ప్రమోషన్ల విషయంలో Google సంచలన నిర్ణయం.. కొత్త రివ్యూ విధానంతో..

[ad_1]

గూగుల్ ప్రమోషన్స్..

గూగుల్ ప్రమోషన్స్..

ఖర్చులను తగ్గించుకోవటంలో భాగంగా యూఎస్ టెక్ దిగ్గజం గూగుల్ ఇటీవలి కాలంలో అనేకమంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రమోషన్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరాలతో పోల్చితే ఈ ఏడాది తక్కువ మందిని సీనియర్ స్థానాలకు ప్రమోట్ చేయనున్నట్లు ఇప్పటికే ఉద్యోగులకు వెల్లడించినట్లు సమాచారం.

తక్కువ ప్రమోషన్లు..

తక్కువ ప్రమోషన్లు..

ప్రమోషన్ ప్రక్రియ మేనేజర్ నేతృత్వంలో ఉండనుంది. గత సంవత్సరం ప్రక్రియకు సమానంగా ఉంటుంది. నియామకాలు నెమ్మదిగా ఉన్నందున.. L6, అంతకంటే ఎక్కువ స్థాయిలో తక్కువ ప్రమోషన్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది. గూగుల్ తీసుకొచ్చిన కొత్త పనితీరు సమీక్ష వ్యవస్థ GRADని అమలు చేస్తున్నందున ఈ పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. కంపెనీ వృద్ధికి అనుగుణంలో సీనియర్, నాయకత్వ పాత్రల్లో సరిపడా సంఖ్యలో గూగ్లర్లను ఉండేలా చూడటమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈమెయిల్ లో స్పష్టం చేసినట్లు సమాచారం.

అంతర్గత సర్వే..

అంతర్గత సర్వే..

కంపెనీలో మిడిల్ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో ఉద్యోగుల పనితీరు, ఉత్పత్తులను సమర్థవంతంగా తీసుకురాగల సామర్థ్యం గురించి ఆందోళనల నేపథ్యంలో ప్రమోషన్ల విధానంలో మార్పులకు కంపెనీ దిగిందని తెలుస్తోంది. అయితే కంపెనీ గత ఏడాది దీనికి సంబంధించి ఒక అంతర్గత సర్వేను కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. పదోన్నతి పొందాలనుకునే టెక్నికల్ ఉద్యోగులు మార్చి 6-8 మధ్య తమను తాము స్వయంగా నామినేట్ చేసుకోవచ్చని గూగుల్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ లో పేర్కొంది.

జనవరిలో తొలగింపులు..

జనవరిలో తొలగింపులు..

ఆర్థిక సంక్షోభం కారణంగా టెక్ దిగ్గజం భారీగా ఆదాయ కోతలను ఎదుర్కొంది. ఈ క్రమంలో జనవరిలో ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. అయితే తొలగించిన ఉద్యోగులకు స్థానిక చట్టాలకు అనుగుణంగా పరిహారాలను అందిస్తున్నట్లు అప్పట్లో వెల్లడించారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *