ఫుల్‌ రైజింగ్‌లో ఫైవ్‌ స్టార్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌ స్టాక్‌, ఇవాళ 19% జూమ్‌

[ad_1]

Five-Star Business Finance: ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ లిమిటెడ్ (FSBF) షేర్లు ఇవాళ (మంగళవారం, 06 డిసెంబర్‌ 2022‌) ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌లో ట్రేడ్‌ అయ్యాయి. ఇవాళ ఏకంగా 19 శాతం పెరిగి రూ. 619.50కి చేరాయి. ఇది దీని 52 వారాల రికార్డ్‌ స్థాయి.

ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC) స్టాక్ ఈ ఏడాది నవంబర్ 21న మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. ఇష్యూ ధర రూ. 474. లిస్టింగ్‌ డే నుంచి మన్ను తిన్న పాములా పడి ఉన్న ఈ స్కిప్‌ ఇవాళ తోక మీద నిల్చుని బుసలు కొట్టింది. ఇప్పుడు, ఇష్యూ ధర కంటే 31 శాతం ప్రీమియంలో ట్రేడ్‌ అవుతోంది. లిస్టింగ్ రోజున తాకిన 52 వారాల కనిష్ట స్థాయి రూ. 448.20 నుంచి ఇప్పటి వరకు 38 శాతం పుంజుకుంది.

భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ (RBI) దగ్గర రిజిస్ట్రేషన్‌తో NBFC వ్యాపారం చేస్తోందీ కంపెనీ. తమిళనాడు (కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితో సహా), ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌లో దాదాపు 2,50,000 యాక్టివ్‌ లైవ్‌ అకౌంట్స్‌ దీని వద్ద ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో 352 శాఖల నెట్‌వర్క్‌ ద్వారా కస్టమర్లకు ఆర్థిక సేవలు అందిస్తోంది.

వ్యాపార ప్రయోజనాలు, ఆస్తుల సృష్టి, ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం చిన్న, సన్నకారు వ్యాపారస్తులకు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు ఈ కంపెనీ ప్రాథమికంగా చిన్నపాటి రుణాలు మంజూరు చేస్తుంది.

News Reels

రుణాల జారీలో దూకుడు
H1FY23 (2022 ఏప్రిల్- సెప్టెంబర్) కాలంలో, రూ. 1,371 కోట్ల విలువైన రుణాలను ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్‌ పంపిణీ చేసింది. అంతకుముందు సంవత్సరం ఇదే సమయంతో (YoY) పోలిస్తే రుణాల జారీలో 100 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంటే, రుణాల జారీలో చాలా దూకుడుగా ఉంది. తన వ్యాపారాన్ని వేగంగా వృద్ధి చేసుకోవాలన్న ఆకాంక్ష కనిపిస్తోంది. 

నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM) 24 శాతం వృద్ధితో రూ. 5,732 కోట్లకు చేరుకుంన్నాయి. కంపెనీ పన్ను తర్వాతి లాభం 30 శాతం పెరిగి రూ. 284 కోట్లుగా ఉంది. H1FY23 కాలంలో ఈ కంపెనీ 52 కొత్త శాఖలను తన నెట్‌వర్క్‌కు  జోడించింది. దీని ఫలితంగా 352 శాఖల బలమైన బ్రాంచ్ నెట్‌వర్క్ ఏర్పడింది.

వసూళ్లలోనూ దూకుడే
సెప్టెంబర్ త్రైమాసికంలో (2022 జులై-సెప్టెంబర్‌ కాలం) 100 శాతం కలెక్షన్‌ ఎఫిషియన్సీ సాధించినట్లు ఈ కంపెనీ మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది. బలమైన వృద్ధి, లాభదాయకత, నాణ్యత పరంగా కొవిడ్ పూర్వ స్థాయికి తిరిగి చేరుకున్నట్లు ప్రకటించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *