ఫారెక్స్ లేదా కరెన్సీ ట్రేడింగ్ చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే.. తస్మాత్ జాగ్రత్త !!

[ad_1]

అప్ డేట్ అయిన అలర్ట్ లిస్ట్

అప్ డేట్ అయిన అలర్ట్ లిస్ట్

అనధికార ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ ఫారమ్‌ లలో మోసపూరిత విధానాలను ప్రమోట్ చేస్తున్న ఎంటిటీలు/ప్లాట్‌ ఫారమ్‌ లు/ వెబ్‌ సైట్‌ల పేర్లతో కూడిన ‘అలర్ట్ లిస్ట్’ని రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం అప్‌ డేట్ చేసింది. 34 సంస్థలతో ఉన్న ఈ జాబితాను మొదటగా గతేడాది సెప్టెంబర్‌లో సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసింది. కాగా ఇప్పుడు మరికొన్నిటిని జతచేసి మొత్తం సంస్థలను 48కి పెంచింది.

లిస్ట్ లేనంత మాత్రాన అధికారికం కాదు

లిస్ట్ లేనంత మాత్రాన అధికారికం కాదు

అలర్ట్ లిస్ట్ లోని అనధికారిక ఎంటిటీలు/ETPలను ప్రమోట్ చేస్తున్న యాప్‌ లు/ప్లాట్‌ ఫారమ్‌ లు/ వెబ్‌సైట్‌ల పట్ల జాగ్రత్త వహించాలని RBI ప్రజలను కోరింది. ఆయా సంస్థల ద్వారా వస్తున్న ప్రకటనలు, శిక్షణ/సలహా సేవలను నమ్మవద్దని సూచించింది. ఒకవేళ ఏదైనా సంస్థ ఈ జాబితాలో లేనంత మాత్రాన, అది అధికారిక ఎంటిటీ అని ధృవీకరించినట్లు కాదని క్లారిటీ ఇచ్చింది.

అలా చేస్తే శిక్షార్హులే..

అలా చేస్తే శిక్షార్హులే..

అందుబాటులో ఉన్న అధీకృత వ్యక్తులు, ETPల జాబితాను RBI వెబ్‌ సైట్‌లో చూడవచ్చు. ఈ జాబితా ద్వారా ఏదైనా వ్యక్తి/ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ (ETP) అధికారిక స్థితిని తెలుసుకోవచ్చు. అనధికార సంస్థల ద్వారా విదేశీ కరెన్సీతో చేసే లావాదేవీలకు ప్రజలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. FEMA నిబంధనల ప్రకారం వారు శిక్షార్హులన్న విషయం గుర్తుంచుకోవాలి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *