బెంబేలెత్తిస్తున్న బంగారం ధరలు: యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల ఎఫెక్ట్; తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్ ధరలివే!!

[ad_1]

అంతర్జాతీయంగానూ, జాతీయంగానూ పెరిగిన బంగారం వడ్డీ రేట్లు

అంతర్జాతీయంగానూ, జాతీయంగానూ పెరిగిన బంగారం వడ్డీ రేట్లు

అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు 1950 డాలర్లు మార్కును దాటి ట్రేడ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేట్ 24.20 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పెరగడంతో దాని ప్రభావం దేశీయంగాను కనిపిస్తుంది. ఊహించని విధంగా రికార్డులను బ్రేక్ చేస్తూ బంగారం ధరలు భారతదేశంలో సరికొత్త గరిష్టాలను చేరుకున్నాయి.

 హైదరాబాద్ లో నేడు బంగారం ధరలు ఇలా .. ఒకేరోజులో భారీగా

హైదరాబాద్ లో నేడు బంగారం ధరలు ఇలా .. ఒకేరోజులో భారీగా

తాజాగా హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరల విషయానికి వస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న 52,500 గా ఉండగా ప్రస్తుతం ఇప్పుడు 53,000 గా ట్రేడ్ అవుతోంది. ఒక్కసారిగా 22 క్యారెట్ల బంగారం మీద 500 రూపాయలు బంగారం ధర పెరిగింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికి వస్తే నిన్న 57,270 ట్రేడ్ కాగా, నేడు 57,820 వద్ద ట్రేడ్ అవుతున్న పరిస్థితి ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మీద నిన్నటితో పోలిస్తే 550 రూపాయలు పెరిగింది.

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..

ఇక దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53,160 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. ఈ ధర నిన్న 53,150 రూపాయలుగా ఉంది. కేవలం పది రూపాయల మేర ఢిల్లీలో బంగారం ధర పెరిగింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విషయానికి వస్తే నిన్న 57,980 రూపాయలుగా ట్రేడ్ కాగా ఈరోజు 57,990 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయంలోనూ కేవలం పది రూపాయలు మేర ధర పెరిగింది.

 ముంబైలో బంగారం తాజా ధరలివే

ముంబైలో బంగారం తాజా ధరలివే

దేశ ఆర్థిక రాజధాని ముంబై విషయానికి వస్తే ముంబైలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 53,010 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 53,000 గా నమోదయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ముంబైలో నిన్న 57,820 కాగా ఈరోజు 57,830 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది.

 విజయవాడలో బంగారం ధరలు ఇలా.. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్

విజయవాడలో బంగారం ధరలు ఇలా.. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 53,010 గా ట్రేడ్ అవుతోంది. నిన్న ఈ ధర 53,000 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విజయవాడలో ప్రస్తుతం 57,830 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. నిన్న ఈ ధర 57,820 గా ఉంది. మొత్తంగా చూస్తే బంగారం ధరలు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచగానే ఒక్కసారిగా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రెక్కలొచ్చిన బంగారం ధరలు తిరిగి కిందికి దిగే పరిస్థితులు లేవని తాజా పరిణామాలతో అర్థమవుతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడంతో బంగారం కొత్త రికార్డులను సృష్టించే దిశగా ధరల దూకుడును కొనసాగిస్తుంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *