మెడికల్ ఇన్సూరెన్స్‌ను ఎలా క్లెయిమ్‌ చేయాలి, ఏ డాక్యుమెంట్లు అవసరం?

[ad_1]

Medical Reimbursement: అనుకోకుండా వచ్చి పడే అనారోగ్య పరిస్థితులు రోగులను శారీరకంగా, మానసికంగా కుంగదీస్తాయి. రోగుల కుటుంబాలను ఆర్థికంగా ఇబ్బంది పెడతాయి. అలాంటి అనూహ్య పరిస్థితుల్లో అండగా నిలిచే సరైన ఆరోగ్య బీమా పథకం (Health Insurance Scheme) ఉండటం చాలా ముఖ్యం. ఒక ఆరోగ్య బీమా పథకాన్ని కొనుగోలు చేసేటప్పుడే, అది అందించే ప్రయోజనాలు, క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. 

రెండు రకాల ఆరోగ్య బీమా పాలసీలు ‍‌(Two types of health insurance policies)

ప్రస్తుతం, రెండు రకాల ఆరోగ్య బీమా పాలసీలు మార్కెట్‌లో ఉన్నాయి. 1. నగదు రహిత చికిత్స (Cashless treatment) 2. రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ ‍‌(Reimbursement Claim). నగదు రహిత చికిత్స పద్ధతిలో… మీ బీమా సంస్థే నేరుగా ఆసుపత్రితో మాట్లాడి బిల్లులు చెల్లిస్తుంది. బీమా కంపెనీ ఆమోదించిన నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో మాత్రమే ఇటువంటి క్లెయిమ్‌లు జరుగుతాయి. రీయింబర్స్‌మెంట్ పద్ధతిలో… చికిత్స పూర్తయిన తర్వాత రీయింబర్స్‌మెంట్ కోసం బీమా కంపెనీకి క్లెయిమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. సదరు బీమా కంపెనీ, మీ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రకారం చికిత్స ఖర్చును మీకు చెల్లిస్తుంది.

మీరు నాన్-నెట్‌వర్క్ హాస్పిటల్‌లో చికిత్స పొందినా కూడా రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ను ఫైల్ చేయవచ్చు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ చేయడానికి మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఫారాన్ని పూరించాలి. అన్ని హాస్పిటల్ బిల్లులు (Hospital bills), అవసరమైన పత్రాలను (Necessary documents) అందించాలి. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఆదాయపు పన్ను నిబంధనల (Income Tax Rules) గురించి అవగాహన ఉండటం కూడా ముఖ్యం.

క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌లో.. బీమా కంపెనీ, సదరు ఆసుపత్రి నేరుగా మాట్లాడుకుంటాయి కాబట్టి, పాలసీదారుకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ మెడికల్ రీయింబర్స్‌మెంట్ అంటే… ఆసుపత్రి ఖర్చులను ముందుగా మీరే భరించాలి, ఆ తర్వాత బీమా సంస్థ (Insurance Company) నుంచి వసూలు చేసుకోవాలి. కాబట్టి సంబంధిత బిల్లులు, డాక్యుమెంట్లను తప్పనిసరిగా సేకరించాలి, జాగ్రత్త చేయాలి. మీ చెల్లింపునకు సంబంధించిన అతి చిన్న రుజువును కూడా బీమా సంస్థకు సమర్పించాలి. రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి, చికిత్స సమయంలోనే మీరు ఒక ప్లాన్‌ ప్రకారం వ్యవహరిస్తే, సులభంగా & ఇబ్బందులు లేని రీయింబర్స్‌మెంట్ ప్రక్రియ వీలవుతుంది.

ముందుగా, మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఫారాన్ని సక్రమంగా నింపి సంతకం చేయాలి. థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌ (TPA) లేదా బీమా సంస్థ మీ హాస్పిటల్ బిల్లులు సహా అన్ని డాక్యుమెంట్‌లను నిశితంగా పరిశీలిస్తాయి. కాబట్టి, రీయింబర్స్‌మెంట్ కోసం ఫైల్‌ చేసే ముందు మీరు కూడా వాటిని క్షుణ్నంగా తనిఖీ చేయాలి. అన్ని డాక్యుమెంట్ల ఒరిజినల్స్ మీ దగ్గర ఉండాలి.

మెడికల్ రీయింబర్స్‌మెంట్ కోసం అవసరమైన పత్రాలు (Documents Required for Medical Reimbursement): 

– మీ బీమా పాలసీ లేదా పాలసీ కార్డ్ జిరాక్స్‌ 
– డాక్టర్‌ సంతకం చేసిన వైద్య ధృవీకరణ పత్రం
– ఎక్స్‌-రే సహా అన్ని పాథాలజీ రిపోర్ట్‌లు
– హాస్పిటల్ బిల్లులు, అసలు రశీదులు
– ఆసుపత్రి డిశ్చార్జ్ కార్డ్
– ఫార్మసీ బిల్లు
– ఇన్వెస్టిగేషన్‌ రిపోర్టులు (ఏవైనా ఉంటే)
– యాక్సిడెంటల్‌ క్లెయిమ్ అయితే FIR లేదా MLC కాపీ
– NEFT వివరాలతో క్రెడిట్ కార్డ్ సెటిల్‌మెంట్
– క్లెయిమ్ రూ.1 లక్ష కంటే ఎక్కువ అయితే KYC ఫారాన్ని సరిగ్గా పూరించాలి

మీరు సబ్మిట్‌ చేసిన పత్రాలను బీమా కంపెనీ సరిచూసుకోవాలి కాబట్టి, నగదు రహిత ప్రక్రియ కంటే రీయింబర్స్‌మెంట్ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతుంది. దీనికి మీకు కాస్త ఓపిక ఉండాలి, బీమా కంపెనీతో సహకరించడం అవసరం. కంపెనీ ఏదైనా ప్రశ్న అడిగితే సకాలంలో సమాధానం ఇవ్వాలి. మీ TPA లేదా బీమా సంస్థతో సత్సంబంధాలు ఉండటం చాలా ముఖ్యం. అదే సమయంలో, మెడికల్ రీయింబర్స్‌మెంట్ & నగదు రహిత చికిత్సల రూల్స్‌ తెలుసుకోవడం కూడా ముఖ్యమే.

మరో ఆసక్తికర కథనం: డబ్బును పెంచి, పన్నును తగ్గించే పీపీఎఫ్‌ అకౌంట్‌ను ఎలా ఓపెన్‌ చేయాలి?

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *