మీ ఆధార్‌ కార్డ్‌ డెడ్‌లైన్‌ అతి దగ్గర్లో ఉంది, గడువు దాటకముందే జాగ్రత్త పడండి

[ad_1]

How Update Aadhar Details In Telugu: మీ ఆధార్ కార్డ్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్‌ ఇది. మీ ఆధార్‌ వివరాల్లో తప్పులు ఉన్నా, గత పదేళ్లుగా అప్‌డేట్‌ చేయకపోయినా, ఇప్పుడు మీకో అవకాశం ఉంది. మీ కార్డ్‌లోని వివరాలను ఫ్రీగా మార్చుకునేందుకు/అప్‌డేట్ చేసుకునేందుకు డెడ్‌లైన్‌ ‍‌(Last Date For Update Aadhaar Card For Free) దగ్గర పడుతోంది.          

మీ చిరునామా, ఫోన్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీ వంటివి మారితే మీ ఆధార్‌ డీటైల్స్‌లో వాటిని కచ్చితంగా అప్‌డేట్‌ చేయాలి. గత పదేళ్లుగా మీరు మీ ఆధార్‌లో ఎలాంటి మార్పులు చేయకపోయినా ఇప్పుడు అప్‌డేట్‌ చేయాల్సిందే. గత పదేళ్లలో మీకు సంబంధించిన ఏ వివరాలు మారకపోయినా, పాత చిరునామా, ఫోన్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీతోనే ఒకసారి అప్‌డేట్‌ చేస్తే మంచింది. దీంతో పాటు.. మీ పుట్టిన తేదీ, పేరు, జెండర్‌లో తప్పు దొర్లినా (Name, Address, DoB, Gender, Mobile & Email ID Details Change in Aadhaar) ఇప్పుడు ‘పూర్తి ఉచితం’గా సరి చేసుకోవచ్చు.         

ఆధార్‌ కార్డ్‌ ‘ఫ్రీ’ అప్‌డేషన్‌కు ఆఖరు తేదీ నెల 14 (14 December 2023) వరకే ఉంది. ఈ గడువును మరోమారు పెంచే అవకాశం లేకపోవచ్చు.      

ఆధార్ డీటైల్స్‌ను ఎలా అప్‌డేట్ చేయాలి? (How Update Aadhar Details?)        

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్‌ (UIDAI) పోర్టల్‌లోకి వెళ్లి మీ ఆధార్‌ వివరాలను సరి చేసుకోవచ్చు. ఇందుకోసం https://myaadhaar.uidai.gov.in లింక్‌ ద్వారా ఉడాయ్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.          

ఉడాయ్‌ వెబ్‌సైట్‌కి వెళ్లిన తర్వాత, మీ ఆధార్‌ నంబర్‌తో లాగిన్ అవ్వండి
మీ పేరు/జెండర్‌/పుట్టిన తేదీ, చిరునామా ఆప్షన్లు ఎంచుకోండి
‘అప్‌డేట్ ఆధార్’ ఆప్షన్‌ ఎంచుకోండి
ఇప్పుడు, చిరునామా లేదా ఇతర సమాచారాన్ని అప్‌డేట్‌ చేయడానికి అక్కడ కనిపించే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
ఆ తర్వాత, స్కాన్ చేసిన ప్రూఫ్‌ కాపీలను అప్‌లోడ్ చేసి, డెమోగ్రాఫిక్ డేటాను (Demographic data) అప్‌డేట్‌ చేయండి
ఇప్పుడు మీకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్‌ నంబర్ (URN) వస్తుంది
ఆ నంబర్‌ను సేవ్‌ చేసుకోండి. ఆధార్‌ అప్‌డేషన్‌ స్టేటస్‌ తనిఖీ చేయడానికి ఆ నంబర్‌ ఉపయోగపడుతుంది

ఆధార్ అప్‌డేషన్‌ ప్రాసెస్‌ను ఎలా ట్రాక్ చేయాలి? (How to Track Aadhaar Updation Process?) 

ఆధార్ కార్డ్‌లో మార్పుల కోసం మీరు రిక్వెస్ట్‌ చేసిన తర్వాత, మీకు URN నంబర్ వస్తుంది. అది మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు కూడా SMS ద్వారా అందుతుంది. మీరు https://ssup.uidai.gov.in/checkSSUPStatus/checkupdatestatus లింక్‌ ద్వారా పోర్టల్‌లోకి వెళ్లి, మీ ఆధార్ కార్డ్ వివరాల అప్‌డేషన్‌ స్థితిని ట్రాక్ చేయవచ్చు.      

మరో ఆసక్తికర కథనం: ఈ నెలలో ముగిసే బ్యాంక్‌ స్పెషల్‌ ఆఫర్లు, పూర్తి చేయాల్సిన పనులు – వీటిని మిస్‌ కావద్దు

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *