ఫారిన్‌ పెట్టుబడుల మీద ఆశతో 6% పెరిగిన కోటక్‌ బ్యాంక్‌ షేర్లు

[ad_1]

Kotak Mahindra Bank Shares: కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ కౌంటర్‌ ఇవాళ లాభాలతో కళకళలాడుతోంది. ఇవాళ (మంగళవారం, 11 ఏప్రిల్ 2023) ఉదయం 11.30 గంటల సమయానికి ఒక్కో షేర్‌ ధర రూ. 81.45 లేదా 4.66% పెరిగి రూ. 1,841 వద్ద కదులుతోంది. 

ఇవాళ, BSEలో, ఈ స్టాక్‌ 6% లాభపడి 1,850.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అంతేకాదు, నిఫ్టీ50 ప్యాక్‌లోనూ కోటక్ మహీంద్ర బ్యాంక్ షేర్లు టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. ఈ సమయానికి దాదాపు 36.8 లక్షల షేర్లు చేతులు మారడంతో ప్రైస్‌ యాక్షన్‌ ఎక్కువగా ఉంది.

కోటక్ మహీంద్రాబ్యాంక్‌లో ఎఫ్‌ఐఐ వాటా తగ్గింపుతో ఏర్పడిన గ్యాప్‌ కారణంగా, 690 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వస్తాయన్న అంచనాలు ఏర్పడ్డాయి. అందువల్లే ఈ ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ స్క్రిప్‌ మీద పెట్టుబడిదార్ల ఆసక్తి పెరిగింది.

ఫారిన్‌ ఇన్‌ఫ్లోస్‌ పెరగడానికి అవకాశం
విదేశీ సంస్థాగత మదుపుదార్లు (FIIs) కోటక్ మహీంద్ర బ్యాంక్‌లో తమ వాటాను మార్చి త్రైమాసికంలో 1.47% తగ్గించుకుని, 41.22%కి చేర్చారని తాజా షేర్‌ హోల్డింగ్ డేటా చూపిస్తోంది. దీని ఫలితంగా… ఫారిన్‌ హెడ్‌రూమ్ (విదేశీ పెట్టుబడుల అవకాశం) ప్రస్తుతమున్న 22.38% నుంచి 25.05% కు మారవచ్చని విశ్లేషకులు లెక్కలు వేశారు. అంటే.. ఫారిన్‌ ఇన్‌ఫ్లోస్‌ పెరగడానికి అవకాశం పెరిగింది.

690 మిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడులు
ఫారిన్‌ స్టేక్‌ లెక్కలు నిజమైతే & 41.22%ను ప్రస్తుత విదేశీ హోల్డింగ్‌గా MSCI పరిగణనలోకి తీసుకున్నట్లయితే… MSCI ఇండెక్స్‌లో కోటక్ మహీంద్ర బ్యాంక్ (KMB) వెయిటేజ్‌ పెరుగుతుంది. ఫలితంగా 690 మిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అంటే, దాదాపు 3.20 కోట్ల షేర్ల కొనుగోళ్లను ఈ కౌంటర్‌లో చూడవచ్చు.

MSCI ప్రైస్‌ కటాఫ్ తేదీ మే నెల 23వ తేదీ కాగా, దాని కంటే ముందే షేర్ హోల్డింగ్ డేటాను కోటక్ మహీంద్ర బ్యాంక్‌ విడుదల చేసింది.

“ఈ స్టాక్ చాలా కాలంగా క్షీణిస్తోంది. దీని వెయిట్‌ను MSCI పెంచడం వల్ల బలమైన ర్యాలీకి దారి తీయవచ్చు, ఈ మార్పును నిరంతరం పర్యవేక్షిస్తున్నాం” – నువామా

కోటక్‌ మీంద్ర బ్యాంక్‌ స్టాక్ 2022 నవంబర్‌ నెలలో తాకిన 52 వారాల గరిష్ఠమైన రూ. 1.997.55 నుంచి దిద్దుబాటుకు గురైంది. గత ఏడాది కాలంలో, నిఫ్టీ50 ఇండెక్స్‌ ఇచ్చిన 0.3% లాభంతో  పోలిస్తే ఈ స్టాక్‌ 3% పైగా రాబడిని ఇచ్చింది, నిఫ్టీ50 ఇండెక్స్‌ను స్వల్పంగా అధిగమించింది. గత ఆరు నెలల కాలంలో కేవలం 3%, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) 1% మేర లాభపడింది. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *