[ad_1]
ప్రయోగంలో ఎలాంటి మార్పులు లేకపోతే ముందుగా నిర్ణయించిన ప్రకారం ‘లునా-25’ ఈనెల 21న చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ కావాల్సి ఉంది. ‘ ప్రీ-ల్యాండింగ్ కక్ష్యలోకి బదిలీ చేయడానికి థ్రస్ట్ విడుదల చేశాం’ అని రోస్కోస్మోస్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఆపరేషన్ సమయంలో ఆటోమేటిక్ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి ఏర్పడింది.. ఇది విన్యాసాలను నిర్వహించడానికి అనుమతించలేదు.’ అని వివరించింది.
దాదాపు ఐదు దశాబ్దాల అనంతరం మొదటిసారి చంద్రుడిపై పరిశోధనలకు రష్యా వ్యోమనౌకను ప్రయోగించింది. ‘లూనా-25’ను కేవలం 11 రోజుల్లోనే చంద్రుడిపై దిగేందుకు రష్యా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఇదే సమయంలో భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 అన్ని దశలను పూర్తిచేసుకొని మరో మూడు రోజుల్లో చంద్రుడిపై దిగేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోగా.. రెండు డీ-బూస్టింగ్ విన్యాసాలు పూర్తయ్యాయి. అన్ని అనుకూలిస్తే ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ కాలు మోపనుంది.
కాగా, చంద్రుడిపై ప్రయోగం గురించి రోస్కోస్మోస్ చీఫ్ యూరి బోరిసోవ్.. అధ్యక్షుడి వ్లాదిమిర్ పుతిన్‌కు వివరిస్తూ ఇటువంటి మిషన్లు ప్రమాదకరమని, దాదాపు 70 శాతం మాత్రమే విజయవంతమైనట్టు దాఖలాలు ఉన్నాయని తెలిపారు. లూనా-25 ఏడాది పాటు చంద్రునిపై ఉండి, అక్కడ నమూనాలను సేకరించడం.. మట్టిని విశ్లేషించడం వంటి పనిని నిర్వహిస్తుంది. ల్యాండర్‌పై అమర్చిన కెమెరాలు ఇప్పటికే అంతరిక్షం నుంచి భూమి, చంద్రుని సుదూర చిత్రాలను తీశాయి.
Read More Latest Science & Technology News And Telugu News
[ad_2]
Source link
Leave a Reply