[ad_1]
Update Bank KYC Online: ప్రతి ఒక్కరు, తన KYC (Know Your Customer) వివరాలను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలి. డబ్బును రక్షించుకోవడానికి, భవిష్యత్ ఇబ్బందులను తప్పించుకోవడానికి తప్పనిసరిగా చేయాల్సిన పని ఇది. KYCని అప్‌డేట్ చేయడం చాలా సులభం. దీనికోసం బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చునే పని పూర్తి చేయవచ్చు. చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లు, సిమిలర్ అడ్రస్ ప్రూఫ్‌లతో ఆన్‌లైన్ ద్వారా KYC అప్‌డేట్ చేస్తే ఆమోదించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంక్‌లకు సూచించింది.
2022 వరకు, ఖాతాదార్లు తమ KYCని అప్‌డేట్ చేయడానికి సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండేది. ఈ సంవత్సరం ప్రారంభంలో, జనవరి 5, 2023 నాటి RBI సర్క్యులర్ ప్రకారం, KYC ఇన్ఫర్మేషన్‌లో ఎలాంటి మార్పులు లేకుంటే, వినియోగదార్లు వారి రిజిస్టర్డ్ ఈ-మెయిల్ అడ్రస్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ATM లేదా ఇతర డిజిటల్ మార్గాల ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించవచ్చని ప్రకటించింది. ఈ సర్క్యులర్ ప్రకారం, KYC సమాచారంలో ఎలాంటి మార్పు లేకుంటే, రీ-KYC ప్రాసెస్ కోసం కస్టమర్ ఇచ్చే స్వీయ ప్రకటన (self-declaration) సరిపోతుంది.
ఒకవేళ కస్టమర్ చిరునామా మారితే, పైన సూచించిన ఏదోక మార్గం ఏవైనా ఛానెల్ ద్వారా (రిజిస్టర్డ్ ఈ-మెయిల్ అడ్రస్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ATM లేదా ఇతర డిజిటల్ మార్గం) కొత్త చిరునామాను అందించవచ్చని ఆర్‌బీఐ సర్క్యులర్ చెబుతోంది. అడ్రస్ మార్పు కోసం కస్టమర్ తగిన డాక్యుమెంట్ సమర్పిస్తే, కొత్తగా ప్రకటించిన చిరునామాను దాదాపు 60 రోజులలోపు బ్యాంక్ వెరిఫై చేస్తుంది.
KYCని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసేందుకు స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్:
1. మొదట, మీ బ్యాంక్ అధికారిక ఆన్‌లైన్ బ్యాంకింగ్ పోర్టల్‌ను సందర్శించి లాగిన్ కావాలి
2. ఆ పోర్టల్‌లో, ‘KYC’ ట్యాబ్‌ను గుర్తించి దానిపై క్లిక్ చేయండి
3. ఆన్-స్క్రీన్ సూచనలను ఫాలో అవుతూ మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ సహా మీ వివరాలను సమర్పించండి
4. ఆధార్, పాన్, ఇతర అవసరమైన డాక్యుమెంట్ల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి. ప్రభుత్వ ID కార్డ్‌లను రెండు వైపులా స్కాన్ చేసి, అవి పేపర్ మీద ఒకే వైపు కనిపించేలా సెట్ చేయాలి.
5. ఇప్పుడు ‘సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయండి.
6. మీకు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అదే నంబర్ బ్యాంక్ మీకు SMS లేదా ఈ-మెయిల్ ద్వారా పంపుతుంది. మీరు పెట్టుకున్న అభ్యర్థన ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ ఉపయోగపడుతుంది.
KYC డాక్యుమెంట్ల గడువు ముగిసినా లేదా కొన్ని సందర్భాల్లో వారి KYC డాక్యుమెంట్స్‌ను అప్‌డేట్ చేయడానికి బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సి రావచ్చు. ఆన్‌లైన్ ద్వారా కాకుండా బ్రాంచ్‌కు వచ్చి KYC అప్‌డేట్ చేయమని ప్రత్యేక సందర్భాల్లో బ్యాంక్‌లు అడుగుతుంటాయి. అప్పుడు తప్పనిసరిగా బ్యాంక్‌కు వెళ్లి ఆ పని పూర్తి చేయాలి.
KYC అంటే ఏమిటి?
మీ కస్టమర్ గురించి తెలుసుకోండి ((Know Your Customer) అనేది ఒక నిర్దిష్ట ప్రక్రియ. కస్టమర్ల గుర్తింపును నిర్ధారించడానికి, రిస్క్ లెవెల్స్‌ను అంచనా వేయడానికి తమ ఖాతాదార్ల గుర్తింపు, చిరునామాల వంటి వివరాలను బ్యాంక్‌లు పొందే ప్రాసెస్ ఇది. దీనివల్ల కస్టమర్లకు కూడా ఉపయోగం ఉంటుంది. KYC అప్‌డేషన్ వల్ల బ్యాంకు సర్వీసులు దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట పడుతుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు, నిర్దిష్ట సమయంలో KYC వివరాల అప్
టు డేట్ ఉండేలా చూడడం బ్యాంక్ బాధ్యత. అందుకే, బ్యాంక్‌లు KYC అప్‌డేషన్స్ విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తాయి.
మరో ఆసక్తికర కథనం: నవరాత్రులు-దీపావళి మధ్య స్టాక్స్ కొన్నవాళ్లు ధనవంతులయ్యారు, పదేళ్ల రికార్డ్ ఇది
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
[ad_2]
Source link
Leave a Reply