[ad_1]
ముల్లంగిలోని పోషకాలు..
ముల్లంగిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. కప్పు ముల్లంగిలో 16 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్, ఫైబర్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ సి, బిలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఏమేం లాభాలు ఉన్నాయో చూద్దాం.
క్యాన్సర్ దూరం..
ముల్లంగిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం దూరమవుతుంది. ఎందుకంటే క్యాన్సర్‌కి కారణమయ్యే జన్యు ఉత్పరివర్తనాల నుండి కణాలను రక్షించే గ్లూకోసినోలేట్స్, సల్ఫర్ సమ్మేళనాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది క్యాన్సర్ కణితుల పెరుగుదలని కూడా తగ్గిస్తుంది.
Also Read : cracking knuckles : వేళ్ళు విరుస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి.
జీర్ణ సమస్యలు దూరం..
ముల్లంగిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల ప్రేగుల్లోని వ్యర్థాలు దూరమవుతాయి. మలబద్ధకం సమస్య దరిచేరదు. ముల్లంగి రసం పేగు కణజాలాన్ని రక్షిస్తుంది. గ్యాస్ట్రిక్ అల్సర్స్‌ని నివారించడంలో బాగా పనిచేస్తుంది దీనిని తీసుకుంటే పేగు పొట్టలో పుండ్లు, మంట సమస్య తగ్గుతుంది.
గుండె ఆరోగ్యం మెరుగ్గా..
ముల్లంగిలో ఎక్కువగా ఆంథోసైనిన్లు ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడతాయి. అదే విధంగా, ఈ ఆంథోసైనిన్లు శరీర జీవక్రియను పెంచుతుంది. శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడి, వాపు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
అదనంగా, ముల్లంగిలోని ఖనిజాలు, ఫ్లేవనాయిడ్స్, పొటాషియం, జింక్ సహా గుండెకి మేలు చేస్తాయి.
ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దూరం..
ముల్లంగిలో నేచురల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌ని దూరం చేస్తాయి. ముల్లంగిలోని ఓ ప్రోటీన్ RsAFP2 అణువుతో కలిసి క్యాండిడా అల్బికాన్స్ అనే ఫంగస్‌లో మరణాన్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, కాన్డిడియాసిస్ వంటి ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి.
డయాబెటిస్ దూరం..
షుగర్ పేషెంట్స్‌కి కూడా దీనిని తీసుకోవడం వల్ల సమస్యని కంట్రోల్ చేసుకోవచ్చు. ముల్లంగిలోని యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఇమ్యూనిటీని పెంచి గ్లూకోజ్ శోషణని పెంచుతాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
Also Read : Heart Health : ఇలా చేస్తే గుండె, బీపి, షుగర్ సమస్యలు దూరం
రక్తపోటు..
ముల్లంగిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకుంటే రక్తపోటు తగ్గుతుంది. రక్తనాళాలు సరిగ్గా పనిచేయడంలోనూ కీ రోల్ పోషిస్తుంది పొటాషియం. దీనిని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా మారి రక్తపోటు తగ్గుతుంది.
లివర్ హెల్త్..
తెల్ల ముల్లంగి రసం తీసుకోవడం కాలేయ సమస్యలు, ముఖ్యంగా హెపటైటిస్ నయమవుతుంది. అంతేకాకుండా పిత్తాశయ రాళ్ళు కూడా దూరమవుతాయి.
బరువు తగ్గడం..
ముల్లంగిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు తేలిగ్గా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండి కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి, దీనిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.
గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More :Health NewsandTelugu News
[ad_2]
Source link
Leave a Reply