భారీగా పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ – అధికారికంగా ప్రకటించిన కంపెనీ!

[ad_1]

Royal Enfield Sales Report: టూ వీలర్ తయారీదారు రాయల్ ఎన్‌ఫీల్డ్ 2023 మార్చికి తన విక్రయాల నివేదికను విడుదల చేసింది. ఈ కాలంలో కంపెనీ మొత్తం 72,235 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. మార్చి 2022లో కంపెనీ మొత్తం 67,677 యూనిట్లను విక్రయించింది. అంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన ఏడు శాతం పెరిగాయన్న మాట.

2022-23 ఆర్థిక సంవత్సరంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం 8,34,895 మోటార్‌సైకిళ్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది కంపెనీకి అత్యధిక విక్రయాలు. ఈ సంఖ్య 2021-22 కంటే 39% ఎక్కువ. కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా 1,00,000 వాహనాలను ఎగుమతి చేసింది. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం కంటే కంటే 23 శాతం ఎక్కువ. అదే సమయంలో, కంపెనీ దేశీయ మార్కెట్లో గత సంవత్సరంతో పోలిస్తే 41 శాతం పెరుగుదలతో 7,34,840 యూనిట్లను విక్రయించింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈవో బి. గోవిందరాజన్ మాట్లాడుతూ, “ఈ సంవత్సరం రాయల్ ఎన్‌ఫీల్డ్ వృద్ధి చెప్పుకోదగినదిగా ఉంది. అమ్మకాలు, మార్కెట్ వాటాలో పురోగతిని సాధించాం. హంటర్ 350, సూపర్ మెటోర్ 650 వంటి మోటార్‌సైకిళ్లతో మొదటిసారిగా 100,000 యూనిట్ల ఎగుమతి మార్కును అధిగమించాం. మా అంచనాలకు మించి మంచి పనితీరు కనబరిచాం. కంపెనీకి కొత్త కస్టమర్లు కూడా వచ్చారు. హంటర్ 350 లాంచ్ అయిన ఆరు నెలల్లోనే ఒక లక్ష యూనిట్లకు పైగా అమ్ముడుపోయింది. అలాగే సూపర్ మెటోర్ 650 కూడా మంచి పనితీరును కనబరుస్తోంది.” అన్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650కి నాలుగు కొత్త కలర్ ఆప్షన్‌లను, కాంటినెంటల్ GT 650కి రెండు కొత్త కలర్ ఆప్షన్‌లను కంపెనీ యాడ్ చేసింది. ఈ కొత్త అప్‌డేట్‌లతో ఈ రెండు బైక్‌లు USB ఛార్జింగ్, LED హెడ్‌ల్యాంప్, కొత్త స్విచ్ గేర్ వంటి ఫీచర్లను కూడా పొందాయి. 2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650 ఇప్పుడు ట్యూబ్‌లెస్ టైర్లు, కాస్ట్ అల్లాయ్ వీల్స్‌తో బ్లాక్డ్-అవుట్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన చవకైన బైక్ హంటర్ 350ని గత సంవత్సరం ఆగస్టులో రూ. 1.5 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ధర విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిళ్లలో ఒకటిగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 నిలిచింది.

హంటర్ 350 రెండు వేరియంట్‌లలో వస్తుంది. వీటిలో మొదటిది హంటర్ రెట్రో కాగా మరొకటి హంటర్ మెట్రో. రెండూ వేర్వేరు రంగులు, ఎక్విప్‌మెంట్ ఆప్షన్లతో రానున్నాయి. ఈ రెండిట్లో హంటర్ రెట్రో తక్కువ బడ్జెట్‌తో వినియోగదారులను ఆకర్షిస్తుంది. అయితే మెట్రో వేరియంట్ మరిన్ని లేటెస్ట్ ఫీచర్‌లను అందిస్తుంది. అందుకే దీనికి కొంచెం అధిక ధర ట్యాగ్ వేసింది. హంటర్ 350 విక్రయాలు గత ఆరు నెలల్లోనే ఒక లక్ష యూనిట్ల మార్కును దాటాయి. ఇది క్లాసిక్ 350 తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్స్‌లో అత్యధికంగా అమ్ముడైన మోడల్.

2022 ఆగస్టులో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 అత్యధికంగా 18 వేల కంటే ఎక్కువ యూనిట్లు కంటే అమ్ముడు పోయింది. అక్టోబర్, నవంబర్‌ల్లో హంటర్ అమ్మకాలు దాదాపు నెలకు 15.5 వేల యూనిట్ల వరకు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే నెలకు 16.7 వేల యూనిట్లను రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయించింది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *