యాంటీబయాటిక్స్ వాడుతున్నారా.. జాగ్రత్త..

[ad_1]

సాధారణంగా మనకి జలుబు, ఇతర సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది యాంటీ బయాటిక్స్ వాడతారు. ఇవి కొన్నిసార్లు డాక్టర్స్ సజెస్ట్ చేస్తే మరి కొన్నిసార్లు నేరుగా తీసుకుంటారు. అంతకు ముందు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్, తెలిసిన వారు చెప్పడం వల్ల యాంటీ బయాటిక్స్ ఎక్కువగా తీసుకుంటారు. కానీ, మీలో ఎంత మందికి తెలుసు.. దీని వల్ల ప్రాణాలకే ప్రమాదమని.. అవును కొన్ని పరిశోధనలు, పరిశోధకులు దీని గురించి చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

WHO ప్రకారం..

who-

యాంటీ బయాటిక్స్ ఎక్కువ వాడడం మంచిది కాదని WHO చెబుతోంది. వీటిని ఎక్కువగా వాడడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని సూచిస్తోంది. కానీ, మనలో చాలా మంది ఇప్పటికే వీటిని విరివిగా వాడుతున్నారు. ఏదైనా సమస్య వచ్చిందంటే చాలు మెడికల్ షాప్‌కి వెళ్ళి యాంటీ బయాటిక్స్ తెచ్చేసుకుంటున్నారు. అయితే, వీటి వల్ల సమస్య తగ్గుతుంది. కానీ, అది కొన్ని సందర్భాల్లో మరికొన్ని సందర్భాల్లో అక్కడే ప్రమాదకరమైన సమస్యగా మారుతుందని చెబుతున్నాయి అధ్యయనాలు.

డాక్టర్స్ ఏమంటున్నారంటే..

డాక్టర్స్ ఏమంటున్నారంటే..

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌కి వ్యతిరేకంగా పనిచేసే మందులే యాంటీ బయాటిక్స్. వీటిని వేసుకోవడం వల్ల బ్యాక్టీరియా పెరుగుదల తగ్గుతుంది. అయితే, వీటిని ఎప్పుడు తీసుకోవాలంటే, మనకి వచ్చిన సమస్య గురించి డాక్టర్స్‌ని కలిసి, వారు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ద్వారనే తీసుకోవాలని డాక్టర్ నేహా గుప్తా చెబుతున్నారు. (Dr Neha Gupta, Consultant- Infectious Diseases, Fortis Memorial Research Institute, Gurugram and Founder, NG Swastha, Infectious Diseases Clinic, Gurgaon )

ఎందుకంటే..

ఎందుకంటే..

సాధారణంగా యాంటీ బయాటిక్స్ అనేవి ఆరోగ్య సమస్యలు రావడం, వాటికి కారణమైన బ్యాక్టీరియాపై ఆధారపడి పనిచేస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అనేవి వేర్వేరు. సమస్య ఏదో గుర్తించి డాక్టర్స్ సూచించిన ప్రకారమే యాంటీ బయాటిక్స్ తీసుకోవాలి.
Also Read : Dry Fruits : వీటిని నానబెట్టి తింటే క్యాన్సర్స్ ప్రమాదం తగ్గుతుందట..

వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే..

వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే..

ఓ వ్యక్తికి జ్వరం, దగ్గు, జలుబు, ముక్కు కారటం, శరీరంలో నొప్పి ఉంటే అది వైరల్ ఇన్ఫెక్షన్. ఇది 2 రోజులు ఎక్కువగా ఉండి తర్వాత తగ్గిపోతుంది. దగ్గు, అతిసారం వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్‌ని సూచిస్తాయి.
Also Read : Irresponsible wife : నా భార్య జీతం మొత్తం షాపింగ్‌ చేస్తోంది.. అడిగితే..

బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఉంటే..

బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఉంటే..

సడెన్‌గా గొంతు నొప్పి, జ్వరం, తలనొప్పి, కఫంతో కూడిన దగ్గు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్‌ని సూచిస్తాయి. ఇవి 3, 4 రోజుల తర్వాత కూడా పెరుగుతాయి. వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత, ఈ సమస్య వస్తుంది. కాబట్టి వచ్చిన సమస్య ఏదని గుర్తించడం చాలా ముఖ్యం. వైరల్ వల్ల వచ్చిందా, బ్యాక్టీరియా వల్ల వచ్చిందా అనేది ముందుగా తెలుసుకోవాలి. మెడికల్ టెస్టులు మాత్రమే వీటిని సరిగ్గా నిర్ధారిస్తాయి.

ఎంత తీసుకోవాలి..

ఎంత తీసుకోవాలి..

అదే విధంగా యాంటీ బయాటిక్స్ తీసుకునే డోసేజ్ గురించి కూడా తెలిసి ఉండాలని డాక్టర్ నేహా గుప్తా చెబుతున్నారు. వీటిని ఎలా పడితే అలా తీసుకుంటే కాలేయానికి మంచిది కాదు. అలానే చేస్తే అవి పనిచేయకపోవడం, దద్దుర్లు, నరాల సమస్యలకి కారణమవుతాయి. విరేచనాలు కూడా అవుతాయి. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త అవసరం.
Also Read : Eyestrain : కళ్ళు మంటగా అనిపిస్తున్నాయా.. ఇలా చేయండి…

ఎప్పుడు తీసుకోవాలి..

ఎప్పుడు తీసుకోవాలి..

అదే విధంగా యాంటీ బయాటిక్స్ ఏ టైమ్‌లో తీసుకుంటున్నామనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని చెబుతున్నారు డాక్టర్. మనం ఏ ప్రదేశంలో ఉంటున్నాం. వచ్చిన ఇన్ఫెక్షన్‌ని బట్టి వీటిని తీసుకోవాలి. వీటిని సరిగ్గా తీసుకోకపోతే బ్యాక్టీరియా అనేది రక్తంతో పాటు ఇతర అవయవాలకు కూడా వ్యాపించి పనితీరుని దెబ్బతీస్తాయి. అదే విధంగా, కిడ్నీ, ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతాయి.

ఈ జాగ్రత్తలు అవసరం..

ఈ జాగ్రత్తలు అవసరం..

యాంటీ బయాటిక్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలని డాక్టర్ నేహా గుప్తా చెబుతున్నారు.
యాంటీ బయాటిక్స్ తీసుకున్నప్పుడు స్పైసీ ఫుడ్‌ తీసుకోవద్దు. దీని వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.
కొన్ని మెడిసిన్స్‌ని పరగడపున మాత్రమే తీసుకోవాలి. దీంతో మెడిసిన్‌ని బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి.
మరికొన్నింటిని ఆహారం తర్వాతే తీసుకోవాలి.
అదే విధంగా, యాంటీ బయాటిక్స్ తీసుకున్నప్పుడు వేరే మందుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం వాడే కొన్ని మెడిసిన్స్‌కి, ఈ మెడిసిన్స్‌కి పడకపోవచ్చు. దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
సరైన మోతాదులో, సరైన టైమ్‌లో వీటిని తీసుకోవడం చాలా ముఖ్యం.
యాంటీ బయాటిక్స్ తీసుకునేటప్పుడు ఏ చిన్న తప్పు చేసిన అవి క్యాన్సర్స్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల ముప్పుని కలిగిస్తుంది.
వీటిని ఎక్కువగా వాడడాన్ని చాలా రాష్ట్రాల్లో నిరోధించారు.
ఈ యాంటీ బయాటిక్స్ ఎప్పుడైనా సరే డాక్టర్స్ సూచించాకే వారి సలహా ప్రకారమే తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *