[ad_1]
Indian Stock Market Opening Today on 20 November 2023: భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు (సోమవారం) పూర్తిగా ఫ్లాట్ నోట్‌తో ప్రారంభమయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్ణయం ప్రభావం బ్యాంకింగ్ & NBFC స్టాక్స్ మీద ఇంకా తగ్గలేదు. బ్యాంక్ నిఫ్టీ, బ్రాడర్ మార్కెట్‌ను క్రిందికి లాగేందుకు ప్రయత్నిస్తోంది. బ్యాంక్ నిఫ్టీలో బలహీనతతో ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, FMCG, ఆయిల్ & గ్యాస్ రంగాలు నెగెటివ్ మూడ్‌లో ఉన్నాయి.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…
గత సెషన్‌లో (శుక్రవారం, 17 నవంబర్ 2023) 65,795 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 7.22 పాయింట్ల స్వల్ప పెరుగుదలతో 65,787 స్థాయి వద్ద ఓపెన్ (BSE Sensex Opening Today) అయింది. శుక్రవారం 19,732 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 19,731.15 స్థాయి వద్ద పూర్తి ఫ్లాట్‌గా (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు ఫ్లాట్‌గా 43,591 స్థాయి వద్ద స్టార్ట్ అయింది.
సెన్సెక్స్ షేర్ల పరిస్థితి
ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ టైమ్‌లో… సెన్సెక్స్ 30 ప్యాక్‌లోని 14 షేర్లు గ్రీన్ మార్క్‌లో ఉన్నాయి, మిగిలిన 16 షేర్లు రెడ్ మార్క్‌లో ట్రేడ్ అయ్యాయి. ఆ సమయానికి సెన్సెక్స్‌లో అత్యధికంగా లాభపడిన షేర్లలో HCL టెక్ 1.10 శాతం, NTPC 0.85 శాతం ఉన్నాయి. TCS 0.38 శాతం, టాటా మోటార్స్ 0.37 శాతం చొప్పున పెరిగాయి. విప్రో 0.34 శాతం గెయిన్ అయింది.
నిఫ్టీ చిత్రం
ట్రేడ్ ప్రారంభ సమయంలో… నిఫ్టీ 50 ప్యాక్‌లోని 27 స్టాక్స్ లాభాల్లో ఉండగా, మిగిలిన 23 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో దివీస్ ల్యాబ్స్ 1.49 శాతం, అపోలో హాస్పిటల్ 1.40 శాతం, కోల్ ఇండియా 1.20 శాతం, HCL టెక్ 1.11 శాతం, హిందాల్కో 0.93 శాతం పెరిగాయి. నిఫ్టీ టాప్ లూజర్స్‌లో… యాక్సిస్ బ్యాంక్ 0.77 శాతం, M&M 0.66 శాతం, ఏషియన్ పెయింట్స్ 0.64 శాతం, నెస్లే ఇండస్ట్రీస్ 0.62 శాతం, కోటక్ మహీంద్ర బ్యాంక్ 0.56 శాతం క్షీణతతో ట్రేడయ్యాయి.
ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా, తన బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లను యథాతథంగా ఉంచడంతో సోమవారం ఆసియా-పసిఫిక్ మార్కెట్లు లాభాల్లో స్టార్ట్ అయ్యాయి. హ్యాంగ్ సెంగ్, కోస్పీ 0.6, 0.8 శాతం చొప్పున పెరిగాయి. ASX200 0.15 శాతం పెరిగింది. జపాన్ యొక్క నిక్కీ ఫ్లాట్‌గా ఉంది.
గ్లోబల్ ఇన్వెస్టర్లు FOMC మినిట్స్‌పై ఒక కన్నేసి ఉంచుతారు, మంగళవారం ఆ డేటా విడుదలవుతుంది. థాంక్స్ గివింగ్ సందర్భంగా గురువారం US మార్కెట్ పని చేయదు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి
[ad_2]
Source link
Leave a Reply