బెస్ట్ మైలేజ్ కోసం హైబ్రిడ్ కార్లు కొనాలనుకుంటున్నారా – అయితే మెరుగైన ఆప్షన్లు ఇవే!

[ad_1]

Best Hybrid Cars: పెరుగుతున్న ఇంధన ధరలు భారతదేశంలోని కార్ల యజమానుల జేబులను భారీగా దెబ్బతీశాయి. ఈ సమస్యను నివారించడానికి ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధనం కోసం చూస్తున్నారు. దీని కారణంగా ప్రజలు హైబ్రిడ్ కార్లను చాలా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో ఈవీ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లభ్యత తక్కువగా ఉంది. దీని కారణంగా ఇది ఉత్తమ ఆప్షన్ కూడా. కాబట్టి భారతదేశంలోని కొన్ని అత్యుత్తమ హైబ్రిడ్ కార్ల గురించి తెలుసుకుందాం.

టయోటా హైరైడర్
103 పీఎస్ పవర్, 137 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్, 116 పీఎస్ పవర్ ఉత్పత్తి చేసే 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో సహా రెండు పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌ల ఆప్షన్‌తో టయోటా హైరైడర అందుబాటులో ఉంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను పొందుతుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. బలమైన హైబ్రిడ్ e-CVT ట్రాన్స్‌మిషన్‌ను పొందుతుంది. ఇది లీటర్‌కు 27.9 కిలోమీటర్ల మైలేజీని పొందుతుంది.

హోండా సిటీ హైబ్రిడ్
సిటీ హైబ్రిడ్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను 98 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది హైబ్రిడ్ సిస్టమ్‌తో 126 పీఎస్ పవర్, 253 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది e-CVT గేర్‌బాక్స్‌తో పెయిర్ అయి ఉంటుంది. లీటరుకు 27.13 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో కూడిన ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, కనెక్ట్ అయిన కార్ టెక్నాలజీతో కూడిన ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లను పొందుతుంది.

టయోటా కామ్రీ
టయోటా కామ్రీ 2.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఎలక్ట్రిక్ మోటార్‌తో పెయిర్ చేసింది. ఇది 218 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది CVT గేర్‌బాక్స్‌తో స్పోర్ట్, ఎకో, నార్మల్ వంటి మూడు డ్రైవ్ మోడ్‌లను పొందుతుంది. ఇందులో తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10 వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, హెడ్ అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా
ఇది టయోటా హైరైడర్ వంటి పవర్‌ట్రెయిన్ ఇంజిన్ ఆప్షన్లను పొందుతుంది. ఇది 1.5 లీటర్ పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్, 1.5 లీటర్ పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌ను పొందుతుంది. ఇవి వరుసగా 103 పీఎస్, 116 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. స్ట్రాంగ్ హైబ్రిడ్ సెల్ఫ్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు పెట్రోల్, హైబ్రిడ్, ప్యూర్ ఈవీ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లను పొందుతుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, అలాగే e-CVT ఎంపికను పొందుతుంది.

టయోటా గ్లాంజా, హైరైడర్ సీఎన్‌జీ కార్లతో సీఎన్‌జీ రంగంలో కూడా అడుగుపెట్టింది. గ్లాంజా సీఎన్‌జీ వేరియంట్ ఎస్, జీ గ్రేడ్స్‌ అందుబాటులో ఉండనుంది. దీంతోపాటు అర్బన్ క్రూజర్ హైరైడర్ కూడా సీఎన్‌జీ వేరియంట్లో మార్కెట్లో అందుబాటులో ఉంది. గ్లాంజ్ కేజీ ఫ్యూయల్‌కు 30.61 కిలోమీటర్లు, హైరైడర్ 26.1 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనున్నాయి.

టయోటా గ్లాంజా జీ గ్రేడ్ ధర రూ.8.43 లక్షల నుంచి, ఎస్ గ్రేడ్ రూ.9.46 లక్షల నుంచి ప్రారంభం కానుంది. టయోటా హైరైడర్ సీఎన్‌జీ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. ఎస్‌యూవీల్లో మొదటి సీఎన్‌జీ కారు హైరైడర్ సీఎన్‌జీనే కానుంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *