[ad_1]
జన్యుపరమైన కారణాలు..
పైబ్రాయిడ్స్ జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఎవరికైనా ఫైబ్రాయిడ్స్ ఉంటే.. మీకు వచ్చే అవకాశం పెరుగుతుంది. జన్యుపరమైన కారకాలు ఫైబ్రాయిడ్లకు ప్రధాన కారణం అని చెప్పొచ్చు.
హార్మోన్ అసమతుల్యత..
హార్మోన్ అసమతుల్యత కారణంగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంటే ఇవి.. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు బ్యాలెన్స్ తప్పినప్పుడు పెరుగుతాయి. అధిక స్థాయి ఈస్ట్రోజెన్‌తో పాటు.. హార్మోన్ల అసమతుల్యత ఫైబ్రాయిడ్‌ల పెరుగుదలకు కారణమవుతుంది. అందుకే ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటే.. గర్భధారణ సమయంలో ఫైబ్రాయిడ్లు పెరుగుతాయి. గర్భనిరోధక మాత్రలు ఫైబ్రాయిడ్ పెరుగుదలకు కారణం అవుతాయని నిపుణులు అంటున్నారు.
వయస్సు..
మహిళల్లో వయస్సు పెరిగే కొద్దీ ఫైబ్రాయిడ్‌లు వచ్చే అవకాశం పెరుగుతుంది. సాధారణంగా 30, 40 ఏళ్లు దాటిన తర్వాత.. మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలు క్షీణించినప్పుడు, మెనోపాజ్ స్థాయిలు తగ్గినప్పుడు ఫైబ్రాయిడ్ రిస్క్ పెరుగుతుంది.
అధిక బరువు..
అధిక బరువు ఉన్నవారికి హార్మోన్ల అసమతుల్యత కారణంగా.. ఫైబ్రాయిడ్ల ముప్పు పెరుగుతుంది. కొవ్వు కణాలు ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి, అదనపు కొవ్వు కణజాలం.. అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలకు దారి తీస్తుంది. దీని కారణంగా ఫైబ్రాయిడ్లు పెరిగే అవకాశం ఉంది.
ప్రెగ్నెన్సీ లేట్ అయితే..
ప్రెగ్నెన్సీ ఆలస్యం అయిన మహిళల్లో.. ఫైబ్రాయిడ్‌లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజెన్ రియాక్షన్‌ను వ్యతిరేకించే ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఎఫెక్ట్ లేకపోవడం వల్ల కావచ్చు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply