[ad_1]
Yatharth Hospital IPO:
కొన్ని నెలలుగా ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు బూమ్‌లోకి వచ్చాయి. చాలా మంది ఫండ్ మేనేజర్లు ఈ రంగాల్లోని షేర్లపై కన్నేశారు. కీలక స్థాయిలను గమనించి పెట్టుబడులు పెడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఐపీవోకు వస్తోంది యథార్థ్ హాస్పిటల్స్! దిల్లీ పరిసర ప్రాంతాల్లో మంచి బ్రాండ్ వాల్యూ ఉండటంతో ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరిగింది. మిగతా పోటీదారులతో పోలిస్తే కంపెనీ పీఈ ఆకర్షణీయంగా ఉండటంతో సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చని బ్రోకరేజీ కంపెనీలు సూచిస్తున్నాయి.
‘యథార్థ్ హాస్పిటల్ ఈ మధ్యే మూత్ర పిండాల మార్పిడి, ఎముక మజ్జ మార్పిడి, ఆంకాలజీ సేవలను ఆరంభించింది. ఈ ప్రత్యేక సేవల వల్ల మీడియం నుంచి లాంగ్‌టర్మ్‌లో కంపెనీకి ఖర్చులు పెరగనున్నాయి. అలాగే మార్జిన్‌పై ఒత్తిడి ఉంటుంది. ప్రభుత్వ ఒప్పందాల వల్లనే కంపెనీకి 34 శాతం వరకు ఆదాయం వస్తోంది. ఇది రుణదాతల రోజులు, మార్జిన్లను విస్తరిస్తుంది. అందుకే మేం సబ్‌స్క్రైబ్ రేటింగ్ ఇస్తున్నాం’ అని కెనరా బ్యాంకు సెక్యూరిటీస్ అనలిస్ట్ సంకితా అన్నారు.
దిల్లీ పరిసర ప్రాంతాల్లోని టాప్-10 ఆసుపత్రుల్లో యథార్థ్ హాస్పిటల్స్ ఒకటి. 1405 పడకల సామర్థ్యం ఉంది. ఇందులో 394 వరకు క్రిటికల్ కేర్‌కు కేటాయించారు. మిగతా పోటీదారులతో పోలిస్తే ఈ ఆసుపత్రి 20 శాతం తక్కువగా ఫీజులు తీసుకుంటుంది. పైగా ఉత్తర్‌ప్రదేశ్‌లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఐపీవో అప్పర్ బ్యాండ్ రూ.300గా నిర్ణయించారు. పీఈతో పోలిస్తే 39.2 రెట్లకే షేర్లు దొరుకుతున్నాయి.
‘యథార్థ్ హాస్పిటల్స్ టాప్ లైన్ గ్రోథ్, మార్జిన్లు నిలకడగా ఉన్నాయి. వ్యూహాత్మక విలీనాలు, మెడికల్ టూరిజం పుంజుకోవడం, వైద్య రంగం భవిష్యత్తు మెరుగ్గా ఉండటంతో మేం సబ్‌స్క్రైబ్ రేటింగ్ ఇస్తున్నాం’ అని జియోజిత్ ఫైనాన్షిల్ సర్వీసెస్ తెలిపింది. ఆదాయంతో పోలిస్తే అపోలో హాస్పిటల్స్ షేర్లు 91 రెట్లు అధిక ధరకు ట్రేడవుతున్నాయి. ఫోర్టిస్ హెల్త్‌కేర్ 43 రెట్లు, నారాయణ హృదయాలయ 35 రెట్లు, మాక్స్ హెల్త్‌కేర్ 54 రెట్ల వద్ద ట్రేడవుతున్నాయి. యథార్థ్ షేర్లు ఇంతకన్నా తక్కువకే దొరుకుతున్నాయి.
యథార్థ్ హాస్పిటల్స్ అండ్ ట్రామా కేర్ సర్వీసెస్ ఐపీవో జులై 26న మొదలై 28న ముగుస్తుంది. ప్రెష్ సేల్ కింద రూ.490 కోట్లు సేకరిస్తున్నారు. ఆఫర్ ఫర్ సేల్ కింద 65,51,690 షేర్లు విక్రయిస్తున్నారు. ధరల శ్రేణిని రూ.285-300గా నిర్ణయించారు. అప్పులు తీర్చేందుకు, క్యాపిటల్ ఎక్స్పెండీచర్ ఖర్చులు, విలీనం ఇతర వ్యూహాత్మక కార్యక్రమాల కోసం ఈ నిధులు ఉపయోగిస్తారు. ఇష్యూలో సగం క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లు, 15 శాతం నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు.
Also Read: మీ డబ్బును పెంచే ఎస్బీఐ స్పెషల్ స్కీమ్, ఆగస్టు 15 వరకే అవకాశం
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
[ad_2]
Source link
Leave a Reply