[ad_1]
Post Office Saving Account New Rules: పోస్ట్ ఆఫీస్‌కు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఖాతాదార్లు ఉన్నారు. కస్టమర్ల కోసం వివిధ పథకాలను పోస్టాఫీస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. బ్యాంకుల మాదిరిగానే, పోస్టాఫీసుకు వెళ్లి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. దీనిలో, పెట్టుబడి భద్రతతో పాటు మంచి రాబడికి (వడ్డీ ఆదాయం) హామీ కూడా లభిస్తుంది.పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్‌కు సంబంధించిన రూల్స్‌లో తాజాగా కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు. మీకు ఇప్పటికే పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఉన్నా, కొత్తగా ఓపెన్ చేయాలి ఆలోచిస్తున్నా.. కొత్తగా వచ్చిన మార్పుల గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.
గత నెల 3వ తేదీన (03 జులై 2023) ఒక ఈ-నోటిఫికేషన్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసింది. “పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ స్కీమ్ 2019″కు మార్పులు చేసి “పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ (అమెండ్‌మెంట్) స్కీమ్ 2023” పేరిట నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ రూల్స్‌లో కొత్తగా తీసుకొచ్చిన మార్పుల గురించి ఆ నోటిఫికేషన్‌లో తెలిపింది.
జాయింట్ అకౌంట్ కస్టమర్ల సంఖ్యలో మార్పు
ఇప్పటి వరకు, పోస్టాఫీసులో జాయింట్ అకౌంట్ (post office joint account rules) ఓపెన్ చేయాలంటే ఇద్దరు వ్యక్తులతో మాత్రమే సాధ్యపడేది. ఇద్దరికి మించి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి పోస్టాఫీస్ అనుమతించేది కాదు. తాజాగా మార్చిన నిబంధనల ప్రకారం, జాయింట్ అకౌంట్‌లో కస్టమర్ల సంఖ్యను రెండు నుంచి మూడుకు పెంచారు. ఇప్పుడు, పోస్టాఫీసు జాయింట్ అకౌంట్‌లో ఒకేసారి ముగ్గురు వ్యక్తులు కలిసి పొదుపు ఖాతా తెరవవచ్చు.
డబ్బు వెనక్కు తీసుకునే నియమాల్లోనూ మార్పు
జాయింట్ అకౌంట్ రూల్స్‌తో పాటు, ఖాతా నుంచి డబ్బు తీసుకునే నిబంధనల్లో (post office cash withdraw rules) కూడా ప్రభుత్వం మార్పులు చేసింది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ (అమెండ్‌మెంట్) స్కీమ్ 2023 ప్రకారం, ఇప్పుడు, కస్టమర్ తన పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ నుంచి డబ్బును విత్‌డ్రా చేయాలంటే ఫారం-2కు బదులు ఫారం-3ని నింపి, సంబంధిత అధికారికి సమర్పించాలి. ఈ మార్పు తర్వాత, ఇప్పుడు ఖాతాదారుడు పాస్‌బుక్ చూపించి ఖాతా నుంచి కనీసం 50 రూపాయలు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంతకు ముందు 50 రూపాయలు వెనక్కు తీసుకోవాలనుకున్నా కూడా ఫారం-2 నింపాలి, ఆ తర్వాత పాస్ బుక్ మీద సంతకం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ రూల్ మారింది.
వడ్డీ చెల్లింపు రూల్‌లో కూడా మార్పు
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ కింద, ఇప్పుడు ప్రతి నెల 10వ తేదీ నుంచి ఆ నెలలో చివరి రోజు వరకు ఉన్న అతి తక్కువ డిపాజిట్ మొత్తం మీద 4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఆ వడ్డీ మొత్తాన్ని ఏడాదికి ఒకసారి, ఆ సంవత్సరం చివరిలో సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు. ఒకవేళ, సంవత్సరం పూర్తి కాకముందే ఖాతాదారు మరణిస్తే, సేవింగ్స్ అకౌంట్ మూసివేసిన నెలకు ముందు నెలాఖరులో అతని ఖాతాలోకి వడ్డీ డబ్బులను జమ చేస్తారు.
మరో ఆసక్తికర కథనం: కొత్త పన్ను విధానానికి ఫుల్ పాపులారిటీ, ఐదున్నర కోట్ల మంది ఛాయిస్ ఇది!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
[ad_2]
Source link
Leave a Reply