ముల్లంగితో.. ఈ కాంబినేషన్స్‌ అసలు తీనకూడదు..!

[ad_1]

Foods To Avoid With Radish: ఈ సీజన్‌లో ముల్లంగి ఎక్కువగా దొరుకుతుంది. దీంతో వెరైటీ వంటకాలు తయారు చేయవచ్చు. ముల్లంగి పచ్చడి, పరాటాలు, సలాడ్‌, ముఖ్యంగా సాంబార్‌ ముల్లంగి వేస్తే.. చాలా ఇష్టంగా తింటారు. ముల్లంగిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముల్లంగిలో విటమిన్ ఎ, బి6, ఇ, కె, ఫైబర్, జింక్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, ఐరన్, మాంగనీస్ వంటి మినరల్స్‌ మెండుగా ఉంటాయి. దీనిలో కాటెచిన్స్, పైరోగల్లోల్, వెనిలిక్ యాసిడ్‌, ఫినోలిక్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ సీజన్‌లో మన డైట్‌లో ముల్లంగి తరచుగా తీసుకుంటే.. ఇమ్యూనిటీ పెరుగుతుందని, అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేద డాక్టర్‌ కపిల్‌ త్యాగి (Dr. Kapil Tyagi, director of Kapil Tyagi Ayurveda Clinic, Sector 27, Noida) అన్నారు. కానీ, కొన్ని కాంబినేషన్స్‌తో ముల్లంగిని తీసుకుంటే.. ప్రాణాంతకం కావచ్చని అన్నారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

పాలతో వద్దు..

ముల్లంగి తిన్న తర్వాత.. పాలు తాగాకూడదని డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కపిల్‌ త్యాగి అన్నారు. ఈ కాంబినేషన్‌ తీసుకుంటే.. చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు చర్మ సమస్యలతో బాధపడుతుంటే.. ఆవి తగ్గడానికి ఎక్కువగా సమయం పడుతుంది.

ఖీర్‌..

మీరు ముల్లంగితో చేసిన ఏదైనా వంటకం తినే ముందు, ఆ తర్వాత.. పాలతో చేసిన ఖీర్‌ను ఎప్పుడూ తినకూడదూ. దీని కారణంగా స్కిన్‌ రాషెస్‌, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

కాకరకాయతో కలపొద్దు..

చలికాలంలో ఎక్కువగా తినే కూరగాయల్లో కాకరకాయ కూడా ఒకటి. అయితే.. ముల్లంగి, కాకరకాయ కాంబినేషన్‌ ఎప్పుడూ, తినకూడదని గూర్తుంచుకోండి. ఈ రెండూ కలిపి తింటే.. శ్వాస సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. రాత్రిపూట ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.

ఆరెంజ్‌..

శీతాకాలంలోల ఆరెంజ్‌ ఎక్కువగా దొరుకుతుంది. ఆరెంజ్‌ను చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఆరెంజ్‌, ముల్లంగిని మంచి కాంబినేషన్‌ కాదని డాక్టర్‌ కపిల్‌ త్యాగి అన్నారు. ఈ రెండు కలిపి తింటే.. మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్‌ వల్ల.. కడపుకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి.

టీతో కలపొద్దు..

టీ తాగిన తర్వాత/ముందుగాని… ముల్లంగి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ కాంబినేషన్‌ మలబద్ధకం, ఎసిడిటీ సమస్యలకు దారి తీస్తుంది. ముల్లంగి ప్రభావం చల్లగా ఉంటుంది, టీ ఎఫెక్ట్‌ వేడిగా ఉంటుంది. రెండూ ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకం. దీని కారణంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

కీరాతో వద్దు..

చాలా మంది కీరా, ముల్లంగి కలిపి సలాడ్‌లో తింటూ ఉంటారు. కానీ.. కీరా, ముల్లంగి కలిపి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. కీరాలో ఆస్కార్బేట్ ఉంటుంది.. ఇది విటమిన్‌ సీ ని గ్రహిస్తుంది. దీని వల్ల ముల్లంగిలోని విటమిన్‌ సీని శరీరం గ్రహించదు.

పనీర్‌..

ముల్లంగి, పనీర్‌… రెండు కలిపి తీసుకోకూడదు. ఈ కాంబినేషన్‌ కారణంగా.. చర్మ సమస్యలు వచ్చే అవాకాశం ఉంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *