[ad_1]
Midcap Stocks: అస్థిరత ఎదుట అద్దం పెడితే, అందులో స్టాక్ మార్కెట్ కనిపిస్తుంది. అంటే, అస్థిరతకు ప్రతిబింబం స్టాక్ మార్కెట్. కాబట్టి, అస్థిరతతో కలిసి బతకడం అన్నది అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లు ఇద్దరూ అర్ధం చేసుకోవాల్సిందే, నేర్చుకోవాల్సిందే. త్రైమాసిక ఫలితాల సీజన్‌లో ఈక్విటీ మార్కెట్లు అస్థిరంగా కదులుతుంటాయి, వాల్యుయేషన్‌కు తగ్గ రిజల్ట్స్ చూపని స్టాక్‌లను స్ట్రీట్ శిక్షిస్తుందన్నది వాస్తవం, ఇదొక రిమైండర్.
ప్రస్తుత అస్థిర మార్కెట్‌లోనూ, వివిధ రంగాల నుంచి కొన్ని ఎంపిక చేసిన మిడ్ క్యాప్ స్టాక్స్ ఎనలిస్ట్‌ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీటిలో కొన్ని కౌంటర్లు చాలా కాలం స్దబ్దుగా ఉండి, ఇప్పుడు తమ ప్రతాపం చూపడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఇక్కడ, స్టాక్స్ ఎంపిక కోసం ఒక నేషనల్ మీడియా కొన్ని వడపోతలు చేపట్టింది. మొదట NSE గ్రూప్‌ను విశ్లేషించి కొన్ని పేర్లను ఎంపిక చేసింది. ఆ తర్వాత, వాటికి మరికొన్ని పరీక్షలు పెట్టింది.
స్టాక్స్‌ను ఫిల్టర్ చేసిన పద్దతులు:
కనీసం 25%కు తగ్గకుండా పెరిగే సత్తా ఉన్న స్టాక్స్
వచ్చే 12 నెలల కాలానికి టార్గెట్ ప్రైస్‌లు ఉన్న స్టాక్స్‌ను తీసుకుని, ఆ టార్గెట్ ధరల సగటును లెక్కించారు. ఈ సగటు ‘ధర లక్ష్యాన్ని’ ప్రస్తుత మార్కెట్ ధరతో పోల్చారు. ప్రస్తుత మార్కెట్ ధర కంటే సగటు ‘ధర లక్ష్యం’ 25 శాతం ఎక్కువగా ఉంటే, దానిని ఈ లిస్ట్ కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఇలా, కనీసం 25% అప్‌సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్‌ను మొదటి దశలోకి తీసుకున్నారు.
“బయ్” లేదా “స్ట్రాంగ్ బయ్” రేటింగ్స్‌తో కనీసం 10 మంది ఎనలిస్ట్‌లు ట్రాక్ చేస్తున్న స్టాక్స్
మొదటి ఫిల్టర్ తర్వాత… తక్కువలో తక్కువగా కనీసం 10 మంది విశ్లేషకులు ట్రాక్ చేస్తున్న; కేవలం “బయ్” లేదా “స్ట్రాంగ్ బయ్” (“Buy” or “Strong Buy” rating) రేటింగ్స్ మాత్రమే ఉన్న స్టాక్స్‌ను రెండో దశలో పరిగణనలోకి తీసుకున్నారు. మిగిలినవి వాటిని జాబితా నుంచి తీసేశారు.
రూ. 5,000 కోట్ల నుంచి రూ. 25,000 కోట్ల మధ్య మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్
చివరిదైన మూడో దశలో.. సదరు కంపెనీ కనీస మార్కెట్ విలువ (market capitalization) కనిష్టంగా రూ. 5,000 కోట్లు – గరిష్టంగా రూ. 25,000 కోట్లు ఉన్న స్టాక్స్‌ను మాత్రమే ఎంపిక చేశారు. వీటితో తుది జాబితా రూపొందించారు. మిగిలిన వాటిని తుది జాబితా నుంచి తీసేశారు.
మూడు వడపోతల తర్వాత వచ్చిన స్టాక్స్ తుది జాబితా ఇది:
ఆర్తి ఇండస్ట్రీస్ – రికమెండేషన్ “బయ్” – ఎనలిస్ట్‌ల సంఖ్య 21 – అప్‌సైడ్ పొటెన్షియల్ 36% – మార్కెట్ విలువ రూ. 19.865 కోట్లు
అరబిందో ఫార్మా – రికమెండేషన్ “బయ్” – ఎనలిస్ట్‌ల సంఖ్య 30 – అప్‌సైడ్ పొటెన్షియల్ 35% – మార్కెట్ విలువ రూ. 26,080 కోట్లు
దీపక్ నైట్రేట్ – రికమెండేషన్ “బయ్” – ఎనలిస్ట్‌ల సంఖ్య 14 – అప్‌సైడ్ పొటెన్షియల్ 32% – మార్కెట్ విలువ రూ. 24,748 కోట్లు
మెట్రో బ్రాండ్స్ – రికమెండేషన్ “బయ్” – ఎనలిస్ట్‌ల సంఖ్య 10 – అప్‌సైడ్ పొటెన్షియల్ 28% – మార్కెట్ విలువ రూ. 20,772 కోట్లు
గ్లెన్‌మార్క్ ఫార్మా – రికమెండేషన్ “బయ్” – ఎనలిస్ట్‌ల సంఖ్య 19 – అప్‌సైడ్ పొటెన్షియల్ 27% – మార్కెట్ విలువ రూ. 11,195 కోట్లు.
బుధవారం (ఫిబ్రవరి 08, 2023) మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్న మార్కెట్ విలువలు ఇవి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply