[ad_1]
మొత్తం 125 రోజులు ప్రయాణం తర్వాత 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి లాగ్రాంజ్ పాయింట్‌కు చేరుతుంది. అక్కడ నుంచి సూర్యుడ్ని నిరంతరం డేగ కళ్లతో పరిశీలించి.. నిమిషానికొక ఫోటోను తీసి పంపుతుంది. ఐదేళ్ల కాలపరిమితితో సూర్యుడి గురించి పరిశోధనలకు ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఇందులోని మొత్తం ఏడు పేలోడ్లలో ఐదింటిని ఇస్రో.. మిగతా రెండింటిని దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల సహకారంతో అభివృద్ధి చేశారు.
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబరు 2 శనివారం ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక నింగిలోకి మోసుకెళ్లింది. 63 నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత 1480.7 కిలోల ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోయి భూ ఎగువ కక్ష్యలోకి చేరింది.
సూర్యుడి మూడు లేయర్లు ఫొటో స్పియర్, క్రోమో స్పియర్ సహా వెలుపల ఉండే కరోనాను ఈ ఉపగ్రహం అధ్యయనం చేస్తుంది. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధించనుంది. ఈ క్రమంలోనే అమెరికా, జపాన్, యూరప్, చైనాల తర్వాత సూర్యుడిపైకి ఉపగ్రహాన్ని పంపిన ఐదో దేశంగా భారత్ నిలిచింది. సూర్యుడి చుట్టూ ఐదు లాగ్రాంజ్ పాయింట్‌లు ఉండగా.. అందులో ఎల్ 1 వద్దకు ఆదిత్య ఎల్ 1ను ఇస్రో పంపుతోంది. అయితే, చంద్రయాన్-3 మాదిరిగా సూర్యుడి ఉపరితలంపై ఆదిత్య ఎల్ 1 ను ల్యాండింగ్ చేయడం కుదరదు. కానీ, సూర్యుడి బయటి పొర అయిన కరోనాలోకి ఏదైనా ఉపగ్రహాన్ని పంపిస్తే దాన్ని సూర్యుడిపై దిగినట్లుగానే పరిగణిస్తారు.
Read More Latest Science & Technology News And Telugu News
[ad_2]
Source link
Leave a Reply