మీ వంటగదిలోని వస్తువులతో.. కీళ్ల నొప్పులను మాయం చేయండి..!

[ad_1]

Herbs to Fight Arthritis pain: లైఫ్‌స్టైల్‌ మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, చెడు ఆహార అలవాట్ల కారణంగా, అధిక బరువు, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల గతంలో వయస్సు మీద పడిన తర్వాత వచ్చే కీళ్లనొప్పులు.. ప్రస్తుతం ముఫ్పై, నలభైలలోనే వేధిస్తున్నాయి. ఈ సమస్య ఉంటే.. లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. కీళ్లకు సంబంధించిన సమస్యలను ఆర్థరైటిస్‌ అంటారు. అర్థరైటిస్‌ మితిమీరిన వ్యాయామం, పోషకాహార లోపం, క్యాల్షియం లోపం, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, హార్మోన్ల ప్రభావం, రసాయనాల సమతుల్యత లోపం, రోగనిరోధకశక్తి తగ్గడం వల్ల వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్య కారణంగా.. మోకాళ్లలో కార్టిలేజ్‌ అరగడం, సైనోవియల్‌ ఫ్లూయిడ్‌ తగ్గడం వల్ల కీళ్లు రెండూ ఒరుసుకుపోయి నొప్పి, వాపు మొదలై కీళ్లు కదపడం ఇబ్బందిగా మారుతుంది. అర్థరైటిస్‌ లక్షణాలను తగ్గించడానికి, నొప్పిని మాయం చేయడాని సహాయపడే కొన్ని ఆయుర్వేద మూలికల గురించి ఆయుర్వేద నిపుణురాలు జీకేదారా జయశ్రీ MD (Ayu) మనకు వివరించారు. ఆయుర్వేదంలో కీళ్ల నొప్పులకు వాత దోషం కారణమని చెబుతారు. కీళ్ల నొప్పులను తగ్గించడానికి వాత దోషాన్ని తగ్గించాలని జీకేదారా జయశ్రీ అన్నారు.

పసుపు..

పసుపు..

పసుపులో కర్కుమిన్ పుష్కలంగా ఉంటుంది. దీనికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం, చైనీస్‌ వైద్యంలో.. పసుపును నొప్పులు తగ్గించడానికి ఉపయోగిస్తారు. పసుపు గౌట్‌, రుమటాయిడ్‌ అర్థరైటిస్‌ లక్షణాల నుంచి ఉపశమనం ఇస్తుంది. క్రోనిక్‌ ఇన్ఫ్లమేటరీ జాయింట్‌ పెయిన్స్‌ను తగ్గించడానికి పసుపు ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. మీకు నొప్పిగా ఉన్న ప్రాంతంలో పసుపుని అప్లై చేయండి. పసుపును రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. మీరు పాలలో పసుపు వేసి తాగినా.. నొప్పి నుంచి రిలీఫ్‌ పొందవచ్చు.

వాము..

వాము..

వాములో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి.. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడతాయి. దీనిలో కీళ్ల నొప్పులు, వాపును తగ్గించే.. ఎనెస్థటిక్‌ గుణాలు ఉన్నాయి. కీళ్ల వాపు, ఎరుపు వంటి అర్థరైటిస్‌ లక్షణాలతో పోరాడే యాంటీబయోటిక్‌ వాములో పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో ఆర్థరైటిస్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు వాము సహాయపడుతుంది. వాము పొడిలో నీళ్లు వేసి.. పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ను నొప్పిగా ఉన్న ప్రాంతంలో అప్లై చేయండి. ఇది మీ కీళ్ల నొప్పి, వాపును తగ్గిస్తుంది. మీరు వాము టీ చేసుకుని తాగినా రిలీఫ్‌ ఉంటుంది. (Image source – pixabay)

యూకలిప్టస్ నూనె..

యూకలిప్టస్ నూనె..

యూకలిప్టస్ నూనెలో టానిన్లు ఉంటాయి. ఇవి వాపు, నొప్పిని తగ్గిస్తాయి. యూకలిప్టస్ ఆయిల్ సువాసన కీళ్లపై సూథింగ్‌ ఎఫెక్ట్‌ ఇస్తుంది. దీనిలో గుణాలు కీళ్ల అసౌకర్యం నుంచి ఉపశమనం లభిస్తాయి. యూకలిప్టస్ ఆయిల్ కీళ్లపై అప్లై చేస్తే పెయిన్‌ కిల్లర్‌లా పనిచేస్తుంది.

అల్లం..

అల్లం..

అల్లంలో శక్తివంతమైన.. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడానికి సహాయపడతాయి. అర్థరైటిస్‌కు చికిత్స చేసేందుకు.. అల్లం గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. మీరు అర్థరైటిస్‌ నొప్పితో బాధపడుతుంటే.. అల్లం నూనెను ఆ ప్రాంతంలో అప్లై చేస్తే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లం టీగా తయారు చేసుకుని తాగినా నొప్పి తగ్గుతుంది.

దాల్చిన చెక్క..

దాల్చిన చెక్క..

దాల్చిన చెక్కలో సిన్నమాల్డిహైడ్, సిన్నమిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. ఇది ఫ్రీ ఫ్రీ రాడికల్స్‌ వల్ల కలిగే సెడ్‌ డ్యామేజ్‌‌ నుంచి రక్షిస్తుంది. దాల్చిన చెక్క మీ ఆహారంలో చేర్చుకుంటే.. అర్థరైటిస్‌ కారణంగా వచ్చే వాపు తగ్గుతుంది. దాల్చిన చెక్క సప్లిమెంటేషన్ మంట, ఆక్సీకరణ ఒత్తిడికి సంబంధించిన.. బయోమార్కర్‌లను తగ్గిస్తుందని కాంప్లిమెంటరీ థెరపీస్ ఇన్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక పరిశోధన స్పష్టం చేసింది.

వెల్లుల్లి..

వెల్లుల్లి..

వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది పక్షపాత ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్ఫ్లమేటరీ సైటోకిన్లు నొప్పి, వాపు, మృదులాస్థితో పోరాడడంలో ప్రయోజనకరమైన లక్షణాలు వెల్లుల్లిలో ఉంటాయి. వెల్లుల్లి ముఖ్యంగా గౌట్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. మీరు అర్థైరైటిస్‌తో బాధపడుతుంటే.. మీ డైట్‌లో వెల్లుల్లిని చేర్చుకోండి. వెల్లుల్లిని కాల్చి తినవచ్చు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *