మార్కెట్‌ అంచనాల్ని బీట్‌ చేసిన హెచ్‌సీఎల్ టెక్‌, Q3 లాభంలో 19% వృద్ధి

[ad_1]

HCL Tech Q3 Results: ఐటీ సేవలు ప్రధానంగా పని చేసే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Tech) కూడా, ఇన్ఫోసిస్‌ తరహాలోనే అంచనాలను మించి రాణించింది. 2022 డిసెంబర్ త్రైమాసికానికి (Q3FY23) మంచి నంబర్లను పోస్ట్‌ చేసింది. 

2021 డిసెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే, 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 19% (YoY) పెరిగి రూ. 4,096 కోట్లకు చేరింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో (Q3FY22) ఇది రూ. 3,442 కోట్లుగా ఉంది.

సీక్వెన్షియల్ (QoQ) ప్రాతిపదికన.. కంపెనీ పన్ను తర్వాతి లాభం (PAT) మునుపటి సెప్టెంబర్ త్రైమాసికంలోని రూ. 3,489 కోట్ల నుంచి ఇప్పుడు 17% పెరిగింది.

అదే సమయంలో, కార్యకలాపాల కంపెనీ ఆదాయం (revenue from operations) 19.5% పెరిగి రూ. 26,700 కోట్లకు చేరుకుంది, ఇది గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 22,331 కోట్లుగా ఉంది.

news reels

2022 సెప్టెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే డిసెంబర్‌ త్రైమాసికంలో ఎబిటా (EBIDTA) మార్జిన్‌ 165 బేసిస్‌ పాయింట్లు లేదా 1.65% పెరిగి 19.6% చేరింది. నెట్‌ మార్జిన్‌ సైతం 117 బేసిస్‌ పాయింట్లు లేదా 1.17% పెరిగి 15.3% చేరింది. 

బలమైన డీల్‌ విన్స్‌
డిసెంబర్‌ త్రైమాసికంలో.. అటు ఆదాయంలోను, ఇటు లాభంలోనూ మార్కెట్ ఊహించిన దాని కంటే ఎక్కువ మొత్తాన్ని ఈ ఐటీ కంపెనీ సాధించింది. బలమైన డీల్ విన్స్‌ దీనికి సాయపడ్డాయి. కంపెనీ నికర లాభం 11%, ఆదాయం 17% పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.

సమీక్ష కాల త్రైమాసికంలో 17 లార్జ్‌ డీల్స్‌ను హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గెలుచుకుంది. వీటిలో.. సర్వీసుల విభాగంలో 7; సాఫ్ట్‌వేర్‌ విభాగంలో 10 ఉన్నాయి. కాంట్రాక్టుల మొత్తం విలువ 2.35 బిలియన్‌ డాలర్లు. YoYలో ఇది 10% వృద్ధి.

అయితే, కాలానుగుణ సవాళ్లు ఉన్నాయని చెబుతూ, దాని పూర్తి సంవత్సర (FY23) ఆదాయ గైడెన్స్‌ను రెండోసారి కూడా ఈ కంపెనీ మేనేజ్‌మెంట్‌ తగ్గించింది, గతంలోని 13.5-14.5% నుంచి 13.5-14.0%కి కుదించింది. సేవల విభాగం ఆదాయాలు 16-16.5%గా నమోదు కావచ్చని మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది. ఎబిటా మార్జిన్‌ 18-18.5 శాతంగా ఉండొచ్చని పేర్కొంది.

తగ్గిన అట్రిషన్‌ రేటు
డిసెంబర్‌ త్రైమాసికంలో 5,892 మంది ఫ్రెషర్స్‌ను కంపెనీ నియమించుకుంది. ఆ త్రైమాసికంలో కంపెనీని విడిచి పెట్టిన వాళ్లను తీసేయగా, నికరంగా 2,945 ఉద్యోగులను తీసుకున్నట్లు లెక్క తేలింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,22,270కు చేరింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో వలసల (అట్రిషన్‌) రేటు 23.8 శాతంగా ఉండగా, డిసెంబర్‌ త్రైమాసికంలో అది 21.7 శాతానికి తగ్గింది.

FY23 కోసం, ఒక్కో ఈక్విటీ షేర్‌కు ₹10 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ఆమోదించింది. రికార్డు తేదీని జనవరి 20, 2023గా నిర్ణయించారు. 1 ఫిబ్రవరి, 2023న మధ్యంతర డివిడెండ్ చెల్లింపు జరుగుతుంది.

గురువారం, HCL Tech షేరు ధర 1.68% పెరిగి, ₹1,072.50 వద్ద క్లోజయింది. గత ఏడాది కాలంలో ఈ స్టాక్‌ 21% పైగా పడిపోయింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *