ఫోన్‌తో స్కాన్‌ చేసి డబ్బు తీసుకోవచ్చు, ఏటీఎం కార్డ్‌ అక్కర్లేదు

[ad_1]

BoB UPI Cash Withdrawal Facility: టెక్నాలజీ మారే కొద్దీ నగదు లావాదేవీల్లో కొత్త పద్ధతులు పలకరిస్తున్నాయి. ముఖ్యంగా, UPI (Unified Payments Interface) వచ్చాక డబ్బులు చెల్లించడం, స్వీకరించడం చిటికె వేసినంత సులభంగా మారింది. ఏటీఎం నుంచి క్యాష్‌ విత్‌ డ్రా చేయడంలోనూ ఇదే ట్రెండ్‌ కంటిన్యూ చేసింది బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of Baroda customers).

బ్యాంక్ ఆఫ్ బరోడా, సోమవారం నుంచి ఇంటరాపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రావల్ (ICCW) ఫెసిలిటీని ప్రారంభించింది. ఇందులో, ఒక కస్టమర్ డెబిట్‌ కార్డ్ లేకుండానే బ్యాంక్ ATM నుంచి డబ్బు విత్‌ డ్రా చేయవచ్చు. కార్డ్‌లెస్‌ క్యాష్‌ విత్‌ డ్రా ఫెసిలిటీ గతంలోనే ఉన్నా, ఇప్పుడొచ్చిన ఫెసిలిటీలో UPIని ఉపయోగించుకోవచ్చు. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌లో ఇది మరొక ఫార్వర్డ్‌ స్టెప్‌.

UPI ద్వారా ఏటీఎం నుంచి డబ్బు ఎలా విత్‌ డ్రా చేయాలి?
ఒకవేళ మీరు మీ ఏటీఎం కార్డ్‌ (ఏ బ్యాంక్‌ ఏటీఎం కార్డ్‌ అయినా పర్లేదు) మరిచిపోయి బ్యాంక్ ఆఫ్ బరోడా ATMకు వెళ్లినప్పుడు, ‘యూపీఐ క్యాష్ విత్‌డ్రాల్’ (UPI Cash Withdrawal) ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిని ఎంచుకున్నప్పుడు, కస్టమర్ ATM స్క్రీన్‌పై QR కోడ్ ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు మీ మొబైల్‌ నుంచి గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి ఏదైనా UPI ఆధారిత యాప్‌ ఓపెన్‌ చేసి, ఆ QR కోడ్‌ను స్కాన్‌ చేయాలి. ఆ తర్వాత, మీ కావల్సిన నగదు మొత్తం, ఆ తర్వాత పిన్‌ ఎంటర్‌ చేయాలి. అంతే, ఏటీఎం నుంచి డబ్బు బయటకు వస్తుంది, లావాదేవీ పూర్తి అవుతుంది.

ఒకవేళ మీ UPI ఐడీతో ఎక్కువ బ్యాంక్‌ అకౌంట్‌లు లింక్‌ అయివుంటే, ఏ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారో ఆ బ్యాంక్‌ అకౌంట్‌ను ఎంచుకోవాలి. మిగిలిన ప్రాసెస్‌ సేమ్‌. ఒక్క బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కస్టమర్లే కాదు, ఏ బ్యాంక్‌ కస్టమర్‌ అయినా ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు.

డెబిట్‌ కార్డ్‌ లేకపోయినా, మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌ డ్రా చేసుకునే UPI ఆధారిత ఫెసిలిటీని తీసుకురావాలని గతంలో అన్ని బ్యాంక్‌లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఆదేశించింది. ఈ సర్వీస్‌ను ప్రారంభించిన మొదటి ప్రభుత్వ రంగ బ్యాంకు ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’.

రోజుకు రెండు సార్లు, గరిష్టంగా రూ.5 వేలు
‘యూపీఐ క్యాష్ విత్‌డ్రాల్’ సదుపాయాన్ని ఒక రోజులో రెండుసార్లు మాత్రమే వినియోగించుకోవడానికి వీలుంటుందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. ఒక్కో ట్రాన్జాక్షన్‌లో గరిష్ఠంగా రూ. 5 వేలు వరకు తీసుకోవచ్చు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు దేశవ్యాప్తంగా 11వేల ఏటీఎంలు ఉన్నాయి. వాటన్నింటిలోనూ ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. 

బ్యాంక్ ఆఫ్‌ బరోడా తీసుకొచ్చిన కొత్త ICCW ఫెసిలిటీతో కస్టమర్‌లకు ఫిజికల్ కార్డ్‌ను ఉపయోగించకుండా డబ్బును విత్‌డ్రా చేసుకునే స్వేచ్ఛ లభిస్తుంది. నగదు తీసుకునేందుకు సులభమైన, అనుకూలమైన, సురక్షితమైన మార్గం ఇది అని బ్యాంక్ ఆఫ్ బరోడాలో చీఫ్ డిజిటల్ ఆఫీసర్ అఖిల్ హండా ప్రకటించారు.

మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ: మాన్‌సూన్‌ ముందు కొనాల్సిన మంచి స్టాక్స్‌ – లాభాలను వర్షించొచ్చు!

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *