఫ్ట్ చేసేవారు.. ఇంటి నుంచి బయలుదేరే ముందు సిరిధాన్యాలతో తయారు చేసిన ఆహారం తీసుకుంటే మంచిదని రుజుతా దివేకర్ సూచించారు. రాగి రొట్టే, జొన్న రొట్టె, మిల్లెట్ జావ, రాగి జావ తీసుకోవాలని అన్నారు. చిరుధాన్యాలలో విటమిన్ B12, B6 , కార్బోహైడ్రేట్స్, ప్రోటిన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, జింక్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మాంసాహారంతో పోలిస్తే చిరుధాన్యాల్లో ప్రోటిన్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మిల్లెట్స్‌లో జింక్, ఫైబర్, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి.. ఇవి మీ కడుపును సంతృప్తిగా ఉంచుతాయి. చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. నైట్‌షిఫ్ట్‌లో ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు మిల్లెట్స్ తీసుకుంటే.. మీకు తినాలనే కోరిక తగ్గుతుంది, మీ శక్తి స్థాయిలను పెంచుతాయి. ఇవి మీ బరువును కూడా కంట్రోల్‌లో ఉంచుతాయి.
నిద్రపోయే ముందు ఇవి తినండి..
ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, నిద్రపోయే ముందు పాలలో గుల్కంద్ వేసుకుని, అరటిపండుతో కలిపి తీసుకోమని రుజుతా దివేకర్ సూచించారు. ఇది ఆకలి బాధలను దూరం చేస్తుంది, ప్రశాంతంగా నిద్రపోయేలా ప్రోత్సహిస్తుంది. అరటి పండు, గుల్కంద్ రెండూ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ రాత్రింతా కష్టపడిన తర్వాత.. శరీరానికి సమతుల్యతను పునరుద్దరించడానికి సహాయపడతాయి.
హైడ్రేట్‌గా ఉండండి..
నైట్ షిఫ్ట్ చేసే వారు హైడ్రేటెడ్‌గా ఉండాలని రుజుతా దివేకర్ సూచిస్తున్నారు. రాత్రి పూట నిద్ర రాకుండా చాలా మంది కాఫీ, టీలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇవి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. వీటికి బదులుగా… మజ్జిగా, సోంపు నీరు, నీరు తాగడం మంచిది. ఇవి మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, తలనొప్పి, వికారం, చిరాకు వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
Okra for diabetes: షుగర్ పేషెంట్స్ బెండకాయ తింటే మంచిదా..?
ఈ జాగ్రత్తలు పాటించండి..
ఎముకలు ధృడంగా ఉండటంలో విటమిన్ డి కీలకపాత్ర పోషిస్తుంది. నైట్ షిఫ్టులలో పనిచేసేవారిలో విటమిన్ డి లోపానికి గురయ్యే అవకాశం ఉంది. రోజూ ఉదయం శరీరానికి సూర్యరశ్మి తగిలేలా కాసేపు ఎండలో నడవండి.
నైట్ షిప్టుల్లో పనిచేసే వారు ముందుగా పగటి పూట నిద్ర పోవడానికి ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. రోజూ అదే సమయానికి నిద్రపోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Mental Health: ఈ అలవాట్లు మిమ్మల్ని మెంటల్‌గా వీక్ చేస్తాయ్..!
వీటికి దూరంగా ఉండండి..
నైట్ షిప్టుల్లో పనిచేసేవారు జంక్‌పుడ్‌కి దూరంగా ఉండాలి. జంక్‌ఫుడ్ తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయులు పెరగడంతోపాటు పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది. దీంతో పనిపై శ్రద్ధ పెట్టలేరు. వీటికి బదులుగా హెల్తీ ఫ్యాట్స్, ప్రొటీన్, విటమిన్స్, పైబర్, మినరల్స్ పుష్కలంగా ఉండే హెల్తీ స్నాక్స్ తీసుకోండి..
Thyroid Health: థైరాయిడ్‌ను ఆరోగ్యంగా ఉంచే.. మూలికలు ఇవే..!
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply