రిటైర్మెంటుకు ముందే ఉద్యోగి మరణిస్తే! భార్యకు పింఛన్‌ ఎప్పుడొస్తుంది!!

[ad_1]

Pension Update:

ప్రైవేటు ఉద్యోగులంతా నెలనెలా ఎంప్లాయీ ప్రావిడెండ్‌ ఫండ్‌లో (EPF) డబ్బులు జమ చేస్తుంటారు. ఇందులో కొంత శాతం ఎంప్లాయీ పెన్షన్‌ స్కీమ్‌ (EPS)కు వెళ్లే సంగతి తెలిసిందే. సర్వీసులో పదేళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ పింఛన్‌కు అర్హత సాధిస్తారు. ఉద్యోగి వయసు 58కి చేరుకున్నా లేదంటే పదవీ విరమణ పొందిన వెంటనే పింఛన్‌ మొదలవుతుంది. అయితే ఉద్యోగి ముందే మరణిస్తే భాగస్వామికి పింఛను వస్తుందా? ఏకమొత్తంలో ఇస్తారా? లేదా మరణించిన ఉద్యోగికి 58 ఏళ్ల వయసు వచ్చేంత వరకు వేచి చూడాలా?

ఏక మొత్తంలో ఇవ్వరు!

ఉద్యోగి పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకోగానే అర్హత సాధించినా పదవీ విరమణ పొందాకే పింఛను ఇస్తారు. సాధారణంగా 58 ఏళ్ల నుంచి ఫించన్‌ మొదలవుతుంది. ఈపీఎఫ్‌, ఈపీఎస్‌ కంట్రిబ్యూషన్‌ సమాంతరంగా కొనసాగినా.. ఉద్యోగి ముందుగానే మరణిస్తే ఈపీఎఫ్‌లోని మొత్తం డబ్బును జీవిత భాగస్వామికి అందిస్తారు. అయితే పింఛన్ విషయంలో మాత్రం అలా ఉండదు. ఏకమొత్తంలో పింఛన్‌ ఇవ్వాలన్న నిబంధన లేదు. ‘పింఛన్‌కు అర్హత సాధించిన ఉద్యోగి 58 ఏళ్ల కన్నా ముందే మరణిస్తే జీవిత భాగస్వామికి ప్రతి నెలా వితంతు పింఛన్‌ ఇస్తారు’ అని ఇండస్‌ లా పాట్నర్‌ వైభవ్‌ భరద్వాజ్‌ అన్నారు.

ముందుగా మరణిస్తే తక్కువే!

ఉద్యోగి ముందుగా మరణించినా జీవిత భాగస్వామి వెంటనే పింఛన్‌ పొందొచ్చు. అతడు/ఆమె మరణించిన ఈపీఎస్‌ మెంబర్‌కు 58 ఏళ్లు వచ్చేంత వరకు వేచిచూడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎంత పింఛన్‌ అందుకుంటారన్నది కొన్ని సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సభ్యుడు పదవీ విరమణ పొందితే జీతంలో సగం వరకు పింఛన్‌ వస్తుంది. ఒకవేళ ఉద్యోగి పదవీ విమరణ వయసుకు ముందే మరణిస్తే.. అదే రోజు రిటైర్‌ అయితే వచ్చే డబ్బుకు సమానంగా జీవిత భాగస్వామికి పింఛన్‌ అందజేస్తారు.

నెలా నెలా పింఛన్!

పదవీ విమరణ వయసు, మరణించిన తేదీ అంతరాన్ని బట్టి అందుకొనే పింఛన్‌ మొత్తం మారుతుందని నిపుణులు అంటున్నారు. ఉద్యోగి రిటైర్మెంట్‌ వయసుకు ఎంత ముందుగా మరణిస్తే అంత తక్కువ పింఛన్‌ వస్తుంది. ‘జీవిత భాగస్వామి అందుకొనే పింఛన్ చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. పదవీ విమరణ కన్నా చాలా ముందుగా మరణిస్తే జీవిత భాగస్వామి అందుకొనే పింఛన్‌ చాలా తక్కువగా ఉంటుంది. అయితే పదేళ్ల సర్వీసు పూర్తి చేసిన సందర్భంలో కనీస వితంతు పింఛన్ రూ.1000గా ఉంటుంది’ అని డెలాయిట్‌ ఇండియా, పాట్నర్‌ తపతి ఘోష్ అన్నారు.

Also Read: లాభం, ఆదాయం రెండూ మిస్‌ మ్యాచింగ్‌ – విప్రో ప్రాఫిట్‌ ₹2,870 కోట్లు

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *