పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త: భారీగా బంగారం ధరల క్షీణత..నేడు హైదరాబాద్లో ధరలిలా!!

[ad_1]

బాగా పెరిగిన బంగారం ధరలు.. మళ్ళీ ఇప్పుడు క్రిందికి

బాగా పెరిగిన బంగారం ధరలు.. మళ్ళీ ఇప్పుడు క్రిందికి

భారతదేశంలో ముఖ్యంగా ప్రజలంతా బంగారాన్ని అమితంగా ఇష్టపడతారు. ఎవరికి ఏదైనా గిఫ్ట్ గా ఇవ్వాలన్నా, ఇళ్లలో శుభకార్యాలు జరుపుకోవాలన్నాబంగారానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.ఇక అందాన్ని ఇనుమడింపజేసే అలంకరణ గానే కాకుండా బంగారాన్ని ఆర్థిక అవసరాల కోసం ఉపయోగపడుతుందని కొనుగోలు చేసే వారు కూడా లేకపోలేదు.2022 చివర్లో,అలాగే 2023 ప్రారంభం నుండి బంగారం ధరల మోత మోగింది.విపరీతంగా ధరలు పెరిగి రెండేళ్ల గరిష్టానికి బంగారం ధరలు చేరిన పరిస్థితి ఉంది.అయితే మళ్లీ ఇప్పుడిప్పుడే బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

ఒక్క రోజులో భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

ఒక్క రోజులో భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

అయితే తగ్గుదల తక్కువగాను,బంగారం ధరల పెరుగుదల ఎక్కువగాను కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ తాజాగా అంతర్జాతీయంగా బలహీన సంకేతాలను నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఒక్కరోజులో బాగా పడిపోయాయి. బంగారం ధర ఒక్కరోజులోనే ఏకంగా 720 రూపాయల వరకు తగ్గింది. ఇక రికార్డు స్థాయిలో వెండి ధరలోనూ పతనం కనిపించింది. వెండి ధరలో 2500 రూపాయల పతనం నమోదు అయ్యింది.

తాజాగా హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా

తాజాగా హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా

తాజాగా హైదరాబాద్ లో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 50వేల 900 రూపాయలుగా కొనసాగుతుంది. సోమవారం నాడు బంగారం ధర హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారానికి 51,850 రూపాయలు ఉండగా కచ్చితంగా మూడు రోజులకి 50 వేల 900 రూపాయలకు చేరడం భారీ తగ్గుదలగా చెప్పొచ్చు. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ లో చూసినట్లయితే ప్రస్తుతం 55,530 రూపాయల వద్ద కొనసాగుతుంది. సోమవారం నాడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,550 రూపాయల వద్ద కొనసాగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధరలలోను మొన్నటికి ఈరోజుకి వెయ్యి రూపాయలకు పైగా తగ్గుదల నమోదయింది.

ఢిల్లీ, ముంబై, విశాఖ, విజయవాడలలో బంగారం ధరలు ఇలా

ఢిల్లీ, ముంబై, విశాఖ, విజయవాడలలో బంగారం ధరలు ఇలా

దేశ రాజధాని ఢిల్లీలో నేడు బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,050 రూపాయలు ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 55,680 రూపాయలుగా కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 50,900 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 55,530 కొనసాగుతుంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలలో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర విజయవాడ, విశాఖపట్నంలో 50,900 రూపాయల వద్ద కొనసాగుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విజయవాడ, విశాఖపట్నంలలో 55,530 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక బంగారం ధరలలో వివిధ నగరాలలో చిన్న చిన్న మార్పులు స్థానికంగా ఉండే పన్నుల ఆధారంగా ఉంటాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *