మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే.. ఆహారాలు ఇవే..!

[ad_1]

​​digestive health: జీర్ణ సమస్యలు సాధారణంగా.. అనారోగ్యకరమైన ఆహారం, నిశ్చల జీవనశైలి కారణంగా ఎదురవుతూ ఉంటాయి. మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయడంతోపాటు.. శరీరానికి అవసరమైన పోషకాలను శోషించుకొని వ్యర్థాలను బయటకు నెట్టేయడంలో జీర్ణవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగ్గా పని చేయకపోతే.. మలబద్ధకం, యాసిడ్ రిఫ్లక్స్, ఎసిడిటీ, గ్యాస్‌, అజీర్ణం, త్రేనుపు, గుండెల్లో మంట, ఇరిటేటబుల్‌ బౌల్‌ సిండ్రోమ్‌ (IBS) వంటి సమస్యలు ఎదురవుతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో, పనితీరును మెరుగుపరచడంలో కొన్ని ఆహార పదార్థాలు సహాయపడతాయి. మీ జీర్ణ వ్యవస్థను రక్షంచే ఆహారాలు ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

పెరుగు..

పెరుగు..

మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పెంపొందించే మరో అద్భుతమైన ఆహారం పెరుగు. పెరుగులోని ప్రోబయోటిక్స్‌ గట్ మైక్రోబయోమ్ సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమై, కడుపుబ్బరం వంటి సమస్యలను దూరం చేసే మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయడంలో పెరుగు సమర్థంగా పనిచేస్తుంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే.. జీర్ణక్రియ సాఫీగా జరిగి, తేన్పులతో పాటు ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.

అల్లం..

అల్లం..

వికారం, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలకు చికిత్స చేయడానికి అల్లాన్ని ఎన్నో శతాబ్దాలుగా వాడుతున్నారు. అల్లంలో జింజెరోల్స్, షోగోల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థలో మంటను తగ్గిస్తుయి. జీర్ణక్రియను ప్రోత్సహించడలో సహాయపడతాయి. అల్లం జీర్ణవ్యవస్థలోని కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. ఉబ్బరం, గ్యాస్‌ వంటి సమస్యలను నివారిస్తుంది. రోజుకు రెండు లేదా మూడు సార్లు చిన్న అల్లం ముక్కను తీసుకోవడం వల్ల తేన్పుల సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు. (Image source – pixabay)

ఓట్స్‌..

ఓట్స్‌..

ఓట్స్‌లో కరిగే ఫైబర్‌ మెండుగా ఉంటుంది. ఇది పేగు కదలికలను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. కరిగే ఫైబర్‌ ఫైబర్ పేగులో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది, ఇది జీర్ణవ్యవస్థ ద్వారా ఆహార మార్గాన్ని నమ్మెదిస్తుంది. దీంతో.. శరీరం పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహించుకోగలదు. (Image source – pixabay)

ఈ టిప్స్‌ ఫాలో అయితే.. గట్‌ హెల్త్ బావుంటుంది..!

బొప్పాయి..

బొప్పాయి..

బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. పాపైన్ ప్రొటీయోలైటిక్ ఎంజైమ్, అంటే ఇది జీర్ణవ్యవస్థలో ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది గ్యాస్‌, ఉబ్బరం, గ్యాస్‌ వంటి జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. బొప్పాయిలో ఫైబర్ ఉంటుంది, ఇది ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. (Image source – pixabay)

పుదీనా..

పుదీనా..

పుదీనా.. ఉబ్బరం, అజీర్ణం, వికారం వంటి జీర్ణ సమస్యలకు చికిత్స చేయడానికి ఔషధంలా పనిచేస్తుంది. పుదీనాలో.. జీర్ణాశయ కండరాలను సడలించడానికి సహాయపడే సమ్మేళనాలు ఉంటాయి. ఇది ఉబ్బరాన్ని నివారించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. పుదీనా జీర్ణవ్యవస్థలో మంటను తగ్గిస్తుంది, ఇరిటేటబుల్‌ బౌల్‌ సిండ్రోమ్‌ (IBS) సమస్యను పరిష్కరిస్తుంది.

గట్‌ ఆరోగ్యంగా ఉండాలంటే.. మీ ఆహారంలో ఈ విటమిన్స్‌ కచ్చితంగా ఉండాలి..!
గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *