[ad_1]
Income Tax: కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చి, విస్త్రతంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ఎపిసోడ్‌లో, కొత్త పన్ను విధానాన్ని (New Tax Regime) డిఫాల్ట్ విధానంగా తెరపైకి తెచ్చింది. ఇది, జీతం తీసుకునే పన్ను చెల్లింపుదార్లపై (Salaried Taxpayers) ప్రభావం చూపుతుంది. పాత-కొత్త పన్ను పద్ధతుల్లో ఒకదానిని ఎంచుకునే సమయంలో చేసే నిర్లక్ష్యం లేదా జాప్యం లేదా బద్ధకం వల్ల సదరు టాక్స్‌పేయర్ ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
మీ మౌనం సంపూర్ణ అంగీకారం
కొత్త పన్ను వ్యవస్థను డిఫాల్ట్‌గా తీసుకోవడం అంటే ఏంటో మొదట తెలుసుకుందాం. పాత-కొత్త పన్ను పద్ధతుల్లో మీరు ఎంచుకున్న విధానం గురించి మీ యజమానికి మీరు చెప్పకపోతే, ఆటోమేటిక్‌గా కొత్త పన్ను వ్యవస్థ మీపై అప్లై అవుతుంది. ఇంకా సరళంగా చెప్పాలంటే, మీరు జీతం పొందే వ్యక్తి అయితే, యజమానికి మీ పన్ను విధానం గురించి చెప్పకపోతే, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడానికి మీరు అంగీకరించినట్లు కంపెనీ భావిస్తుంది.
TDS ఎక్కువ కట్ కావచ్చు
ఉద్యోగులు కొత్త లేదా పాత పన్ను విధానంలో ఏదిలో కొనసాగాలనుకుంటున్నారో సమాచారం తీసుకోవాలని కంపెనీల యజమానులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఇటీవల సూచించింది. మీ జీతంపై విధించాల్సిన పన్నును, మీరు ఎంచుకున్న విధానం ప్రకారం లెక్కిస్తారు, దాని ప్రకారమే యజమాని TDS కట్ చేస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరం (2024-25 మదింపు సంవత్సరం) నుంచి కొత్త పన్ను విధానం డిఫాల్ట్ ఆప్షన్‌గా మార్చారు కాబట్టి, మీ ఎంపికపై ఎలాంటి సమాచారం యాజమాన్యానికి వెళ్లకపోతే, కొత్త పన్ను విధానం ప్రకారం మీ జీతం నుంచి TDS తీసివేస్తారు.
పన్ను చెల్లింపుదార్లకు ఇదే చివరి అవకాశం
మరొక విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం, పన్ను చెల్లింపుదార్లకు రెండో అవకాశం కూడా ఇచ్చింది. పాత విధానం మీకు లాభదాయకంగా ఉంటే, ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే మీరు ఆ పన్ను విధానాన్ని ఎంచుకోకపోతే, మీ జీతం నుంచి ఎక్కువ TDS కట్ అవుతుంది. మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేస్తున్నప్పుడు మీరు ప్రాధాన్యత ఎంపికను మళ్లీ మార్చుకునే అవకాశం ఉంటుంది. మీ పన్ను బాధ్యత కంటే TDS ఎక్కువగా కట్ అయితే, దాని వాపసును క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే, ITR ఫైల్ చేసిన తర్వాత మీ ఎంపికను మార్చడానికి అవకాశం లేదని గుర్తుంచుకోండి. కాబట్టి, ITR ఫైల్ చేయకముందే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
పాత పన్ను విధానంలో HRA, సెక్షన్ 80C, 80D, సెక్షన్ 24 (b) సహా దాదాపు 70 మినహాయింపులు, తగ్గింపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ మినహాయింపులు పోయాక మీ పన్ను బాధ్యత లెక్క తేలుతుంది.
కొత్త పన్ను విధానం 2020లో ప్రారంభమైంది. కొత్త వ్యవస్థను ఆకర్షణీయంగా మార్చేందుకు, 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో అనేక మార్పులు ప్రకటించారు. మొదటిది.. ఈ విధానంలో, రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను విధించరు. శ్లాబుల సంఖ్యను 6 నుంచి 5కి తగ్గించారు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచారు. స్టాండర్డ్ డిడక్షన్ రూపంలో మరో రూ. 50,000 అదనపు ప్రయోజనం ఉంటుంది. వీటి తర్వాత పన్ను బాధ్యత నిర్ణయం అవుతుంది.
[ad_2]
Source link
Leave a Reply