పరగడపున ఈ టీ తాగితే జీర్ణక్రియ పెరిగి బరువు తగ్గుతారట..

[ad_1]

సోంపు, యాలకులు..

సోంపు, యాలకులు..

సోంపులో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. అదే విధంగా, యాలకుల్లో విటమిన్ సి, ఐరన్, మాంగనీస్, కాల్షియం, రైబోఫ్లేవిన్ఉ, నియాసిన్, పొటాషియం, మెగ్రీషియంలు ఉన్నాయి.

వీటితో పాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే శరీరంలో కొన్ని ఆరోగ్యాలు ఉంటాయి.

మెరుగైన జీర్ణక్రియ..

మెరుగైన జీర్ణక్రియ..

సోంపు, యాలకుల టీని తాగి జీర్ణ వ్యవస్థ మెరుగ్గా మారి కడుపు సంబంధిత సమస్యల్ని దూరం చేస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియని మెరుగ్గా చేసి పేగు కదలికలు మెరుగ్గా మారతాయి. ఈ టీని తాగితే మలబద్ధం, అసిడిటీ, అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also Read : Acidity : భోజనం చేశాక ఈ నీటిని తాగితే గ్యాస్, అసిడిటీ క్షణాల్లో తగ్గిపోతుంది..

ఇరెగ్యులర్‌ పీరియడ్స్..

ఇరెగ్యులర్‌ పీరియడ్స్..

ఇక చాలా మంది మహిళలు బాధపడే ఇరెగ్యులర్ పీరియడ్స్ సమస్యకి కూడా ఈ టీ చక్కని పరిష్కారమని చెప్పొచ్చు. ఇందులో విటమిన్లు, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు పీరియడ్స్‌ని రెగ్యులర్ చేసి పీరియడ్స్ టైమ్‌లో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది.

కీళ్ళనొప్పులు..

కీళ్ళనొప్పులు..

సోంపు, యాలకుల టీని తాగితే శరీరంలో వాపు సమస్యలు తగ్గుతాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు.. శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది. ఈ టీని రోజూ ఉదయాన్నే తీసుకుంటే ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పిలు, వాపులు తగ్గుతాయి.

ఇమ్యూనిటీ..

ఇమ్యూనిటీ..

పరగడపున సోంపు, యాలకుల టీ తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. రెగ్యులర్‌గా తీసుకుంటే సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి బయటపడొచ్చు.
Also Read : Lemon Spray : ఇంట్లో తయారుచేసిన ఈ స్ప్రేతో కిచెన్‌ని క్లీన్ చేస్తే మెరుస్తుంది..

బరువు తగ్గడం..

బరువు తగ్గడం..

అధిక బరువుతో బాధపడే వారికి కూడా సోంపు, యాలకుల టీ చాలా మంచిది. ఉదయాన్నే ఖాళీ కడపుతో ఈ టీని తాగితే ఇందులోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని అదనపు కొవ్వుని తగ్గించి. జీర్ణక్రియని పెంచుతుంది. దీంతో బరువు కంట్రోల్‌లో ఉంటుంది.
గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
​​​Read More : Home remedies News and Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *