బజాజ్ డొమినార్‌పై భారీ డిస్కౌంట్ – కేవలం ఈ నగరాల్లో మాత్రమే!

[ad_1]

Bajaj Dominar 400 Big Discount: బజాజ్ డొమినార్ 400 బైక్‌పై కంపెనీ లిమిటెడ్ పీరియడ్ డిస్కౌంట్‌ను అందిస్తుంది. ఏకంగా రూ. 25 వేలు తగ్గింపును ఈ బైక్‌పై అందించనున్నారు. ఎంపిక చేసిన బజాజ్ ఆటో డీలర్ షిప్స్‌లో బీఎస్6 బైక్స్‌ను క్లియర్ చేయడానికి ఈ సేల్‌ను పెట్టారు. త్వరలో రానున్న బీఎస్ 6 స్టేజ్ 2 కంప్లయింట్ మోటార్ సైకిల్స్ కోసం ఇప్పుడు ఉన్న స్టాక్‌ను తప్పకుండా క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కొత్త ఎమిషన్ నార్మ్స్ 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి.

ఈ కొత్త డిస్కౌంట్‌తో కొత్త డొమినార్ 400 ధర రూ.1,99,991కు తగ్గనుంది. ఇది ఎక్స్-షో రూం ధర. తక్కువ ధరలో 400 సీసీ బైక్ కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ కానుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులే అందుబాటులో ఉండనుంది కాబట్టి ఒకవేళ ఈ బైక్‌ను కొనాలనుకుంటే త్వరపడటం మంచిది.

ఇందులో 373 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. ఓవర్ హెడ్ క్యామ్‌షాఫ్ట్, లిక్విడ్ కూల్డ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. 29.4 కేడబ్ల్యూ (40 బీహెచ్‌పీ) మ్యాగ్జిమం పవర్‌ను ఈ ఇంజిన్ 8800 ఆర్‌పీఎం మ్యాగ్జిమం పవర్ వద్ద అందించనుంది. 6,500 ఆర్‌పీఎం వద్ద 35 ఎన్ఎం పీక్ టార్క్ కూడా లభించనుంది. 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ కూడా దీంతోపాటు అందించనున్నారు.

లాంగ్ టూర్స్ వేయడాన్ని ప్రిఫర్ బైకర్ల కోసం దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. పొడవైన వైజర్, హ్యాండ్ గార్డ్, ఇంజిన్ బాష్ ప్లేట్, యూఎస్‌బీ చార్జింగ్ పోర్టు, లెగ్ గార్డ్, క్యారియర్ + బ్యాక్ స్టాపర్, నావిగేషన్ స్టే, సాడిల్ స్టే వంటి టూరింగ్ యాక్సెసరీస్ కూడా దీంతోపాటు అందించనున్నారు. వీటి కారణంగా లాంగ్ టూర్స్, లాంగ్ డ్రైవ్స్ కూడా సులభంగా చేయవచ్చు.

ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పుణే, బెంగళూరు నగరాల్లోని ఎంపిక చేసిన డీలర్ షిప్స్‌లో ఈ డిస్కౌంట్ అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇతర నగరాల్లో ఉండనుందో లేదో తెలియరాలేదు. వివరాల కోసం దగ్గర్లోని బజాజ్ డీలర్ షిప్‌ను స్పందించండి. కొత్త ఎమిషన్ నియమాలు త్వరలో అందుబాటులోకి రానున్నందున త్వరలో మరిన్ని కంపెనీలు బీఎస్ 6 స్పెసిఫికేషన్ మోడల్స్‌పై డిస్కౌంట్లు అందించే అవకాశం ఉంది.

గతేడాది బజాజ్ ఆటో లిమిటెడ్ సీఈవో రాజీవ్ బజాజ్ పోటీ కంపెనీలపై భారీ సెటైర్లు వేశాడు. భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమను ఉద్దేశించి మాట్లాడుతూ… ‘ఎలక్ట్రిక్ అసెంబ్లీ లైన్‌ను రూపొందించడం పెద్ద కష్టమేం కాదు. డబ్బులున్న దద్దమ్మలు ఎవరైనా ఆ పని చేయగలరు.’ అన్నారు. ‘సగం నిర్మించిన ఫెసిలిటీలు, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ లేని కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయిస్తున్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖల వారు నియమాలను సడలించారు.’ అని అభిప్రాయపడ్డారు.

ఆక్రుడిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఫెసిలిటీ ప్రారంభం అయింది. 6.5 ఎకరాల్లో ఈ ఫెసిలిటీని నిర్మించారు. ఏటా 5 లక్షల యూనిట్లను ఇక్కడ తయారు చేయనున్నారు. వారి ఉత్పత్తులకు సంబంధించిన డొమస్టిక్, ఎక్స్‌పోర్ట్ డిమాండ్‌లను అందుకోగల సామర్థ్యం ఈ ఫెసిలిటీకి ఉంది.

రాజీవ్ బజాజ్ ఈ ఫెసిలిటీ గురించి మాట్లాడుతూ ‘చేతక్ కోసం ఈ యూనిట్‌ను ప్రారంభించాలన్న తమ కమిట్‌మెంట్‌ను కంపెనీ నిలబెట్టుకుంది. భవిష్యత్తులో చేతక్‌ను ముందుకు తీసుకెళ్లడమే ఈ ఫెసిలిటీ ప్రధాన లక్ష్యం.’ అన్నారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *