[ad_1]
Paytm Payments Bank Crisis: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ పేటీఎమ్ బ్యాంక్ సంక్షోభంపై (Paytm Bank Crisis) స్పందించారు. ఆంక్షలు విధించే ముందే ఆ సంస్థకి తగిన సమయం ఇచ్చామని స్పష్టం చేశారు. వాళ్ల తప్పుల్ని సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతోనే ఆంక్షలు విధించినట్టు వెల్లడించారు. తాము ఎప్పుడూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోమని తెలిపారు. సూపర్‌వైజరీ సిస్టమ్‌ని బలోపేతం చేశామని, ఏ సంస్థలో ఇలాంటి అవకతవకలు కనిపించినా కచ్చితంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. పేటీఎమ్ సంస్థలోని సమస్యల్ని పరిష్కరించుకునేందుకు అవసరమైన సమయాన్ని ఇచ్చినట్టు తెలిపారు.
“మా నిఘా వ్యవస్థని చాలా బలోపేతం చేశాం. ఒక్క పేటీఎమ్ విషయంలోనే కాదు. ఏ సంస్థలో ఇలాంటి అవతకవతకలు అనిపించినా వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. ఏ సంస్థ అయినా తప్పులు సరిదిద్దుకోవాలన్నదే మా ఉద్దేశం. ఆంక్షలు విధించే ముందు తప్పులు సరిదిద్దుకోవాలని చెప్పాం. అందుకు తగిన సమయాన్నీ ఇచ్చాం. మాతో సరైన విధంగా సంప్రదింపులు జరపకపోతే…మేం అడిగిన సమాచారాన్ని ఇవ్వకపోతే అప్పుడే మేం చర్యలు తీసుకుంటాం”
– శక్తికాంత దాస్, RBI గవర్నర్
RBI Governor Shaktikanta Das says, “We give sufficient time to every entity to comply and sometimes more than sufficient time to the entities for compliance. If they would comply, why would a regulator like us would have to take action?” https://t.co/1MHrL9FFrO
— ANI (@ANI) February 8, 2024
వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ చర్యలు తీసుకుంటున్నామని శక్తికాంత దాస్ వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటే ఇంకా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే..ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేనని, వచ్చే వారం కొన్ని ప్రశ్నలకు సమాధానమిస్తామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం Paytm Payment Bank పై ఆంక్షలు విధించడం ఆ సంస్థను బాగా దెబ్బ తీసింది. ఇప్పటికే స్టాక్‌మార్కెట్‌లో భారీగా నష్టపోయింది. ఈ క్రమంలోనే పేటీఎమ్ సీఈవో విజయ్ శేఖర్ శర్మ (Vijay Shekhar Sharma) ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ని కలిసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 6వ తేదీన ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుత సంక్షోభంపై ఇద్దరూ చర్చించినట్టు సమాచారం.
ఇప్పటికే RBI ఉన్నతాధికారులతో ఓ సారి భేటీ అయ్యారు శేఖర్ శర్మ. అయితే…ఆంక్షలు ఎత్తివేస్తామన్న భరోసా మాత్రం RBI ఇవ్వలేదు. అందుకే….నేరుగా ఆర్థిక మంత్రినే కలవాలని సీఈవో భావించినట్టు తెలుస్తోంది. అటు ఈడీ కూడా ఈ కేసుని పూర్తి స్థాయిలో విచారించేందుకు సిద్ధమైంది. కానీ అటు పేటీఎమ్ సంస్థ మాత్రం బ్యాంక్‌కి అవసరమైన వివరాలన్నీ సమర్పించినట్టు వెల్లడించింది. ఈడీ దర్యాప్తుని తిరస్కరించింది. ఈ వదంతులను ఎవరూ నమ్మకూడదని వెల్లడించింది పేటీఎమ్ సంస్థ. ఇవి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని అసహనం వ్యక్తం చేసింది. తమ వినియోగదారులో తాము పూర్తి పారదర్శకంగా ఉన్నామని తేల్చి చెప్పింది. మనీలాండరింగ్ ఏమీ జరగలేదని, అయినా మేం విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తున్నామని వెల్లడించింది.
Also Read: 2025 నాటికి 20 లక్షల మందికి AI స్కిల్స్‌లో శిక్షణ, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటన
మరిన్ని చూడండి
[ad_2]
Source link
Leave a Reply