[ad_1]
Maruti Suzuki Brezza Features: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ బ్రెజా టెక్నాలజీ, ఫీచర్లలో కొన్ని మార్పులు చేసింది. ఈ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ప్రయాణీకులందరికీ సీట్ బెల్ట్ రిమైండర్‌ను ఇచ్చే ఫీచర్ కూడా ఉంది. అయితే ఇంతకుముందు ఇది ముందు సీట్లకు మాత్రమే అందుబాటులో ఉంది. కానీ దీంతో హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ దాని సీఎన్‌జీ మోడల్ నుంచి తీసివేశారు.
మారుతి ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ నుంచి మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా తొలగించింది. ఇప్పుడు ఇది 17.38 లీటరుకు కిలోమీటర్ల మైలేజీని పొందుతుంది. బ్రెజా ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 20.15 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
ఈ ఎస్‌యూవీ సీఎన్‌జీ వేరియంట్ కిట్‌తో పాటు 1.5 లీటర్ పెట్రోల్ మోటార్ ఇంజిన్‌ను పొందుతుంది. ఈ కారు సీఎన్‌జీ వేరియంట్ గరిష్టంగా 87.8 బీహెచ్‌పీ పవర్‌ని, 121.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారు 5 స్పీడ్ మ్యాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను పొందుతుంది.
అనేక ఫీచర్లను తగ్గించిన తర్వాత కూడా కంపెనీ ఈ ఎస్‌యూవీ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. మారుతి బ్రెజా ధర ప్రస్తుతం రూ. 8.29 లక్షల నుంచి రూ. 13.98 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులో ఉంది. దాని సీఎన్‌జీ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.24 లక్షల నుంచి రూ. 12.15 లక్షల మధ్య ఉంది.
మారుతి తన వాహనాల పోర్ట్‌ఫోలియోను నిరంతరం పెంచుకుంటూ పోతూనే ఉంది. కంపెనీ ఈ సంవత్సరం మూడు కొత్త మోడళ్లను విడుదల చేసింది. ఇందులో లేటెస్ట్‌గా వచ్చిన ఫ్రాంక్స్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్, 5 డోర్ జిమ్నీ, ఇన్విక్టో ప్రీమియం స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎమ్‌పీవీ ఉన్నాయి. టాటా నెక్సాన్‌తో మారుతి సుజుకి బ్రెజా పోటీపడుతుంది.
మారుతి సుజుకి విటారా బ్రెజా 2016లో మొదటిసారిగా లాంచ్ అయింది. ఇందులో కేవలం డీజిల్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది. 2020లో బీఎస్6 నిబంధనలు అందుబాటులోకి రావడంతో కంపెనీ డీజిల్ ఇంజిన్ల తయారీని ఆపేసింది. 1.5 లీటర్ బీఎస్6 ఎస్‌హెచ్‌వీఎస్ పెట్రోల్ ఇంజిన్‌తో మారుతి సుజుకి విటారా బ్రెజా ఫేస్‌లిఫ్ట్‌ను కంపెనీ అప్పట్లోనే లాంచ్ చేసింది. ప్రస్తుతం ఎస్‌యూవీ విభాగంలో పోటీ కూడా విపరీతంగా ఎక్కువైంది. మారుతి సుజుకి కొత్త తరం బ్రెజాను కూడా ఇటీవలే లాంచ్ చేసింది. అంతేకాకుండా కారు పేరులో విటారా కూడా తీసేసి కేవలం ‘బ్రెజా’గానే మార్కెట్ చేసింది. ఈ మారుతి సుజుకి బ్రెజా ధర రూ.7.99 లక్షల నుంచి రూ.13.96 లక్షల మధ్య నిర్ణయించారు. దీని ముందు వెర్షన్ మారుతి సుజుకి విటారా బ్రెజా ధర రూ.7.34 లక్షల నుంచి రూ.11.40 లక్షల మధ్య ఉంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే – కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
[ad_2]
Source link
Leave a Reply