ఫారినర్ల మనస్సు దోచిన మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌, వాటి కోసం ₹1.8 లక్షల కోట్లు ఖర్చు

[ad_1]

FII Holding: ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల (FII) నాన్‌స్టాప్‌ కొనుగోళ్ల కారణంగా 5 నెలల కాలంలో BSE సెన్సెక్స్ 13% ర్యాలీ చేసింది, జులై నెలలో ఆల్-టైమ్ హై లెవల్‌కు చేరుకుంది. ఇంకొంచం లోతుగా పరిశీలిస్తే, ఎఫ్‌ఐఐలు, లార్జ్ క్యాప్ స్టాక్స్‌ కంటే మిడ్‌ క్యాప్ స్టాక్స్‌ను ఎక్కువగా ఛేజ్‌ చేశారని అర్ధం అవుతుంది. ఈ 5 నెలల్లో, S&P BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్ భారీగా 29% లాభపడడమే దీనికి నిదర్శనం.

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌ కాలం) బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌లోని (BSE Midcap index) స్టాక్స్‌లోకి డాలర్ల వరద పారింది, ఎఫ్‌ఐఐ హోల్డింగ్ విలువ రూ. 1.8 లక్షల కోట్లు (QoQ) పెరిగింది.

దీనికి విరుద్ధంగా, స్మాల్‌ క్యాప్ స్టాక్స్‌లో ఫారినర్ల హోల్డింగ్ వాల్యూ QoQలో రూ.1,200 కోట్లకు పైగా క్షీణించింది.

బిగ్‌ గెయినర్స్‌

ఫారిన్‌ కంపెనీలు భారీగా షాపింగ్‌ చేయడంతో, మిడ్‌ క్యాప్ స్పేస్‌లో ఎక్కువగా లాభపడిన స్టాక్‌ REC. ఈ కౌంటర్‌ కేవలం 5 నెలల్లో మల్టీ బ్యాగర్‌గా మారింది. ఎఫ్‌ఐఐలు వరుసగా రెండు త్రైమాసికాలుగా RECలో తమ వాటా పెంచుకుంటూ వచ్చారు. జూన్ చివరి నాటికి, ఈ PSU కంపెనీలో 21.9% షేర్లపై పెత్తనం చేస్తున్నారు.

మిడ్‌ క్యాప్‌ స్పేస్‌లోని టాప్-4 పెర్ఫార్మర్స్‌ కూడా ప్రభుత్వ రంగ కంపెనీలే. REC తర్వాత ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, SJVN, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ షేర్లు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్‌ చివరి నాటికి 78-86% లాభపడ్డాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో, జూన్ చివరి నాటికి, FII హోల్డింగ్ 100 bps పెరిగి 17.49%కి చేరుకుంది. 

BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌లోని 100 స్టాక్స్‌, గత ఐదు నెలల కాలంలో రెండంకెల రాబడిని ఇచ్చాయి, 86% వరకు ర్యాలీ చేశాయి.

L&T ఫైనాన్స్ హోల్డింగ్స్, JSW ఎనర్జీ, వొడాఫోన్ ఐడియా, పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్, గోద్రెజ్ ప్రాపర్టీస్, లుపిన్, గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, అదానీ పవర్, సుప్రీమ్ ఇండస్ట్రీస్ వంటి కొన్ని ప్రముఖ షేర్లు ఏప్రిల్ నుంచి 50-77% మధ్యలో లాభపడ్డాయి.

మిడ్‌ క్యాప్స్‌లో ఫార్మాస్యూటికల్, హెల్త్‌కేర్ స్టాక్స్ ర్యాలీలో ఫ్రంట్‌ రన్నర్స్‌గా ఉన్నాయి. మార్చి క్వార్టర్‌తో పోలిస్తే జూన్‌ క్వార్టర్‌లో లుపిన్, గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ రెండింటిలోనూ FII హోల్డింగ్ పెరిగింది. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: 2000 నోట్లను FD చేస్తే 9.5 శాతం వడ్డీ – బ్రహ్మాండమైన ఆఫర్‌ భయ్యా!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *